1950 సంవత్సరంలో విడుదలైన ప్రతిభా వారి సంస్థ నిర్మించిన స్వప్నసుందరి చిత్రం నుండి ఘంటసాల పాడిన "నిజమాయే కల నిజమాయే" అనే ఈ ఏకగళగీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది సి.ఆర్.సుబ్బురామన్. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, అంజలీదేవి, జి.వరలక్ష్మి, ముక్కామల, కె.శివరావు. ఈ చిత్రానికి నిర్మాత ఘంటసాల బలరామయ్య మరియు దర్శకుడు ఘంటసాల బలరామయ్య. దీనిని అక్కినేని పై చిత్రీకరించారు. ఈ చిత్రం 09.11.1950 న విడుదలైంది.
| చిత్రం: | స్వప్న సుందరి (1950) | ||
| గానం: | ఘంటసాల | ||
| సంగీతం: | సి.ఆర్.సుబ్బురామన్ | ||
| రచన: | సముద్రాల రాఘవాచార్య | ||
| పల్లవి: | నిజమాయె, నిజమాయె కల నిజమాయె | ||
| ఇలలో లేని సంబరమాయె | |||
| కలలో నీ కన్నెనే కానగనాయె -2 | |||
| నిజమాయె, నిజమాయే.. | |||
| చరణం: | తీయని వలపార వయ్యారము మీర | ||
| నవవయోవిలాసినీ నన్నే దరిచేర | |||
| తీయని వలపార వయ్యారము మీర | |||
| నవవయోవిలాసినీ నన్నే దరిచేర | |||
| వగదీరా చూచె మిఠారి | |||
| కురిసెనురా నవ్వులా పువ్వుల వాన | |||
| కురిసెనురా నవ్వులా పువ్వుల వాన | |||
| నిజమాయె, నిజమాయే.. | |||
| చరణం: | తళుకుల పలుకుల ఆశాసలూరాజేసి | ||
| మనసార చేత చెయి వేసీ | |||
| తళుకుల పలుకుల ఆశాసలూరాజేసి | |||
| మనసార చేత చెయి వేసీ | |||
| మరువని బాసలుజేసీ | |||
| మరువని బాసలుజేసీ | |||
| నమ్మించెరా నన్ను స్వప్నసుందరీ | |||
| నమ్మించెరా నన్ను స్వప్నసుందరీ | |||
| నా స్వప్నసుందరీ నిజమాయె | |||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి