ఈ రోజు భారత కోకిల గా కీర్తించబడిన శ్రీమతి సరోజినీ నాయుడు 135వ పుట్టిన రోజు నేడు. 1879 ఫిబ్రవరి 13 న హైదరాబాదు లో జన్మించిన సరోజిని తల్లిదండ్రులు శ్రీమతి వరద సుందరి మరియు శ్రీ అఘోరనాథ్ చటో పాధ్యాయ దంపతులు. సరోజిని తన 13 వ ఏటనే సరోవర రాణి అనే 1300 పంక్తులు గల రచన చేశారట. విదేశము లో విద్యనభ్యసించి తిరిగి వచ్చిన తరువాత ప్రముఖ వైద్య అధికారి శ్రీ గోవిందరాజులు నాయుడును వివాహమాడి సరోజిని నాయుడు అయింది. ఈమె భారత దేశపు మొదటి గవర్నరు. వీరి కుమార్తె పద్మజా నాయుడు కూడ గవర్నరుగా పనిచేసారు. తెలుగింటి కోడలైన సరోజిని స్త్రీజాతికే శిరోమణి వంటిది. స్వాతంత్ర్య సముపార్జనలో మరపురాని పాత్ర వహించి, మహాత్మా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని, బ్రిటిష్ శాసనాలను ధిక్కరించిన ధీరోదాత్త చరిత సరోజినీ దేవి. ఆయమ్మ గుర్తుగా గూగుల్ వారు ప్రత్యేక డూడుల్ తయారుచేయడం ముదావహం! సరోజినమ్మ పై ఘంటసాల పాడిన చక్కని గీతం "అమ్మా! సరోజినీదేవి పరిపూర్ణ సువర్ణ కళామయజీవి". ఘంటసాల గళంలో మన తెలుగింటి ఆడపడుచును ఎల్లప్పుడూ గుర్తుంచుకునే అదృష్టం మనందరిదీ. ఈ పాట రచన తోలేటి, సంగీతం మరియు గానం ఘంటసాల.
Thanks to Sri Vinjamuri Apparao garu for posting the video clip to You Tube
Thanks to Google for Sarojini Naidu's Doodle.
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
సాకీ: | అమ్మా! సరోజినీ దేవి! | ||
పల్లవి: | అమ్మా! సరోజినీ దేవి! | ||
పరిపూర్ణ సువర్ణ కళామయ జీవి | |||
అమ్మా! సరోజినీ దేవి! | |||
చరణం: | స్త్రీజాతి శిరోమణివమ్మ | ||
మా జాతి గులాబీ రెమ్మ | | స్త్రీజాతి | | ||
మధురాల వరాల స్వరాలు పల్కు | |||
మంజుల కోయిలవమ్మా | |||
చరణం: | స్వారాజ్యత్ సమరకరాసి | | స్వారాజ్య | | |
చరితార్థము సద్గుణరాశి | |||
వర వీరవిహార స్వరాజ్యస్సమర | |||
ధ్రువతారవు నీవమ్మా | |||
అమ్మా! సరోజినీ దేవి! | |||
చరణం: | నీ జీవిత కావ్యాలాపం | ||
విశ్వానికి ప్రేమ కలాపం | |||
అనురాగ తరంగ మృదంగ భంగిమల | |||
అమృతము చిందితివమ్మా! | |||
అమ్మా! సరోజినీ దేవి! | |||
అమ్మా! ……. సరోజినీ దేవి! |
మీ ప్రయత్నమునకు , మీ శ్రద్ధ కు మా క్రుతాంజలులు .
రిప్లయితొలగించండిచాల బాగుంది.
రిప్లయితొలగించండి