11, ఫిబ్రవరి 2014, మంగళవారం

మాస్టారి సునిశితమైన సంగీత ప్రయోగాలలో వాసికెక్కిన చారుకేశి.

చారుకేశి అంటే చక్కని కురులు గలది అని అర్ధం. మాస్టారి సునిశితమైన సంగీత ప్రయోగాలలో వాసికెక్కిన రాగాల రాశి చారుకేశిదానిని భక్తికి, విరక్తికి, అనురక్తికి, శృంగారానికి, సందేశానికి, శోకానికి, శాస్త్రీయ సరిపాకానికి  ఆసక్తిగా వాడిన ఘనత ఘంటసాలదేదేవుని మాయను వర్ణించే భక్తిపూరిత గానంలో, పద్యంలోనూ, నేపథ్యంలోనూ హృద్యంగా తథ్యంగా వినిపించేది చారుకేశి. గళవేల్పు గళంలో చారుకేశి శిలలను కరిగిస్తుంది, నయనాలను అశ్రుపూరితం చేసి గొంతులో భక్తి పరవశమైన భావోద్వేగాన్ని పలికిస్తుంది. నియంతయైన ప్రభువును హెచ్చరించే సూచనలో సందేశప్రాయంగా వినిపిస్తుంది. పరిస్థితులు ప్రతికూలమైన పడతి ఊరువదలి కారు చీకటిలో కలసి సాగే వేళ శోకభరితమైన హృదయావేదనను వినిపిస్తుంది. రాగఝరులు రుచిచూడాలని తహతహలాడే మనకు ఈసారి  చంద్రమౌళి గారు రాగశాలలోచారుకేశి రసాన్నుంచారు. మరి ఆస్వాదిద్దామా! 


అన్నిరాగాలకూ మూలం మేళకర్త రాగాలు.  వాటి సంఖ్య 72. అందులో చెరిసగం, శుద్ధ-ప్రతిమధ్యమ స్వరాధారంగా విభజించిన 36 రాగాల కూటమి. వీటన్నిటికి మూలం 12 స్వరాలు. మేళకర్తల కర్త, ఈ 12 స్వరాల మార్పిడి మరియు మేళనము (permutation combination) ల లబ్ధము. సప్తస్వరాలలోని రిషభ-గాంధారాలు, దైవత-నిషాదాలు మారుతుంటే కలిగేవే ఆ రాగాలు.  ఆ 'రి-గ, ద-ని'ల లోనూ కోమల-తీవ్ర ప్రభేదాలున్నాయి గనుక, 'స్వరములు ఏడైనా రాగాలెన్నో! స్వరాల కోమలత-తీవ్రత ఆధారంగా 7 స్వరాలలోనుండి 12 స్వరాల సృష్టి. మూర్ఛనలోని ఆరోహణావరోహణములలో 7 స్వరాలుంటే అది మేళకర్త రాగం లేదా జనక రాగం. మూర్చనలో 4,5,6 స్వరాలో, విభిన్నస్వరాలో ఉండగా అది 12 స్వరశిఖరాలనుండి ప్రవహించి వేలకొలది రాగాలై, గాయనానంద సముద్రంలో కలిసి ఒక్కటయ్యెడి ఓంకారమే. అన్ని మేళకర్తరాగాలూ సుప్రసిద్ధంకావు. ప్రసిద్ధమైనవి కొన్నే. అందులోనూ చిత్రసంగీతంలో వినబడేవి : చక్రవాకం, ఖరహరప్రియ, చారుకేశి, శంకరాభరణం (శుద్ధ మధ్యమ రాగాలు),  పంతువరాళి, షణ్ముఖప్రియ, సింహేంద్ర మధ్యమ, కల్యాణి (ప్రతిమధ్యమ రాగాలు). కల్యాణి రాగంలో వందలాది పాటలే ఉన్నాయి. మిగిలిన ప్రముఖ రాగాలలోని పాటల సంఖ్య తక్కువే.

చారుకేశి రాగం ఘంటసాలకు ఆత్మీయమైనదనే మనకు తెలుస్తుంది. ఆయన స్వరకల్పన చేసిన చిత్త్రాలలో, "భళిభళి భళిభళి దేవ" వంటి చారుకేశి లేకున్నా ఓ పద్యమో, చివరికి నేపథ్యంగానైనా చారుకేశి రాగం ఉంటుంది. తను ఆలపించిన భగవద్గీతలోని మూడు శ్లోకాలకు ఆ ఘనత దక్కింది. ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన అన్నిచిత్రాలలోనున్న అన్నిపాటలనూ అభ్యసించి, ఆయన చేసిన రాగప్రయోగాలను అధ్యయనం చేయగా అదే ఒక పరిశోధనగా మారుతుంది. ఏకారణంగానో  రసజ్ఞులైన ఆంధ్రులు ఈ అంశాన్ని గమనించినట్లులేదు. ఆ బృహత్కార్యానికి నేను అశక్తుడను గనుక, పైపైన వాటిని గురించి, కరపునర్లేపనమన్నట్లు, ఇక్కడ ముచ్చటించుకోవడమే సులభసాధ్యం.

చారుకేశి ౨౬వ మేళకర్త రాగం. "వేంకటముఖి" సంప్రదాయంలో ఈరాగం పేరు "తరంగిణి". స్వరస్థానాలు:  , ప లతోబాటు చతుశ్రుతి రిషభం, అంతరగాంధారం, శుద్ధమధ్యమం, శుద్ధదైవతం మరియు కైశికినిషాదం. సౌలభ్యానికొరకు  పూర్వాంగం శంకరాభరణం మరియు ఉత్తరాంగం తోడిరాగ స్వరాలు అనకోవచ్చు. సంవాది స్వరాలు: స-ప, స-మ, రి-ప, మ-ని, మ-స, ప-స సుప్రసిద్ధమైన ఆదితాళ నిబద్ధమైన త్యాగరరాజు వారి "ఆడమోడిగలదా" చారుకేశికే లక్షణప్రదమైన కృతి. మరొక్క ప్రసిద్ధమైన పాట చాపుతాళయుక్తమైన స్వాతిరునాళ్ రచన"కృపయా పాలయ శౌరే". గ్రహభేద క్రియలోను ప్రసిద్ధరాగాలను పలుకే మేళమిది.   చారుకేశిరాగం యొక్క మధ్యమ గ్రహంలో గౌరీమనోహరి, పంచమ గ్రహంలో నాటకప్రియ మరియు నిషాద గ్రహంలో వాచస్పతిరాగాలు ఉద్భవిస్తాయి. 

చారుకేశిరాగముయొక్క స్వరసంచారములను, సంక్షిప్త రాగ విస్తారమును ఇక్కడ వినవచ్చు 

చారుకేశిరాగంలో ఘంటసాల పాడిన పాటలలో శుద్ధశాస్త్రీయమైన కోవకుచిందినది “సుగుణధామా రామా”. శిలను కరిగించి అందులో నారద తుంబురుల వీణలు ఇమిడిపోగా ఆంజనేయుని గానామృతం ఆ పరుష పేటికను నీళ్ళు గావించే సన్నివేశం. వీరాంజనేయ చిత్రంలోని “గమపదనిసరిగా (సుగుణధామా) అంటూ రెండు గాంధారాలను దాటి పై పంచమాన్ని ఆదిలోనే సోకిన ఆయన గళంలో భక్తిరసమే ప్రవహిస్తున్నది హృదయినేత్రాలకు సగోచరమే.
పాట: సుగుణధామా, చిత్రం: వీరాంజనేయభక్తిభావ ప్రకటనకు చారుకేశి చాలా సొగసైన రాగమని తెలుసుకొన్న ఘంటసాల “పాడనా ప్రభూ పాడనా” అంటూ దేవునికే తనగానాన్ని అంకితం చేశారా అనే విధంగా పాడిన భావగర్భితమైన గేయమిది.


పాట: పాడనా ప్రభూ


చారుకేశి స్వరాలలో తీవ్రమైన ఆవేదనతో మునిగిన విషాదభావాన్ని పైకెత్తి చూపడం ఘంటసాల గళాభినయానికే ఎరుక! పాదపపా పాప పాదపపదమా గాగమపమ  గాగమపా గాగమపమ గమగరిస పానిసరి....మరిమరిసని రిససస (పపద పపద సాని దానిదప)
చీకటిలో  కారు చీకటిలో...... కాలమనే కడలిలో శోకమనె పడవలో ఏ దరికో...  ఏ జతకో.. 
పాట: చీకటిలో కారు చీకటిలో, చిత్రం: మనుషులు మారాలి 

ఇదే రాగాన్ని నీతిబోధకంగా పరోక్షంగా హెచ్చరించి ఒక సందేశాన్ని ఉత్సాహకరంగా అందించడమూ, ఆ భావాలకు ఏ స్వరాలను వాడాలో, ఏభావంతో పాడాలో అందులో మాస్టారు పటిష్టమైన నేర్పరి. "ప్రజలమాటను మీరక రాజ్యమేలు" అనే సాకిలోని గమకప్రయోగాలు చారుకేశి రాగ సంచార జీవస్వరాలను వెదజల్లి, "మంచితనము కలకాలం నిలిచియుండును"  (మపప పపద నిదపపపప మపమగామపా)
పాట: మంచితనము; చిత్రం: బందిపోటు
ఘంటసాల సినిమాసంగీతానికి వచ్చిన ఆ తరుణంలోనె పాడిన “ఎంతమంచిదానవోయమ్మ” అపురూపమైన  అతిమందర శ్రుతిలో ఆలపించిన విలక్షణమైన గేయం. ఆరోజులలో తను పాడిన నిధాన ప్రసన్నమధుర భావగీతంలా మనకు వినిపిస్తుంది.  అక్కడక్కడ విషాదభరితమైన ప్రాత్ర గుణస్తుతి అలనాటి చిత్రాల పద్ధతి.
పాట: ఎంత మంచిదానవో
అదే రాగస్వరాలలో శృంగార రసావిష్కరణం గావించే నైపుణ్యం తను స్వరకల్పనచేసి పాడించిన ఈ పాటలో మనోహరంగా స్ఫురిస్తుంది. 
(పాట: ఎవరో)

దాటుస్వరాల విన్యాసంలో ఒక క్రొత్తరాగాన్నే వింటున్నామన్న భ్రమకలింగిచే ఈ పాటను మాస్టారు కన్నడ భాషలోనూ (పురందరదాసు రచన) ఆలపించారు. “ససగగమామ పదదద పదపమ పనినిదాపామమగా” స్వరాలవెనుక సాగే కరుణారన్ని కురియించేపాట ఇది.
(పాట: మమతలు లేని)


భగవద్గీతలోని ఐదవ అధ్యాయం సన్యాసయోగం. ఆ విరక్తి స్పర్శను కలిగించేవి చారుకేశిరాగాలే. ఒక్కరాగంలోనే మూడు శ్లోకాలను పాడినా, విడివిడిగా ఆ వైవిధ్యత మనకు శ్రవణవేద్యమే  
(భగవద్గీతా శ్లోకత్రయం)


ఊరేదిపేరేది (రాజమకుటం/మాస్టర్ వేణు (రజనీకాంత రావు)/నాగరాజు)
(కొంత భాగం మాత్రం - ఇది రాగమాలిక) 

ఈపగలురేయిగ (సిరిసంపదలు/ఆత్రేయ/మా.వేణు)   


భళి భళి భళి భళి దేవ (మాయాబజార్/ఘంటసాల/పింగళి)  


రాగమాలికల కూర్పుకు చారుకేశిరాగం అతిప్రశస్తమైన సుస్చరముత్యం.  “భళిభళి భళిభళి దేవా” గాక,   “విన్నావ యశోదమ్మ” పాటలో రాగమాలికగానూ చారుకేశి వినిపిస్తుంది (మాయాబజార్).  
 శాస్త్రీయరాగాల ఆధారంతో స్వరకల్పనలు చేసె రసికుల మెప్పుగడించడం సులభసాధ్యం కాదు.  ఒక రాగాన్ని ప్రయోగించాలి అన్న ఆలోచనకన్నా, ఏ సన్నివేశానికి ఏస్వరాలు ఆ భావాలను కలిగిస్తాయో ఆ స్వరాలనే మాస్టారు సంయోజించి ఉంటారా అనిపిస్తుంది. మేళకర్త రాగాలను పౌరాణిక, చారిత్రిక, జానపదీయ చిత్రాలలో మనకు వినిపించినా, ఘంటసాల కొన్నిటిని సామాజిక చిత్రాల్లోనూ ప్రవేశబెట్టారు. అలాంటి అపురూప రాగాల్లో చారుకేశి ఒకటి. ఆ రాగాధారితమైన కొన్ని పాటలను, పద్యాలను ఈ రోజు నెమరువేసుకోవడం ఆ మహాగాయకుని జ్ఞాపకగానవిగ్రహానికి చిన్నస్మరణార్చన.


   
ఈ రోజే మాస్టారు మనను వదలి వెళ్ళిన రోజు,
 కాని వారి గానం అజరామరం 

కృతజ్ఞతలు: వీడియో కలాలను అంతర్జాలములో పొందుపరచిన బ్యాంక్ ఆఫ్ ఘంటసాల మరియు యు ట్యూబ్ వారికి. 

5 వ్యాఖ్యలు:

 1. This was an exhilarating journey into th mystic world of Ragas and their prayogas. Enjoyed each and every line of this vyakya as well as each and every song attached.

  Thanks for the effort.

  Srinivasan

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. Dear Srinivasan, thanks for your comments. It boosted our morale and certainly you will expect more in the coming future. Thanks to Chandra Mowly garu for making this happen.

   తొలగించు
 2. Dear Srinivasan, Many thanks for your comments. Your inspiring words surely fuel our thoughts to bring out more 'raagaavishkaranams' from the Master's evergreen music depository, in the days to come.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Dear Srinivasan, Many thanks for your comments. Your inspiring words surely fuel our thoughts to bring out more 'raagaavishkaranams' from the Master's evergreen music depository, in the days to come.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అజ్ఞాతనవంబర్ 17, 2014

  Dear Surya garu and Chandra mouli garu, A very good effort in Analysing the Raagaas of the great songs of our beloved Maastaa ru !! Thanks for posting the Audio/ Video Links too !! Enjoyed . Pl keep going your very good job.
  Raja gopal rtummar@yahoo.com

  ప్రత్యుత్తరంతొలగించు

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి- అంతస్తులు -1965 చి-అందం కోసం పందెం-1971 చి-అగ్గి బరాటా-1966 చి-అత్తా ఒకింటి కోడలే-1958 చి-అనగాఅనగా ఒక రాజు (డబ్బింగ్)-1959 చి-అన్నపూర్ణ-1960 చి-అప్పుచేసి పప్పుకూడు-1959 చి-అమరశిల్పి జక్కన్న-1964 చి-అమాయకుడు-1968 చి-ఆడ పెత్తనం-1958 చి-ఆత్మగౌరవం-1966 చి-ఆనందనిలయం-1971 చి-ఆప్తమిత్రులు-1963 చి-ఆరాధన-1962 చి-ఆస్తిపరులు-1966 చి-ఆహుతి-1950 చి-ఇద్దరు పెళ్ళాలు-1954 చి-ఇద్దరు మిత్రులు-1961 చి-ఇద్దరు మిత్రులు-1962 చి-ఉమాసుందరి-1956 చి-ఉయ్యాల జంపాల-1965 చి-ఉషాపరిణయం-1961 చి-ఋష్యశృంగ-1961 చి-ఏకవీర-1969 చి-కనకదుర్గ పూజా మహిమ-1960 చి-కన్నకొడుకు-1973 చి-కన్యాశుల్కం-1955 చి-కలసివుంటే కలదుసుఖం-1961 చి-కాళహస్తి మహత్మ్యం-1954 చి-కీలుగుఱ్ఱం-1949 చి-కుంకుమ రేఖ-1960 చి-కులగౌరవం-1972 చి-కృష్ణ ప్రేమ-1961 చి-కృష్ణ లీలలు-1959 చి-కృష్ణప్రేమ-1961 చి-కోటీశ్వరుడు-1970 చి-గంగా గౌరీ సంవాదము-1958 చి-గాంధారి గర్వభంగం-1959 చి-గాలిమేడలు-1962 చి-గుండమ్మకథ-1962 చి-గుణసుందరి కథ-1949 చి-గులేబకావళి కథ-1962 చి-గృహప్రవేశము-1946 చి-గృహలక్ష్మి-1967 చి-చండీరాణి-1953 చి-చంద్రహారం-1954 చి-చంద్రహాస-1965 చి-చరణదాసి-1956 చి-చింతామణి-1956 చి-చిట్టి తమ్ముడు-1962 చి-చెంచు లక్ష్మి-1958 చి-జగదేకవీరుని కథ-1961 చి-జయం మనదే-1956 చి-జయభేరి-1959 చి-జయసింహ-1955 చి-జరిగిన కథ-1969 చి-జీవన తరంగాలు-1973 చి-జైజవాన్‌-1970 చి-టైగర్ రాముడు-1962 చి-టౌన్‌ బస్-1957 చి-డా.ఆనంద్-1966 చి-తలవంచని వీరుడు-1957 చి-తెనాలి రామకృష్ణ-1956 చి-తేనె మనసులు-1965 చి-తోడికోడళ్ళు-1957 చి-దశావతారములు-1962 చి-దీపావళి-1960 చి-దేవకన్య-1968 చి-దేవత-1965 చి-దేవదాసు-1953 చి-దేవాంతకుడు-1960 చి-దేశద్రోహులు-1964 చి-దొంగనోట్లు (డబ్బింగ్)-1964 చి-దొరికితే దొంగలు చి-ద్రోహి-1948 చి-ధర్మదాత-1970 చి-ధర్మాంగద-1949 చి-నమ్మినబంటు-1960 చి-నర్తనశాల-1963 చి-నలదమయంతి-1957 చి-నవగ్రహపూజా మహిమ-1964 చి-నిర్దోషి-1951 చి-నిర్దోషి-1967 చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 చి-పరోపకారం-1953 చి-పల్నాటి యుద్ధం-1947 చి-పల్నాటి యుద్ధం-1966 చి-పల్లెటూరి పిల్ల-1950 చి-పల్లెటూరు-1952 చి-పవిత్ర బంధం-1971 చి-పవిత్ర హృదయాలు-1971 చి-పసుపు కుంకుమ-1955 చి-పాండవ వనవాసం-1965 చి-పాండురంగ మహత్మ్యం-1957 చి-పాతాళ భైరవి-1951 చి-పిచ్చి పుల్లయ్య-1953 చి-పిడుగు రాముడు-1966 చి-పూజాఫలం-1964 చి-పెండ్లి పిలుపు-1961 చి-పెద్ద మనుషులు-1954 చి-పెళ్ళి కాని పిల్లలు-1961 చి-పెళ్ళి చేసి చూడు-1952 చి-పెళ్ళి సందడి-1959 చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 చి-పొట్టి ప్లీడరు-1966 చి-ప్రపంచం-1950 చి-ప్రమీలార్జునీయం-1965 చి-ప్రాయశ్చిత్తం-1962 చి-ప్రియురాలు-1952 చి-ప్రేమ నగర్-1971 చి-ప్రేమ-1952 చి-బంగారు గాజులు-1968 చి-బండ రాముడు-1959 చి-బందిపోటు-1963 చి-బడి పంతులు-1972 చి-బభ్రువాహన-1964 చి-బలే బావ-1957 చి-బాలనాగమ్మ-1959 చి-బాలభారతం-1972 చి-బాలరాజు కథ-1970 చి-బాలరాజు-1948 చి-బాలసన్యాసమ్మ కథ-1956 చి-బావమరదళ్ళు-1961 చి-బికారి రాముడు-1961 చి-బొబ్బిలి యుద్ధం-1964 చి-బ్రతుకుతెరువు-1953 చి-భక్త అంబరీష-1959 చి-భక్త జయదేవ-1961 చి-భక్త తుకారాం-1973 చి-భక్త రఘునాథ్-1960 చి-భక్త రామదాసు-1964 చి-భక్త శబరి-1960 చి-భట్టి విక్రమార్క-1960 చి-భలే అమ్మాయిలు-1957 చి-భాగ్యదేవత-1959 చి-భాగ్యరేఖ-1957 చి-భాగ్యవంతులు (డబ్బింగ్)-1962 చి-భామా విజయం-1967 చి-భీమాంజనేయ యుద్ధం-1966 చి-భీష్మ-1962 చి-భూకైలాస్-1958 చి-భూలోకంలో యమలోకం-1966 చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 చి-మంచిరోజులు వచ్చాయి-1972 చి-మదన మంజరి-1961 చి-మనదేశం-1949 చి-మనుషులు-మమతలు-1965 చి-మరపురాని కథ-1967 చి-మర్మయోగి-1964 చి-మల్లీశ్వరి-1951 చి-మహాకవి కాళిదాదు-1960 చి-మహామంత్రి తిమ్మరుసు-1962 చి-మాయాబజార్-1957 చి-మూగ మనసులు-1964 చి-మోహినీ భస్మాసుర-1966 చి-యశొద కృష్ణ-1975 చి-యోగి వేమన-1947 చి-రంగుల రాట్నం-1967 చి-రక్త సిందూరం-1967 చి-రక్షరేఖ-1949 చి-రణభేరి-1968 చి-రత్నగిరి రహస్యం (డబ్బింగ్)-1957 చి-రహస్యం-1967 చి-రాజ మకుటం-1960 చి-రాజకోట రహస్యం-1971 చి-రాజు పేద-1954 చి-రాము-1968 చి-రుణానుబంధం-1960 చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 చి-రోజులు మారాయి-1955 చి-లక్ష్మమ్మ-1950 చి-లక్ష్మీ కటాక్షం-1970 చి-లవకుశ-1963 చి-వదినగారి గాజులు-1955 చి-వరుడు కావాలి-1957 చి-వాగ్దానం-1961 చి-వారసత్వం-1964 చి-వాల్మీకి-1963 చి-విచిత్ర కుటుంబం-1969 చి-విచిత్ర కుటుంబం-1969. పా-పి.సుశీల తో చి-విజయం మనదే-1970 చి-వినాయక చవితి-1957 చి-విమల-1960 చి-విష్ణుమాయ-1963 చి-వీర కంకణం-1957 చి-వీరఖడ్గము-1958 చి-వీరాంజనేయ-1968 చి-వెలుగు నీడలు-1961 చి-శకుంతల-1966 చి-శభాష్ రాజా-1961 చి-శభాష్ రాముడు-1959 చి-శాంతి నివాసం-1960 చి-శోభ-1958 చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 చి-శ్రీ వల్లీ కల్యాణం (డ)-1962 చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 చి-శ్రీ సత్యనారాయణ మహత్యం-1964 చి-శ్రీ సింహాచలక్షేత్ర మహిమ-1965 చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 చి-శ్రీకృష్ణ కుచేల-1961 చి-శ్రీకృష్ణ తులాభారం-1966 చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 చి-శ్రీకృష్ణ విజయం-1971 చి-శ్రీకృష్ణమాయ-1958 చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 చి-శ్రీరామభక్త హనుమాన్ (డబ్బింగ్)-1958 చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 చి-షావుకారు-1950 చి-సంతానం-1955 చి-సంపూర్ణ రామాయణం-1972 చి-సంసారం-1950 చి-సతీ అనసూయ-1957 చి-సతీ సక్కుబాయి-1965 చి-సతీ సులోచన-1961 చి-సత్య హరిశ్చంద్ర-1965 చి-సప్తస్వరాలు-1969 చి-సరస్వతీ శపథం-1967 చి-సర్వర్ సుందరం-1966 చి-సారంగధర-1957 చి-సాహసవీరుడు-1956 (డబ్బింగ్) చి-సీతారామ కల్యాణం-1961 చి-సుమంగళి-1965 చి-స్వప్న సుందరి-1950 చి-స్వర్గసీమ-1945 చి-స్వర్ణ మంజరి-1962 చి-హరిశ్చంద్ర-1956

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (3) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎల్.ఆర్.ఈశ్వరి తో (1) గా-ఎస్.జానకి తో (4) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (72) గా-ఘంటసాల-బృందం (3) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (9) గా-పి.లీల తో (18) గా-పి.లీలతో (2) గా-పి.సుశీల తో (46) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (35) గా-బృందంతో (1) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది తో (2) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

సం-అద్దేపల్లి సం-అశ్వత్థామ సం-అశ్వద్ధామ సం-ఆదినారాయణ రావు సం-ఆర్.గోవర్ధనం సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం సం-ఎం.రంగారావు సం-ఎల్.మల్లేశ్వరరావు సం-ఎస్.పి.కోదండపాణి సం-ఓగిరాల సం-ఓగిరాల-అద్దేపల్లి సం-ఓగిరాల-టి.వి.రాజు సం-గాలి పెంచల సం-ఘంటసాల సం-జె.వి.రాఘవులు సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి సం-టి.ఎం.ఇబ్రహీం సం-టి.చలపతిరావు సం-టి.జి.లింగప్ప సం-టి.వి.రాజు సం-నాగయ్య-తదితరులు సం-పామర్తి సం-పామర్తి-సుధీర్ ఫడ్కే సం-పి.శ్రీనివాస్ సం-పెండ్యాల సం-బాలాంత్రపు సం-బి.శంకర్ సం-మణి-పూర్ణానంద సం-మల్లేశ్వరరావు సం-మాస్టర్ వేణు సం-ముగ్గురు దర్శకులు సం-రాజన్‌-నాగేంద్ర సం-రాజు-లింగప్ప సం-రామనాథన్‌ సం-విజయా కృష్ణమూర్తి సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి సం-వై.రంగారావు సం-సర్దార్ మల్లిక్ - పామర్తి సం-సాలూరు సం-సాలూరు-గోపాలం సం-సుదర్శనం-గోవర్ధనం సం-సుబ్బయ్యనాయుడు సం-సుబ్బరామన్‌ సం-సుబ్బురామన్ సం-సుసర్ల సం-హనుమంతరావు సం-MSV-రామ్మూర్తి-పామర్తి

మాస్టారి పాటల రచయితలు

ర-0 ర-అనిశెట్టి ర-అనిసెట్టి ర-ఆత్రేయ ర-ఆదినారాయణ రావు ర-ఆరుద్ర ర-ఉషశ్రీ ర-ఎ.వేణుగోపాల్ ర-కాళిదాసు ర-కాళ్ళకూరి ర-కొసరాజు ర-గబ్బిట ర-గోపాలరాయ శర్మ ర-ఘంటసాల ర-జంపన ర-జయదేవకవి ర-జాషువా ర-జి.కృష్ణమూర్తి ర-తాండ్ర ర-తాపీ ధర్మారావు ర-తిక్కన ర-తిరుపతివెంకటకవులు ర-తోలేటి ర-దాశరథి ర-దాశరధి ర-దీక్షితార్ ర-దేవులపల్లి ర-నార్ల చిరంజీవి ర-పరశురామ్‌ ర-పాలగుమ్మి పద్మరాజు ర-పింగళి ర-బమ్మెర పోతన ర-బమ్మెఱ పోతన ర-బాలాంత్రపు ర-బైరాగి ర-భాగవతం ర-భావనారాయణ ర-భుజంగరాయ శర్మ ర-మల్లాది ర-ముద్దుకృష్ణ ర-రాజశ్రీ ర-రామదాసు ర-రావులపర్తి ర-రావూరి ర-వారణాసి ర-విజికె చారి ర-వీటూరి ర-వేణు ర-వేములపల్లి ర-శ్రీశ్రీ ర-సదాశివ బ్రహ్మం ర-సముద్రాల జూ. ర-సముద్రాల సీ. ర-సి.నా.రె. ర-సినారె ర-సుంకర-వాసిరెడ్డి ర-సుబ్బారావు రచన-దాశరధి రచన-దేవులపల్లి రచన-పానుగంటి రచన-పింగళి రచన-బలిజేపల్లి