ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో తాతినేని ప్రకాశరావును దర్శకునిగా పరిచయం చేస్తూ 1952 లో నిర్మించిన చిత్రం పల్లెటూరు.
Thanks to RajasriTelugu for providing the video inYou Tube.
| పల్లవి: | ఆ మనసులోన ఆ చూపులోన | ||
| ఆ మనసులోన ఆ చూపులోన | |||
| పరుగులెత్తే మృదుల భావనా మాలికల | |||
| అర్థమేమిటొ తెల్పుమా! | |||
| ఆశ యేమిటొ చెప్పుమా! | |||
| చరణం: | ఆ నడకలోన, | ||
| ఆ నడకలోన | |||
| దొరలు ఆ నునుసిగ్గు దొంతరలపై యొగ్గు | |||
| అంతరార్థము తెలుపుమా! | |||
| ఆశయము వివరింపుమా! | |||
| చరణం: | ఆ కులుకులోన ఆ పలుకులోన | ||
| పెనవేసికొనియున్న | |||
| వెలికి రాలేకున్న | |||
| పెనవేసికొనియున్న, వెలికి రాలేకున్న | |||
| తలపులేవో తెల్పుమా! | |||
| వలపులేవో చెప్పుమా! | |||
| వలపులేవో చెప్పుమా! | |||
| చరణం: | ఆ సొగసులోన ఆ నగవులోన | ||
| తొగరువా తెర గప్పి చిగురించు కోరికల | |||
| ఆ..ఆ..ఆ.. | |||
| తొగరువా తెర గప్పి చిగురించు కోరికల | |||
| మరుగదేమిటొ తెల్పుమా! | |||
| తెరగదేమిటొ చెప్పుమా! | |||
| చరణం: | ఆ హృదిలో, నీ మదిలో | ||
| పొటమరించిన ప్రేమ దిటవుగా పాడుకొని | |||
| పరిమళించునె తెల్పుమా! | |||
| ఫలితమిత్తునె చెప్పుమా! | |||
| ఫలితమిత్తునె చెప్పుమా! | |||
| ఆ.. మనసులోన.. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి