విజయ గోపాల్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మింపబడిన పౌరాణిక చిత్రం గంగా గౌరీ సంవాదం. ఇందులో సి.హెచ్.నారాయణ రావు, కాంతారావు, కృష్ణకుమారి, జానకి ప్రముఖ తారాగణం. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు ఒక పద్యం, ఒక పాట గానం చేసారు. ఎం.ఎస్. రామారావు, రఘునాథ్ పాణిగ్రాహి, జిక్కీ, పి.లీల కూడ కొన్ని పాటలు పాడారు. అరుదైన ఈ ఆణిముత్యాన్ని పొందుపరచిన ఘంటసాల గాన చరిత కు, చిత్రం యొక్క వివరాలు పది కాలాలు నిలిచేలా సమకూర్చిన ఘంటసాల గళామృతము - పాటల పాలవెల్లి, వికిపీడియా బ్లాగులకు హృదయపూర్వక ధన్యవాదములు.
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
చిత్రం: గంగా గౌరీ సంవాదము (1958) | ||
రచన: పరశురామ్ | ||
సంగీతం: పెండ్యాల | ||
గానం: ఘంటసాల | ||
సీ. | ఇంద్రాది దేవతల్ వంది మాగధులట్లు | |
స్తోత్ర పాఠంబుల సొంపు నింప | ||
విష్ణు విధాతలు వింజామరలు బూని | ||
వేద వేదాంగముల్ విన్నవింప | ||
తుంబురుడేనున్ తంబురల్ మీటుచు | ||
సామ గానంబున సన్నుతింప | ||
ప్రమథ గణంబులు ప్రమధాధిపతులును | ||
జయ జయ ధ్వానముల్ జగతి నింప | ||
పరమ శివుడంత పెండ్లికి తరలి రాగ! | ||
నీదు వర పుత్రికను గంగ నిచ్చి.. | ||
కన్యదాన మొనరింప తరియింప నగును సూవె | ||
దక్ష హిమవంతులట్టులో ధన్య చరిత!. ఆ..ఆ.. |
Thank you Suryanarayana garu. What a voice and what a poem!
రిప్లయితొలగించండిYou are welcome Pradeep garu.
తొలగించండిఘంటసాలవారి 55 ఏళ్ల కిందటి పద్యం వినిపించి చెవుల తుప్పు వదిలించినందుకు అభివందనాలు!
రిప్లయితొలగించండిధన్యవాదములు సూర్య ప్రకాష్ గారు.
తొలగించండిThanks for uploading a wonderful padyam
రిప్లయితొలగించండి