స్వాతంత్ర్య సంగ్రామ నేపథ్యంలో 1949 లో "విప్రదాస్" అనే శరత్ వ్రాసిన బెంగాలీ నవల ఆధారంగా మీర్జాపురం రాజా వారి సతీమణి సి.కృష్ణవేణి నిర్మించిన చిత్రం మనదేశం. ఇందులో సబ్ ఇన్‌స్పెక్టర్ వేషంలో రంగ ప్రవేశం చేసి, తరువాతి కాలంలో తెలుగువారికి ఒక మరపురాని కథానాయకుడుగా, ఒక ప్రముఖ ముఖ్యమంత్రిగా, ఎందరికో స్ఫూర్తినిచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్). మన దేశం చిత్రానికి సంగీతానికి సర్వబాధ్యతలు తొలిసారిగా ఘంటసాల మాస్టారు నిర్వహించారు. కనుక ఇది సంగీతదర్శకునిగా మాస్టారి మొదటి చిత్రం. దర్శకత్వం ఎల్.వి.ప్రసాద్. సముద్రాల రాఘవాచార్యులు కథ, పాటలు వ్రాసారు. భారతదేశపు నైసర్గిక స్వరూపాన్ని దౄష్టిలో వుంచుకుని, దేశ ఎల్లలలను ఉటంకిస్తూ, వివిధ నదులను స్మరిస్తూ, వ్రాసిన భావగర్భిత గీతం జయజననీ పరమ పావని. ఈ పాటను, మాస్టారు, సి. కృష్ణవేణి, బృందం పాడారు.
చిత్రం: | మన దేశం (1949) | ||
రచన: | సముద్రాల రాఘవాచార్య (సీనియర్) | ||
సంగీతం: | ఘంటసాల వెంకటేశ్వర రావు | ||
గానం: | ఘంటసాల, సి.కృష్ణవేణి, బృందం | ||
పల్లవి: | అందరు: | జయజననీ పరమపావని జయజయ భారత జననీ | | జయజననీ | |
జయజననీ పరమపావని | |||
చరణం: | కృష్ణవేణి-బృందం: | శీతశైల మణిశృంగ కిరీటా | | శీతశైల | |
ఘంటసాల-బృందం: | సింహళ జాంబూ పద పీఠా | ||
అందరు: | శీతశైల మణిశృంగ కిరీటా | ||
సింహళ జాంబూ పద పీఠా | |||
అందరు: | వింధ్య మహీధర మహామేఖలా | | వింధ్య | | |
విమల కాశ్మీర కస్తూరి రేఖా | | విమల | | ||
జయజననీ పరమపావని జయజయ భారత జననీ | |||
జయజననీ పరమపావని | |||
ఘంటసాల: | ఆ...ఆ...ఆ.. | ||
చరణం: | కృష్ణవేణి-బృందం | గంగా, సింధూ, మహానదీ | |
ఘంటసాల-బృందం | గౌతమీ, కృష్ణా, కావేరీ | ||
కృష్ణవేణి-బృందం | గంగా, సింధూ, మహానదీ | ||
ఘంటసాల-బృందం | గౌతమీ, కృష్ణా, కావేరీ | ||
అందరు: | జీవసార పరిపూజిత కోమల సస్య విశాలా శ్యామలా | | జీవధార | | |
సస్య విశాలా శ్యామలా | |||
జై జయజననీ పరమపావని జయజయ భారత జననీ | |||
జయజననీ పరమపావని జయజయ భారత జననీ | |||
జయజయ భారత జననీ | |||
జయజయ భారత జననీ | |||
జయజయ భారత జననీ |
Thanks to Wikipedia for the information; Project Ghantasala for the song and Sakhyaa.com for lyrics.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి