1955 సంవత్సరంలో విడుదలైన అన్నపూర్ణా పిక్చర్స్ సంస్థ నిర్మించిన దొంగ రాముడు చిత్రం నుండి ఘంటసాల జిక్కీ తో పాడిన "చిగురాకులలో చిలకమ్మా " అనే ఈ యుగళగీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది పెండ్యాల. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, సావిత్రి, జమున, ఆర్.నాగేశ్వరరావు, రేలంగి, జగ్గయ్య, సూర్యకాంతం,అల్లు రామలింగయ్య. ఈ చిత్రానికి నిర్మాత డి.మధుసూదనరావు మరియు దర్శకుడు కె.వి.రెడ్డి. దీనిని అక్కినేని, సావిత్రి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 01.10.1955 న విడుదలైంది.
అన్నపూర్ణ వారి తొలి చిత్రం, దొంగ రాముడు (1955) నుండి చిగురాకులలో చిలకమ్మా చిన్న మాట వినరావమ్మా.... ఈ చిత్రానికి కథ అందించినవారిలో దుక్కిపాటి మధుసూదన రావు గారు కూడా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఏ.వి.యం. వారు హిందీలో మాన్-మౌజి పేరుతో రీమేక్ చేశారు. ఈపాట తరువాత ఈ పాటకు సమానమైన హిందీ పాట కూడా చూద్దాము. ఇది ప్రఖ్యాత బాలీవుడ్ గాయకులు కిశోర్ కుమార్ పాడిన "జరూరత్ హై జరూరత్ హై" అన్న పాట.
ఈ రెండు దృశ్యఖండికలను సమకూర్చిన శ్రీ మిట్టా రవిశంకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ యుగళగీతపు సాహిత్యాన్ని శ్రీ
చల్లా సుబ్బారాయుడు గారు సంకలనం చేసిన "శతాబ్ది గాయకుడు ఘంటసాల" గ్రంథమునుండి సేకరించబడినది. వారికి మనఃపూర్వక ధన్యవాదాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి