శ్రీమతి
పద్మశ్రీ శ్రీరంగం గోపాలరత్నం అనగానే అందరికీ "ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట" అని శ్రీ వేంకటేశ్వర వైభవం చిత్రంకోసం
ఆమె ఆలపించిన భక్తి గీతం గుర్తుకు వస్తుంది. ఆమె అలనాటి ఆకాశవాణి కేంద్రపు నిలయ విద్వాంసురాలు. సుమధురమైన శాస్త్రీయ మరియు లలితగీతాలతో ఎందరినో అలరించింది ఆ కంఠం.. ఆవిడ గాన గంధర్వులు, తెలుగువారి గళవేల్పు అయిన ఘంటసాల మాస్టారితో కలసి పాడారని చాల కొద్దిమందికి తెలిసుండొచ్చును. మరొక కళాకారులు శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారు ప్రముఖ తెలుగు రచయిత. ఆయన ఎన్నో కథలు, కవితలు, నాటకాలు రచించారు. వాహినీ వారి బి.ఎన్. రెడ్డి ప్రోత్సాహంతో
1951 లో బంగారుపాప చిత్రానికి సంభాషణల రచయితగా సినీప్రస్థానం ప్రారంభించారు పద్మరాజు గారు. 1961లో పద్మరాజు దర్శకత్వంలో సుఖీభవ సంస్థ కాంతారావు, జి.వరలక్శ్మి నాయక నాయికలుగా నిర్మించిన చిత్రం బికారి రాముడు కోసం. ఈ చిత్రంకోసం పద్మరాజు రచనను బి.గోపాలం స్వరపరచగా, ఘంటసాల మాస్టారు, శ్రీరంగం గోపాలరత్నం "ఏ పాపమెరుగని పసిపాపా" అనే యుగళగీతం పాడారు.ఇదే చిత్రానికి ఆమె మాస్టారితో పాడిన మరొక యుగళగీతం "చల్లని నీ దయ జల్లవయ్యా" ప్రస్తుతం అలభ్యం.
సాకీ: | అతడు: | ఏ పాపమెరుగని పసిపాపా..ఆ..ఆ.., ఈ కురూపమే నీకు తీరని శాపమాయె |
పల్లవి: | ఇదియే నీ కథా, తుదిలేనీ వ్యధా - 2 | |
తల్లిదండ్రులున్న అనాథ ఓ..ఓ.. | ||
తల్లిదండ్రులున్న అనాథ, బ్రతుకే నీకు ఎడారి, ఓ.. బికారీ..ఈ..ఈ.. | ||
ఇదియే నీ కథా..ఆ.. | ||
చరణం: | ఆమె: | పాలకేసి చూడవేమయా, ఇంతటీ పరాకేల నా కన్నయ్యా |
పాలకేసి చూడవేమయా, ఇంతటీ పరాకేల నా కన్నయ్యా | ||
అతడు: | అని ఎంతో గారముతో, తన అనురాగముతో | |
కనిపెంచే కన్నతల్లి నీ తమ్మునీ | ||
ఆలనలేకా ఆ..ఆ.., ఆలనలేకా పాలనయేలేకా | ||
ఇలాగే తపించే గాలిబ్రతుకు నీకిక | ||
ఇదియే నీ కథా, తుదిలేనీ వ్యధా, ఇదియే నీ కథా ఆ..ఆ.. | ||
చరణం: | ఆమె: | తగని పనులు తగునటయ్యా? ఇలాటి తగవులేల చెప్పు అయ్యా |
తగని పనులు తగునటయ్యా? ఇలాటి తగవులేల చెప్పు అయ్యా | ||
అతడు: | అని కౌగిట తను జేర్చే, ఆపదలను తీర్చే తల్లి చాటు బిడ్డలెవరు? తాత లేడే? | |
హీనత పాలై ..ఐ.., హీనత పాలై, హింసలకే లోనై, | ||
ఎందునా పొందనీ, నిన్నెవడూ చూడడే | ||
ఇదియే నీ కథా, తుదిలేనీ వ్యధా, ఇదియే నీ కథా | ||
ఓ ఓ ఓ బికారీ.., ఓ.. ఓ బికారీ, బికారీ… |
Thanks to Wickipedia for providing the information about the movie and artists.
మంచి మంచి, ఘంటసాల గారి పాటలు, విశ్లేషణ చాలా బాగున్నాయి, సార్
రిప్లయితొలగించండిమీ స్పందనకు ధన్యవాదాలు వెంకట రామయ్య గారు.
తొలగించండిచాలా బాగుంది
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
తొలగించండి