1963 లో విడుదలైన పౌరాణిక చిత్రం విష్ణుమాయ. ఈ చిత్రానికి కొన్ని పద్యాలు, పాటలు వ్రాసినది గబ్బిట వెంకటరావు. అందులో "భండన భీముడు" అనే పద్యం దాశరథీ శతకంలోనిది. "రాముడె రక్షకుండు" అనే పద్యం గబ్బిట వ్రాసారు. "కోతియే అంబోధి" అనే పద్యం మద్దెల పంచనాథం వ్రాసారు. సంగీత దర్శకులు ఎల్. మల్లేశ్వర రావు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన మరొక చక్కని చిత్రం భక్త అంబరీష. విష్ణుమాయ చిత్రంలో కాంతారావు, కృష్ణకుమారి, జయంతి, రాజనాల నటించారు.
కృతజ్ఞతలు: ఘంటసాల గానామృతము - పాటలపాలవెల్లి బ్లాగుకు, ఘంటసాల గాన చరితకు.
చిత్రం: | విష్ణుమాయ (1963) | |
సంగీతం: | ఎల్. మల్లేశ్వరరావు | |
గానం: | ఘంటసాల | |
రచన: | రామదాసు (కంచెర్ల గోపన్న) - దాశరథీ శతకం నుండి | |
పద్యం: | భండనభీముడు ఆర్తజనబాంధవుడు ఉజ్జ్వలబాణతూణ కో | |
దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ | ||
రెండవసాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికా | ||
దండదదాండదాండ నినదంబుల జాండమునిండ మత్తవే | ||
దండమునెక్కి చాటెదను దాశరథిన్ కరుణాపయోనిథిన్! | ||
రచన: | గబ్బిట వెంకటరావు | |
పద్యం: | రాముడే రక్షకుండు రఘురాముడె నా పరదైవతంబు, శ్రీ | |
రామునిగాక అన్యుని పరాత్పరుడన్న దురాత్ములన్ మహో | ||
ద్ధామ పరాక్రమంబున విదల్చి శిరమ్మున వ్రక్కలించి, ని | ||
ర్ధూమమొనర్చు మారుతిమదోద్ధతి మానుమురా ఖగాధమా. | ||
రచన: | మద్దెల పంచనాథం | |
పద్యం: | కోతియే అంబోధి గుప్పించి లంఘించి స్వామికి సీతమ్మ జాడతెలిపె | |
కోతియే లంకలో కోటకొమ్ముల గాల్చి పౌలస్త్యు గర్వమ్ము భంగపరచె | ||
కోతియే అవలీల సేతుబంధనముజేసి ఉగ్రరాక్షసకోటి నుక్కడించె | ||
కోతియే సంజీవికొని తెచ్చి నిశిరాత్రి లక్ష్మణుప్రాణాల రక్షజేసె. |
అట్టి ఈ కోతియే | ||
పగబట్టి నీదు దర్పమణగింప కంకణధారియయ్యే...ఏ.. | ||
కోతికొమ్మచ్చి గాదురా | ||
కోతికొమ్మచ్చి గాదురా గుండెచీల్చు ప్రాణగండము నీదు ప్రారబ్ధమౌరా |
కృతజ్ఞతలు: ఘంటసాల గానామృతము - పాటలపాలవెల్లి బ్లాగుకు, ఘంటసాల గాన చరితకు.
You tube link is not working
రిప్లయితొలగించండిIt's working andi. I just checked. Change the browser and see.
తొలగించండిThanks sir. But am unable to open, if you don't mind, pls extract the audio and post it.
రిప్లయితొలగించండిమూడవ పద్యం యొక్క మొదటి నాలుగు పాదాలు, "శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం" లోని ’కోతియే లంకలోన కోట కొమ్మల గాల్చి" అనే పద్యం లోని మొదటి నాలుగు పాదాలు ఇంచుమించు ఒకలాగానే ఉండడం కొంచెం ఆశ్చర్యజనకమే. ఆ పద్యాన్ని తాండ్ర సుబ్రహ్మణ్యం గారు వ్రాసేరనుకుంటాను.
రిప్లయితొలగించండిచక్కగా పట్టుకున్నారు రమాప్రసాద్ గారు. అవుని. విష్ణుమాయకు మద్దెల పంచనాథం గారు వ్రాసిన రెండు పంక్తులలోని రెండు అర్ధ భాగాలను 1972 లో వచ్చిన శ్రీకృష్ణాంజనేయ యుద్ధంలో తాండ్ర సుబ్రహ్మణ్యం గారు "కోతియే లంకలో కోటకొమ్మల గాల్చి స్వామికి సీతమ్మ జాడ తెలిపే" అని ఒకే పంక్తిగా వ్రాసారా అనిపిస్తుంది.
తొలగించండి