పద్యాలు పాడటంలో
ఒక క్రొత్త వరవడిని సృష్టించారు
ఘంటసాల మాస్టారు. అదే మూసలో సాగే భక్తి ప్రపత్తులు ప్రకటించే సుదీర్ఘమైన గాన విన్యాసం దండకం. మాస్టారు పలు చిత్రాలలో ఎన్నో దండకాలు పాడారు. అలాంటిదే మరొక మణిపూస పాండవ వనవాసం చిత్రం కోసం మాస్టారు ఆంజనేయుని స్తుతిస్తూ గానం చేసిన దండకం. పాండవుల అరణ్యవాస సమయంలో ఒకానొక రోజున ద్రౌపది కోరిక మీద సౌగంధిక పుష్పాలకోసం భీముడు బయలుదేరుతాడు. దారిలో ఒక ముసలికోతి రూపంలో ఉన్న హనుమంతునితో హేళనగా మాట్లాడి తన బలంగురించి గొప్పలు చెప్పుకుని, ఆఖరికి ఆ వాయుపుత్రుని చేత భంగ పడతాడు భీమసేనుడు. తన గర్వం పటాపంచలైన భీముడిలా అంటాడు "అర్థమైంది మహానుభావా! నీవు సామాన్య వానరుడవు కాదు. శతయోజన విస్తీర్ణ సాగరాన్ని లంఘించి, లోహనిర్మిత లంకా నగరాన్ని దహించి, శతసహస్ర దానవచమూ సమూహాన్ని సంహరించి, సంజీవనీ పర్వతాన్ని సమూలంగా పెకలించి తెచ్చిన వీరాంజనేయమూర్తివి నీవు. శ్రీరామచంద్ర కరుణాకటాక్ష పాత్రుడవు. దివ్యరూప ప్రదర్శనాదక్షుడవు నీవు. మహాత్మా! మహాత్మా! నన్ను కటాక్షించు" అని స్తుతిస్తాడు. సముద్రాల రాఘవాచార్యులు వ్రాసిన ఈ దండకం మాస్టారే బాణీ కట్టి పాడారు.

చిత్రం: | పాండవ వనవాసం (1965) | |
రచన: | సముద్రాల సీనియర్ | |
సంగీతం: | ఘంటసాల | |
గానం: | ఘంటసాల |
ఆంజనేయా!
మహానుభావా!
|
||
మనోజవం!
మారుతతుల్య వేగం! జితేంద్రియం! బుధ్ధిమతాం వరిష్ఠం!
|
||
వాతాత్మజం!
వానరయూధముఖ్యం! శ్రీరామదూతం! శిరసా నమామి.II
|
||
భజే రమ్య
రంభావనీ నిత్యవాసం!
|
||
భజే బాలభానుప్రభా చారుభాసం! | ||
భజే
చంద్రికా కుంద మందారహాసం!
|
||
భజే సంతతం రామభూపాలదాసంII | ||
జైజై
మహాసత్వబాహా! మహావజ్రదేహా!
|
||
పరీభూతసూర్య! కృతామర్త్య కార్యా! | ||
మహావీర! హంవీర! హేమాద్రిధీరా! | ||
ధరాజాత శ్రీరామ సౌమిత్రి సంవేష్టితాత్మా! మహాత్మా! | ||
నమో వాయుపుత్ర! నమో సచ్చరిత్రా! | ||
నమో జానకీప్రాణదాతా! భవిష్యద్విధాతా! | ||
హనూమంత! కారుణ్యవంతా! ప్రశాంతా! | ||
నమస్తే నమస్తే నమస్తే నమః.II | ||
శ్రీరామచంద్రం!
శ్రితపారిజాతం! సలక్ష్మణం భూమిసుతా సమేతం!
|
||
లోకాభిరామం!
రఘువంశసోమం! రాజాధిరాజం! శిరసా నమామి.II
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి