ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులైన జి.ఎన్.బాల సుబ్రహ్మణ్యం వద్ద శాస్త్రీయ
సంగీతం అభ్యసించిన సోదరీమణులు (కజిన్ సిస్టర్సు) రాధ మరియు జయలక్ష్మి. వీరికి 1981 లో
సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. ఆ రోజులలో సిస్టర్స్ కచేరీలిచ్చిన తొలి యుగళ విద్వాంసులు వీరు. వీరి విద్యార్థులు నేటి ప్రముఖ గాయనీమణులైన ప్రియా సిస్టర్స్ గా ప్రసిద్ధియైన షణ్ముఖప్రియ మరియు హరిప్రియ. రాధా జయలక్ష్మి జంటలో జయలక్ష్మి చలన చిత్రాలలో (తెలుగులో ఒకటి, తమిళంలో కొన్ని) పాటలు పాడారు. అయితే సినీ రంగం లో ఆవిడ పేరు తన కజిన్ పేరుతో కలిపి రాధా జయలక్ష్మి గానే సూచించే వారు. 1960 లో పక్షిరాజా స్టూడియోస్ పతాకంపై విడుదలైన, ఎన్.టి.ఆర్., సావిత్రి నటించిన "విమల" చిత్రానికి రాధా జయలక్ష్మి రెండు పాటలు పాడారు. అవి 'కన్నుల్లో నీ
బొమ్మ చూడు' మరియు 'కన్నుల బెళుకే కలువలురా'. ఆమె మాస్టారితో పాడినవీ ఈ రెండు పాటలే, అంతేకాక ఈ రెండు పాటలు కన్నుల గురించి అవడం
విశేషం. ఈ చిత్రానికి సంగీత దర్శకులు ఎస్.ఎం.సుబ్బయ్య నాయుడు. వీరి సోదరులు శ్రీరాములు నాయుడు చిత్ర నిర్మాత, దర్శకులు. సుబ్బయ్య నాయుడు గారిని చిత్ర సీమలో సంగీతయ్య అని పిలిచేవారట. వీరి సంగీత దర్సకత్వంలో వచ్చిన ఇతర చిత్రాలలో నాదస్వరం ప్రధానంగా వినిపించే సంగీతభరిత చిత్రం మురిపించే మువ్వలు (ఎస్.జానకి పాడిన సుపరిచితమైన 'నీలీల పాడెద దేవా' ఈ చిత్రంలోనిదే). హృదయ ఫలకంలో దాగిన ప్రేయసి చిత్రాన్ని కళ్ళెదుట కేన్వాసు పై కుంచెతో రంగులద్ది తన కళాహృదయాన్ని కవితాగానంతో ఆలపించినంతనే చిత్తరువు జీవం పోసుకుని పాటతో బదులు పలికి, పిదప కట్టెదుటికొస్తే కథానాయకుడు చెందిన దిగ్భ్రమకు అద్దం పట్టిన చక్కని ముద్దుకృష్ణ రచన ఈ పాట "విమల" చిత్రంలోనిది. ఇది బేహాగ్ రాగంతో ప్రారంభమయ్యే రాగమాలిక పధ్ధతి లోని పాట. విని ఆనందించండి.
Thanks to iDream for posting the you tube video
Thanks to iDream for posting the you tube video
స్వరగాన సారధులు
చిత్రం: | విమల (1960) | ||
రచన: | ముద్దు కృష్ణ | ||
సంగీతం: | ఎస్.ఎం.సుబ్బయ్య నాయుడు | ||
గానం: | ఘంటసాల, రాధా జయలక్ష్మి | ||
పల్లవి: | ఘంటసాల: | కన్నుల బెళుకే కలువలురా..ఆ..ఆ. కన్నుల బెళుకే కలువలురా | |
కన్నియ తళుకే కనకమురా.. కన్నుల బెళుకే కలువలురా | |||
కలవోలె కనిపించే.. కలవోలె కనిపించే.. | |||
కలలోనే వలపించే.. కలలోనే వలపించే.. | |||
కనులలొ ఆ రూపె కాపురమైపోయే-2 | |||
కన్నుల బెళుకే కలువలురా..ఆ..ఆ. కన్నుల బెళుకే కలువలురా | |||
చరణం: | రాధాజయలక్ష్మి: | కనరాని అందాలనే.. కనులార కనినంతనే | |
వనమేమొ ఈ వేళనే.. వనమేమొ ఈ వేళనే.. | |||
నందనమనిపించెనే.. నందనమనిపించెనే.. | |||
విరులన్ని కనువిప్పెనే.. విరులన్ని కనువిప్పెనే.. | |||
చిరునవ్వు చిలికించెనే... చిరునవ్వు చిలికించెనే.. | |||
ఎనరాని శృంగారమే… ఎనరాని శృంగారమే.. | |||
హృదయాలు కదిలించెనే.. హృదయాలు కదిలించెనే.. | |||
కనరాని అందాలనే… కనులార కనినంతనే | |||
చరణం: | రాధాజయలక్ష్మి: | ఇటుచూడు ఇటుచూడవే.. ఇటుచూడు ఇటుచూడవే.. | |
ఇవి ఏమి మటుమాయమే | |||
ఇటుచూడు ఇటుచూడవే.. ఇవి ఏమి మటుమాయమే | |||
ఇటుచూడు ఇటుచూడవే.. | |||
ఘంటసాల: | వనరాణీ వగలాడిగా.. కనుసైగ కావించగా.. | | వనరాణీ | | |
వనమేమొ ఈ వేళనే.. నందనమనిపించెరా | | వనమేమొ | | ||
విరికన్నె కనువిప్పగా..ఆ..విరికన్నె కనువిప్పగా.. | |||
చిరునవ్వు చిలికించగా.ఆ..చిరునవ్వు చిలికించగా | |||
ఎనరాని శృంగారమే.. హృదయాలు కరిగించెరా | | ఎనరాని | | ||
వనరాణీ వగలాడిగా.. కనుసైగ కావించగా.. |
Thanks: To Tollywood for providing the video, You Tube for hosting the video and wikipedia for providing useful background information.
చాలా మంచిపాటను చూపించిన మీకు ధన్యవాదములు. ఐతే, ఒక సందేహం ! "విమల" చిత్రమును నేను చాలా ఏళ్ళ క్రితం చూశాను. నాయిక పాడిన "ఇటు చూడు, ఇటు చూడవే ! ఇది ఏమి మటుమాయమే ! " తర్వాత "అచ్చంగ నా రూపమే అచ్చుగుద్దినట్టులున్నదే ! " అనే పంక్తి ఉన్నట్టు నాకు ఇప్పటికీ జ్ఞాపకం. మరి, ఈ వీడియోలొ, మీరు ఇచ్చిన సాహిత్యములో ఆ లైను లేదు. కారణం ?!.........
రిప్లయితొలగించండిసత్యనారాయణ గారు, నేను ఆ సినిమా చూడలేదండి. కాని పాటలో మరొక చరణం కూడ వుంది అని తెలుసు. బహుశా అది మరొక సందర్భంలో చిత్రీకరించి వుండవచ్చు. ఎవరైనా చెబుతారేమో వేచి చూడాలి.
రిప్లయితొలగించండిసూర్యనారాయణగారూ ! మరొక మాట. రాధాజయలక్ష్మిగారు "విమల" లో 2 పాటలు పాడారని పేర్కొన్నారు. ఆమె ఘంటసాలగారితో కలిసి పాడినవి రెండే కావచ్చు. ఐతే, ఆ సినిమాలో ఆమె మరికొన్ని పాటలు కూడా పాడినారు. "నీలివెన్నెల కాయసాగే ! చల్లగాలి తగిలి తీగలూగే !" అనే నాట్యగీతం, "కావవే ! అమ్మా ! దేవీ !" అనే భక్తిగీతం నాకు గుర్తున్నాయి. ఈ రెండూ సావిత్రిపైనే చిత్రించారు. నేను పేర్కొన్న మొదటిపాట చాలా బాగుంటుంది. మీరు వినేవుంటారు. దొరికితే పోస్ట్ చేయండి
రిప్లయితొలగించండిమీకు ధన్యవాదములు సూర్యనారాయణగారూ!.
రిప్లయితొలగించండి