ఎ.వి.ఎం. సంస్థ ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలను నిర్మించింది. అయితే అందులో ఎక్కువ సాంఘిక చిత్రాలు. ఆ సంస్థ 1958 లో నిర్మించిన విలక్షణమైన పౌరాణిక చిత్రం భూకైలాస్. శివుని ఆత్మలింగం కోసం రావణాసురుని తపస్సు, మొదటి ప్రయత్నంలో రావణుని నారదుడు తప్పుదారి పట్టించి మండోదరితో వివాహం జరిపించడం, రెండవ ప్రయత్నంలో శివకటాక్షంతో ఆత్మలింగం పొంది లంకకు తిరిగి వస్తుండగా, బాలుని రూపంలో వినాయకుడు వచ్చి ఆత్మలింగాని నేలపైనుంచడం, అందువలన ఆతంలింగాన్ని రావణుడు పొందలేక ఆచోటే భూకైలాస్ గా ప్రసిద్ధి చెండడం ఈ చిత్రం యొక్క మూల కథ. రావణాసురునిగా ఎన్.టి.ఆర్, నారదునిగా ఎ.ఎన్.ఆర్., మరియు మండోదరి తండ్రి మయాసురునిగా ఎస్.వి.ఆర్. వంటి అగ్రనటులు నటించిన ఈ చిత్రానికి ఆర్.సురర్శనం, ఆర్.గోవర్థనంల సంగీత దర్శకత్వంలో అమర గాయకుడు ఘంటసాల గళంలో జీవంపోసుకున్న సముద్రాల రాఘవాచార్య అద్భుత రచనలు ఆయువుపట్టు. ఈ కార్తీక సోమవారం నాడు ఈ చిత్రంలోని ఘంటసాల పాట 'తగునావరమీయ' సమర్పిస్తున్నాను.
Thanks to Rose Telugu Movies for uploading the video clip to You Tube
| చిత్రం: | భూకైలాస్ (1958) | |
| రచన: | సముద్రాల రాఘవాచార్య (సీనియర్) | |
| సంగీతం: | ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం | |
| గానం: | ఘంటసాల | |
| ప. | తగునా.ఆ..ఆ.. వరమీయా.ఆ..ఆ. యీ నీతిదూరునకు పరమాపాపునకు | |
| తగునా.ఆ..ఆ.. వరమీయా.ఆ..ఆ. యీ నీతిదూరునకు పరమాపాపునకు | ||
| చ. | స్నేహము మీరగ నీవేలగ ద్రోహమునే జేసితీ-2 | |
| పాపకర్ము దుర్మదాంధు నన్ను ఏపక దయచూపితేల అర | ||
| తగునా వరమీయా యీ నీతిదూరునకు పరమపాపునకు | ||
| చ. | మంగళదాయిని మాత పార్వతిని మతిమాలి మోహించితీ..ఈ.. | |
| మంగళదాయిని మాత పార్వతిని మతిమాలి మోహించితీ | ||
| కన్నుల నిండే శూలాన పొడిచీ కామము మాపుమా..ఆ. | ||
| కన్నుల నిండే శూలాన పొడిచీ కామము మాపుమా | ||
| చ. | తాళజాలను సలిపిన ఘనపాప సంతాపభర మేనిక | |
| చాలును, కడతేర్చుము ఇకనైన వీని పుణ్యహీన దుర్జన్మము | ||
| పోనాడితి మతి, వేరేగతి మరిలేదు | ||
| ఈ నీచుని తల ఇందే తునకలు కానీ | ||
| మేనియ్యెడ వసివాడీ, మాడీ మసిమసిగానీ | ||
| పాపము బాపుమా, నీ దయా చూపుమా, నీ దయ చూపుమా | ||
| చ. | చేకొనుమా దేవా శిరమూ, చేకొనుమా దేవా శిరమూ చేకొనుమా దేవా | |
| శిరము చేకొనుమా దేవా, శిరము చేకొనుమా ..ఆ దేవా | ||
| చేకొనుమా దేవా, శిరమూ చేకొను మహాదేవా | ||
| మాలికలో మణిగా నిలుపు కంఠమాలికలో మణిగా నిలుపు | ||
| నా పాప ఫలము తరుగు, విరుగూ..ఊ.. | ||
| పాప ఫలము తరుగు, విరుగు ఊ., పాప ఫలము తరుగూ..ఊ విరుగు | ||
| చేకొనుమా దేవా, శిరమూ చేకొను మహాదేవా | ||

స్వామీధన్యుడనైతినీమధురసాక్షాత్కారభాగ్యంబునన్యనేపద్యముయెక్కడలభ్యమోదయతోచెప్పండి
రిప్లయితొలగించండి