కవిసార్వ బౌమునిగా విరాజిల్లిన శ్రీనాథుడు సర్వజ్ఞ సింగ భూపాలుని ఆస్థాన
కవి. మరుత్తరాట్చరిత్ర, శృంగార నైషధము, శాలివాహన సప్తశతి మొదలగు గ్రంథాలు రచించాడు. అదే కాలంలో అరుణగిరి నాథుడు అనే మరొక కవి వుండేవాడు. అతనినే డిండిమ
భట్టు అంటారు. శ్రీనాథుడు డిండిమ భట్టును వాగ్యుద్ధంలో ఓడించి అతని
కంచు ఢక్కను పగులగొట్టిస్తాడు. ఈ చారిత్రాత్మక విశేషాలను భారతీ ఫిలిమ్స్ వారు 1966 భక్తపోతన గా నిర్మించారు. ఇందులో పోతనగా గుమ్మడి వెంకటేశ్వర రావు, శ్రీనాథునిగా యస్.వి. రంగారావు, సరస్వతిగా సావిత్రి నటించారు. వ్యాసమహర్షిగా నాగయ్య నటించారు. 1942 లో నిర్మించబడిన భక్త పోతనలో నాగయ్య పోతనగా నటించారు. గాన గంధర్వులు ఘంటసాల గానం చేసిన శ్రీనాథుని పద్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.
| చిత్రం: | భక్త పోతన (1966) | |
| రచన: | శ్రీనాథ కవి | |
| సంగీతం: | సాలూరు రాజేశ్వర రావు | |
| గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు | |
| జననాథోత్తమ దేవరాయ నృపతీ చక్రేశ శ్రీవత్సలాం | ||
| ఛన సంకాశ మహాప్రభావ హరిరక్షాదక్ష నాబోటికిన్ | ||
| కునృపస్తోత్ర సముద్భవంబైన వాగ్దోషంబు శాంతంబుగా | ||
| కనకస్నానము చేసికాక పొగడంగ శక్యమే దేవరన్…. | ||
| జోటీ భారతీ యార్భటిన్ మెఱయు నీ సోద్యంబుగా నేను | ||
| కర్ణాటాధీశ్వరు దేవరాయనృపతిన్ నాటీరధాటీచమోకోటి | ||
| ఘోటకదక్తి కాకురకుటీ కుట్టాకటంఘట్టరస్కోటీబూట | ||
| ధరారజస్తుళికి తాంబోటిన్ ప్రశంసించెదన్ | ||
| దీనారటంకాల దీర్థమాడించితి దక్షిణాధీశు ముత్యాలశాల | ||
| పగులగొట్టించితి ఉద్భట వివాద ప్రౌఢి గౌడ డిండిమభట్టు కంచుఢక్క, | ||
| చంద్రభూష క్రియాశక్తి రాయలయొద్ద పాదుకొల్పితి సార్వభౌమ బిరుదు | ||
| పలుకుతోడై తాంధ్రభాషా మహాకావ్య నైషధగ్రంథ సందర్భమునకు, | ||
| ఎటుల మెప్పించెదో నన్ను నింకమీద రావు సింగ మహీపాలు ధీవిశాలు | ||
| నిండుకొలువున నెలకొనియుండి నీవు సకలసద్గుణ నికురంబ! శారదాంబ! | ||
| సర్వజ్ఞ నామధేయము | ||
| శర్వునకే రావుసింగజనపాలునకే | ||
| ఉర్వింజెల్లును దక్కొరు | ||
| సర్వజ్ణుండనుట కుక్క సామజమనుటే | ||
| ఘనయమునానదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుకాగా | ||
| కాదు బృందావనచర చంచరీక గానంబు గాయక సుగానంబు కాగా | ||
| కలహంస సారస కమనీయ మంజుశబ్దంబులు తాళశబ్దములు కాగా | ||
| దివినుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీనజనులు కాగా | ||
| పద్మరాగాది రత్నప్రభాతమాన మహిత కాళీయ ఫలిఫణామంటపమున | ||
| నళినలోచన విఖ్యాత నర్తకుండు నిత్యనైపుణ్యమున పేర్చి నృత్యమాడే |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి