వందే శంభుముమాపతిం సురగురుం - పరమానందయ్య శిష్యుల కథ నుండి
ఘంటసాల సంగీత దర్శకత్వంలో శ్రీదేవి ప్రొడక్షన్సు వారు పి.పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించిన హాస్యభరిత చిత్రం పరమానందయ్య శిష్యుల కథ. పరమానందయ్య శిష్యుల కథలు ఎంతో ఉల్లాసాన్ని కలుగుజేస్తాయి. టైటిల్ పాత్రలో పరమానందయ్యగా నాగయ్య, వారి శ్రీమతి గా ఛాయాదేవి, శిష్యులుగా అల్లు రామలింగయ్య, పద్మనాభం, రాజబాబు, సారధి, రామచంద్ర రావు, తదితరులు, నందివర్ధన మహారాజుగా ఎన్.టి.ఆర్. నటించారు. నంది వర్ధన మహారాజు పరమ శివభక్తుడు. శివ పూజలో సాంప్రదాయకమైన వందే శంభుముమాపతిం శ్లోకాన్ని మాస్టారు హిందోళంలో ఆలపించగా ఎన్.టి.ఆర్. పై చిత్రీకరించారు.
చిత్రం: పరమానందయ్య శిష్యులకథ (1966) రచన: శివునిపై సాంప్రదాయిక శ్లోకం సంగీతం: ఘంటసాల గానం: ఘంటసాల రాగం: హిందోళం
అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
Thanks to DivyaMedia for the You Tube video
వందే శంభముమాపతిం సుర
గురుమ్
వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరమ్
వందే పశూనాం పతిమ్
వందే సూర్య శశాంక వహ్ని నయనమ్
వందే ముకుంద ప్రియమ్
వందే భక్తజనాశ్రయంచ వరదమ్
వందే శివం శంకరమ్
కృతజ్ఞతలు: సమాచారము, పోస్టరు పొందుపరచిన ఘంటసాల గళామృతము - పాటల పాలవెల్లి బ్లాగుకు, విషయ సేకరణకు వికిపీడియా కు ధన్యవాదములు.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి