'కవికుల గురువు' మరియు అభిజ్ఞాన శాకుంతలము వంటి నాటకము కుమార సంభవము, మేఘ సందేశము , రఘు వంశము వంటి కావ్య త్రయాన్ని రచించిన సంస్కృత పండితుడు మహాకవి కాళిదాసు. ఒక సందర్భంలో కాళిదాసు మహాభారత రచయిత అయిన వేదవ్యాసుని విగ్రహం చూసి, విగ్రహం బొడ్డులో వ్రేలుపెట్టి, ఈయన "చకార కుక్షి" అని ఎగతాళి చేస్తాడు. అంటే పొట్ట (కుక్షి) నిండా చ'కారములున్నవాడు అని అర్ధం. దీనికి కారణం ఒకటుంది. మహాభారతం వ్యాసుల వారు చెబుతూ వుంటే వినాయకుడు వ్రాయడానికి ఒప్పందం కుదురుతుంది. అయితే వినాయకుడు వ్యాసునికి ఒక షరతు పెడతాడు. అదేమంటే వ్యాసుల వారు ఆపకుండా చెప్పాలని. అయితే తను చెప్పినది అర్ధం చేసుకుని మరీ వ్రాయాలని వ్యాసుడు ఎదురు షరతు పెడతాడు. వ్యాసుడు తెలివిగా చిలవలు, పలవలు గల క్లిష్టమైన సమాసాలతో శ్లోకాలు చెప్పడం మొదలు పెడతాడు. అయితే అవి అర్థం చేసుకోవడానికి వినాయకుడు స్వల్ప వ్యవధి తీసుకుంటుంటాడు. ఆ సమయాన్ని వ్యాసుడు తరువాత శ్లోకం తయారు చేసుకోవడానికి ఉపయోగించుకుంటాడు. అయితే చందస్సు కుదరడానికి వ్యాసుడు ఎన్నో చ'కారాలు ఉపయోగిస్తాడు. అందుకే కాళిదాసు ఆయనను చకార కుక్షి అని ఆక్షేపిస్తాడు. దానికి కోపమొచ్చిన వ్యాసుడు కాళిదాసును ఒక్క చకారం కూడ లేకుండా ద్రౌపదికి, పాండవులకు గల బాంధవ్యాన్ని శ్లోక రూపంలో చెబితే గాని వ్రేలు వదలనని చెబుతాడు. "రక్షించారు స్వామీ!" అని కాళిదాసు ఈ దిగువ పద్యం చెబుతాడు.అమర గాయకుడు ఘంటసాల గళంలో వినండి. ఇది 1960 లో సారణీ సంస్థ నిర్మించిన మహాకవి కాళిదాసు చిత్రంలోనిది. దర్శకత్వం 'పౌరాణిక బ్రహ్మ' కమలాకర కామేశ్వర రావు. సంగీతం పెండ్యాల, పద్యాలకు అలనాటి నట గాయకుడు పి.సూరిబాబు సంగీతం కూర్చారని ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి వెలిబుచ్చారు. కాళిదాసుగా ఎ.ఎన్.ఆర్. నటించారు.
ద్రౌపద్యాః పాండు తనయాః పతి దేవర భావుకః
న దేవరో ధర్మరాజః సహదేవో న భావుకః
న దేవరో ధర్మరాజః సహదేవో న భావుకః
ఆ విధంగా ఒక్క చకారము లేకుండా కాళిదాసు శ్లోకం చెప్పేసరికి సంతసించి వ్యాసుడు ప్రత్యక్షమై, కాళిదాసును దీవించి కాళిదాసును "నీ కవిత్వము పరుల దూషణ భూషణలకు కాక, మంచి పనులకు వినియోగించు" అని శలవిచ్చి అంతర్ధానమౌతాడు. అందువలన ఎంత గొప్ప కవికైనా, కళాకారునికైనా తనకన్న గొప్పవారు లేరనిగాని లేదా ఎదుటివారి పాండిత్యం తన పరిజ్ఞానం ముందు ఏపాటిదని తలచే గర్వం కూడదు.
ఘంటసాల మాస్టారి 39వ వర్ధంతి
సందర్భంగా మాస్టారికి నివాళులు సమర్పిస్తూ
వారు గానం చేసిన ఒక శ్లోకం, దాని పూర్వాపరాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను.
Thanks: to kotaonline for posting the you tube video and Telugu Wikipedia and "Ghantasala Galamrutamu-Paatala Paalavelli" blog for the background information.
Thanks for the wonderful slokam remembering Sri Ghantasala on this day
రిప్లయితొలగించండిఈ పద్యం గురించి శ్రీ గంటి లక్ష్మీనరసింహమూర్తి(బెంగుళూరు)ఇలా ప్రస్తావించారు. పైశ్లోకానికి తెలుగు పద్యం 1879 (నవంబరు) పిఠాపిపురం రాజా వారి యాస్థానంలో దేవులపల్లి సుబ్బరాయకవిగారు చెప్పినది-
రిప్లయితొలగించండిచం. జముకొడు కీదుపట్టియును జన్నపుటోరెపు ఱేనికందు దూ
ర్పుమనియగాని వెజ్జులకుఁ బుట్టినవారును బావగార్లు ఱేం
డ్లు మఱుదులౌదురు రైదుగురిలో గడుఁ జిన్నతఁ డెన్నబావగాఁ
డు మఱది గాఁడు పెద్దయతఁడు దగఁ ద్రోవది కెంచి చూచినన్
-విలువైన సమాచారం అందించిన శ్రీయుతులు గంటి లక్ష్మీనరసింహమూర్తి గారికి నమస్సుమాంజలులు - సూర్యనారాయణ వులిమిరి
Chalabagundi chamatkarm.
రిప్లయితొలగించండిద్రౌపద్యాః పాండుతనయాః పతిదేవరభావుకాః|
రిప్లయితొలగించండిన దేవరో ధర్మరాజః సహదేవో న భావుకః||