1959 లో విడుదలైన చిత్రం బండరాముడు. ఈ చిత్రానికి సంగీత దర్సకత్వం సుసర్ల దక్షిణామూర్తి మరియు కె.ప్రసాద రావు. ఇందులో ఘంటసాల మాస్టారు బృందం ఆలపించిన రసవత్తర భక్తీ గీతం రాదా మోహన రాస విహారి". దీనిని చిత్తూరు వి. నాగయ్య గారిపై చిత్రీకరించారు. పాట రచన జంపన (చంద్రశేఖర రావు). ఈయన రచయితే కాక దర్శక-నిర్మాత కూడ. చిత్రానికి దర్సకత్వం పి. పుల్లయ్య. ఈ చిత్రం లో ఎన్.టి.ఆర్., సావిత్రి, రేలంగి, రాజనాల ముఖ్య తారాగణం.
చిత్రం: | బండ రాముడు (1959) | |
రచన: | జంపన | |
సంగీతం: | సుసర్ల దక్షిణామూర్తి, కె.ప్రసాదరావు | |
గానం: | ఘంటసాల, బృందం | |
బృం: | గోపాలా జయ గోపాలా -2 | |
ప: | ఘం: | రాధా మోహన రాసవిహారీ |
యదుకుల పూజిత వనమాలీ | ||
బృం: | గోపాలా జయ గోపాలా -2 | |
మురళీ లోలా మునిజన పాలా | ||
సురగుణ శోభిత గిరిధారీ | ||
బృం: | గోపాలా జయ గోపాలా -2 | |
చ: | ఘం: | మధురం మధురం మాధవ స్మరణం |
మధురం మధురం మా..ధవ స్మరణం | ||
ఆత్మ శాంతికది మూల ధనం | ||
సనక సనందన మునిజన వందితా.. | ||
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. | ||
సనక సనందన మునిజన వందితా.. | ||
నంద కుమారుడె దైవమురా-2 | ||
రాధా మోహన రాసవిహారీ | ||
యదుకుల పూజిత వనమాలీ | ||
బృం: | గోపాలా జయ గోపాలా -2 | |
చ: | ఘం: | శ్యామ సుందరుని కోమల రూపుని-2 |
యమునా విహారుని కొలువుమురా.. | ||
హరియేరా.. శ్రీహరియేరా… | ||
హరియేరా.. శ్రీహరియేరా… | ||
హరిపద సేవయె చరితార్ధమురా-2 | ||
రాధా మోహన రాసవిహారీ | ||
యదుకుల పూజిత వనమాలీ | ||
బృం: | గోపాలా జయ గోపాలా -4 | |
ఘం: | గోపాలా...ఆ..ఆ.. |
కృతజ్ఞతలు: యూ ట్యూబ్ వీడియో అందించిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి, సమాచారం పొందుపరచిన వికిపీడియా మరియు ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి బ్లాగులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.
Thanks for this post. great song.
రిప్లయితొలగించండిSreenivasa garu, you are welcome.
తొలగించండిఘంటసాలగారి ఏపాటైనా వినసొంపే. ఘంటసాలవారు సుప్రసిధ్ధ చిత్తూరు వి. నాగయ్యగారికి కొన్నిపాటలు పాడారు. రామూ సినిమాలోకూడా పాడారు. ఇదొకటి చాలాబావుంది. నాగయ్య గారి సాధుత్వానికి తగ్గ కంఠంలో వుంది. చాలా ఆనందం.
రిప్లయితొలగించండి