సురసాలను ఆస్వాదించే రసికతగల సంగీతాభిమానులకు 1951 లో విడుదలైన మల్లీశ్వరి చిత్రం ఆనాడే కాక, ఈనాటికీ అంతే ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ చిత్రంలో స్వరాల ర'సాలూరు రాజేశ్వ(స్వ)రం వినిపిస్తుంది, సహజకవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి కవితా పటిమ కనిపిస్తుంది. వాహినీ వారి ప్రతిష్టాత్మకమైన ఈ చిత్రం నిర్మాణం వెనుక ఒక సంఘటన వుంది. అదేమిటంటే, దర్శక-నిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి దక్షిణభారతీయుడు బి.ఎన్. రెడ్డి (బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి) ఒకసారి ఒక చిత్ర నిర్మాణ విషయమై హంపి లోని విజయనగరం వెళ్ళినపుడు శ్రీ కృష్ణ దేవరాయలు మసలిన ప్రదేశం ఇదే కదా అన్న స్ఫురణకు వచ్చి, ఆ సన్నివేశాన్ని ఒక ప్రేమ కథతో ముడిపెట్టి చిత్రంగా తియ్యాలనే ఆలోచన వచ్చింది. ఆ తలంపుకు రూప కల్పన మల్లీశ్వరి. గతంలో ఆకాశ వీధిలో పాట గురించి, మల్లీశ్వరి షష్ఠి పూర్తి గురించి పోస్టు చేసాను. ప్రస్తుత పోస్టులో మరొక పాట. అదే, దేవులపల్లి వారి సహజ కవనముద్రలో ద్వంద్వ పదాల వాడుకతో చెప్పుకోదగిన పాట "పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వెయ్యాలి". ఈ పాట వింటే అందులో 'బిరబిర', 'చరచర', 'గుంపులు గుంపులు', 'బారులు బారులు' వంటి పదాలు వారి సంతకాలే అని చెప్పకనే చెబుతాయి. ఆరోజుల్లో పల్లె నుండి పట్నానికి ఎడ్ల బండ్ల మీద తిరణాలు వెళ్ళేవారు. ఆ సన్నివేశంలో ప్రేయసీ ప్రియులు పాడుకుంటూ వెళ్ళే ఈ పాటను సాలూరు వారు మధ్యమావతి, బృందావన సారంగ రాగాలతో కూర్చారు. ముఖ్యం గా ఘంటసాల మాస్టారు, భానుమతి 'పోటీపడి పాడి అలలుగా సాగే, అందమన, ఆహ్లాదకరమైన ఆలాపనలతో ఈ పాటకు వన్నెలు తెచ్చారు' అంటే అతిశయోక్తి కాదు.
కృతజ్ఞతలు: ఉపోద్గాతము లో కొంత భాగము మ్యూజికాలజిస్టు రాజా గారి ఆపాట(త) మధురం నుండి సేకరించడమైనది. వారికి ధన్యవాదాలు. Thanks to Trinidad256 for the You Tube video.
పరుగులు తియ్యాలి ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
సంగీత సాహిత్య సమలంకృతం
దేవులపల్లి సాలూరు ఘంటసాల భానుమతి |
చిత్రం: | మల్లీశ్వరి (1951) | |
రచన: | దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి | |
సంగీతం: | సాలూరు రాజేశ్వర రావు | |
గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు,భానుమతీ రామకృష్ణ | |
పల్లవి: | భానుమతి: | ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. |
ఘంటసాల: | హెయ్! పరుగులు తియ్యాలి ఒ గిత్తలు ఉరకలు వేయాలి | |
హెయ్! పరుగులు తియ్యాలి ఒ గిత్తలు ఉరకలు వేయాలి | ||
భానుమతి: | హేయ్! బిరబిర జరజర పరుగున పరుగున ఊరు చేరాలి | |
మన ఊరు చేరాలి ఓ… | ||
హోరు గాలి, కారు మబ్బులు - 2 | ||
ముసిరేలోగా,మూగేలోగా ఊరు చేరాలి, మన ఊరు చేరాలి | ||
చరణం: | భానుమతి: | గలగల గలగల కొమ్ముల గజ్జెలు |
ఘణఘణ ఘణఘణ మెళ్ళో గంటలు | ||
ఇద్దరు: | ఆ..ఆ..ఆ.ఆ..గలగల గలగల కొమ్ముల గజ్జెలు | |
ఘణఘణ ఘణఘణ మెళ్ళో గంటలు | ||
వాగులు దాటి,వంకలు దాటి ఊరు చేరాలి, మనఊరు చేరాలి | ||
చరణం: | ఘంటసాల: | ఆ..ఆ..ఆ..ఆ.. అవిగో అవిగో.. |
నల్లని మబ్బులు గుంపులు గుంపులు | ||
తెల్లని కొంగలు బారులు బారులు అవిగో.. అవిగో.. | ||
నల్లని మబ్బులు గుంపులు గుంపులు | ||
తెల్లని కొంగలు బారులు బారులు అవిగో.. అవిగో.. | ||
భానుమతి: | ఆ..ఆ..ఆ..పచ్చని తోటలు, విచ్చిన పూవులు | |
మూగే గాలుల తూగే తీగలు అవిగో… | ||
కొమ్మల మూగే కోయిల జంటలు | ||
ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో.. అవిగో.. | ||
ఇద్దరు: | అవిగో.. అవిగో..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. | |
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ |
కృతజ్ఞతలు: ఉపోద్గాతము లో కొంత భాగము మ్యూజికాలజిస్టు రాజా గారి ఆపాట(త) మధురం నుండి సేకరించడమైనది. వారికి ధన్యవాదాలు. Thanks to Trinidad256 for the You Tube video.
a master piece of olden days....i love this song and this movie. thanks, kishen c.rao/venky-villa, winterville, nc.
రిప్లయితొలగించండిmaster piece of olden days. i love this song and the movie, kishen c.rao/venky-villa, winterville, nc.
రిప్లయితొలగించండిThanks Kishen garu
తొలగించండి