'ధనమూలమిదం జగత్' అన్నారు. 'భూమి తన చుట్టూ తానూ తిరుగుతూ ధనవంతుని చుట్టూ తిరుగుతోంది' అని ఒక కవి చమత్కరించాడు. ఈ భూప్రపంచమంతా కాసు లేకపొతే తిరకాసు. కాసుంటే అది తురుఫాసు. దాన్ని మించిన ట్రంపు కార్డు మరొకటి వుండదు. 1959 లో విడుదలైన విజయావారి ప్రతిష్టాత్మక చిత్రం అప్పుచేసి పప్పుకూడు. "అప్పు ఎలా చేయవచ్చు? ఎవరి వద్దనుండి ఎలా అప్పు పుట్టించు కోవచ్చు? ఆ అప్పును ఎలా ఎగ్గొట్టవచ్చు?" అనే ఫిలాసఫీ మీద గిలిగింతలు పెట్టే సునిశితమైన, సున్నితమైన హాస్యం తో అలనాటి సాటి మేటి మహా నటులైన సి.ఎస్.ఆర్.,ఎస్.వి.ఆర్., ఎన్.టి.ఆర్., సావిత్రి, జగ్గయ్య, జమున, రేలంగిల నటనతో ఆద్యంతము ఆనందాన్ని కలిగించి ఎన్ని సార్లు చూసినా తనివితీరని చిత్రమిది. పింగళి నాగేంద్రరావు చేసిన రచనలు, వాడిన పదజాలం ఈనాటికి కూడా గుర్తున్నాయి అందరికీ. సంగీతం సరేసరి ర'సాలూరు రాజేశ్వర రావు రసవత్తర బాణీలు మధుర ఫలరసాలు. ఘంటసాల మాస్టారు ఏ పాటకైన జీవం పోయగల గాన గంధర్వులు అన్నది జగద్విదితం.
వీడియూ మూలం: ఘంటసాల గానామృతం
పల్లవి: |
ఘంటసాల:
|
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా |
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా | ||
బృందం: | అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా | |
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా | ||
చరణం: |
ఘంటసాల:
|
ఓ.ఓ.ఓ. ఓఓఓఓ.. ఆ.ఆ.ఆ.ఆఆఆఆ.. |
దొంగతనము తప్పురా దోపీడీలు ముప్పురా | ||
అందినంత అప్పు చేసి మీసం మెలి తిప్పరా | ||
బృందం: | అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా | |
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా | ||
చరణం: |
ఘంటసాల:
|
ఓ.ఓ.ఓ. ఓఓఓఓ.. ఆ.ఆ.ఆ.ఆఆఆఆ.. |
ఉన్నవారు లేనివారు రెండే రెండు జాతులురా | ||
ఉన్న చోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా | ||
బృందం: | అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా | |
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా | ||
చరణం: |
ఘంటసాల:
|
ఓ.ఓ.ఓ. ఓఓఓఓ.. ఆ.ఆ.ఆ.ఆఆఆఆ.. |
వేలిముద్ర వేయరా సంతకాలు చేయరా | ||
అంతగాను కోర్టుకెళితే ఐపీ బాంబుందిరా | ||
బృందం: | అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా | |
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా | ||
చరణం: |
ఘంటసాల:
|
ఓ.ఓ.ఓ. ఓఓఓఓ.. ఆ.ఆ.ఆ.ఆఆఆఆ.. |
రూపాయే దైవమురా రూపాయే లోకమురా | ||
రూకలేనివాడు భువిని కాసుకు కొరగాడురా | ||
బృందం: | అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా | |
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి