1962 సంవత్సరంలో విడుదలైన శరవణా ఫిలింస్ సంస్థ నిర్మించిన ప్రాయశ్చిత్తం(డ) చిత్రం నుండి ఘంటసాల మాస్టారు జి.కె.వెంకటేష్ ఆలాపనతో పాడిన "పోతే పోనీరా" అనే ఈ గీతం రచన అనిసెట్టి, స్వరపరచినది విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్. ఈ చిత్రంలో తారాగణం శివాజీగణేశన్, బి. సరోజాదేవి, జానకి . ఈ చిత్రానికి నిర్మాత తెలియదు మరియు దర్శకుడు ఎ.భీంసింగ్.
Video Courtesy: Bank of Ghantasala
#000 | పాట: | పోతే పోనీ పోరా | |
---|---|---|---|
నిర్మాణం: | శరవణా ఫిలింస్ | ||
చిత్రం: | ప్రాయశ్చిత్తం (1962) అనువాద చిత్రం | ||
రచన: | అనిసెట్టి | ||
సంగీతం: | విశ్వనాథన్, రామమూర్తి, జి.కె. వెంకటేష్ | ||
పాడినవారు: | ఘంటసాల, (జి.కె. వెంకటేష్ ఆలాపన) | ||
సాకీ: | జి.కె.: | ఓ... ఓ... ఓ..... | |
ప: | ఘ: | పోతే పోనీ పోరా పోతే పోనీ పోరా ఈ | |
పాపపు జగతీ శాశ్వత మెవడురా | | పోతే। | ||
జి. కె. | ఓ... ఓ... ఓ.... | ||
చ: | ఘ: | వచ్చుటయేలో పోవుటయెటకో | |
వాస్తవమెవరూ, కనలేరూ | |||
మానవులందరు జీవిస్తే - ఇలా పాదం నిల్పగ తరమౌనా | |||
జీవితమే ఒక స్వప్నమొ హో మన | |||
జననం కమ్మిన నిద్దురొహో... ఇక | |||
మరణం ఆత్మకు వేకువొహో! పోతే పోనీ పోరా | | పోతే। | ||
చ: | అనురాగాల నిలయం కాదురా అనుక్షణ ప్రళయం ఇదియేరా | ||
ఆశలు ప్రేమలు అగ్ని జ్వాలకే ఆహుతి యౌనిది నిజమేరా | |||
పుట్టిననాడే ఏడ్చేవు బ్రతుకంతా బాధలొ నలిగేవు | |||
ఆవేదనతో వెళిపోయేవు ! పోతే పోనీ పోరా... | | పోతే। | ||
చ: | జికె: | ఓ... ఓ... ఓ.. | |
ఘ: | ప్రకృతి శక్తుల జయించు నరుడా రహస్యం కనలేవే | ||
ధాత్రిలో జీవుల వధించు వాడా తనువుకు జీవం నీవేలే | |||
ప్రాణం పోసిన దాతయెరా ఈ సృష్టికి ఆతడు కర్తయెరా | |||
ఇలసర్వం దేవుని లీలయెరా పోతేపోనీ పోరా | | పోతే। | ||
జికె : | ఓ... ఓ... ఓ... |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి