1955 లో ఎన్.టి.ఆర్. స్వంత సంస్థ అయిన నేషనల్ ఆర్ట్సు థియేటర్స్ (ఎన్.ఏ.టి.) పతాకంపై రామారావు, కాంతారావు, వహీదా రెహమాన్, అంజలీదేవి నటించిన చిత్రం జయసింహ. ఇదే చిత్రాన్ని తమిళ, హిందీ భాషలలోకి డబ్ చేశారు. చిత్రకథలో పినతండ్రి రుద్రసింహుడు (ఎస్.వి.ఆర్.) చేసిన హత్యా ప్రయత్నాలనుండి బయటపడిన జయసింహుడు (ఎన్.టి.ఆర్.) రాజ్యం విడిచి పొరుగురాజ్యంలో రణధీర్ (గుమ్మడి) అనే వీరుని యింట తలదాచుకుంటాడు. రణధీర్ కుమార్తె కాళింది (అంజలి) జయసింహుని ప్రేమించి అర్జునా సుభద్రల పరిచయ ఘట్టాన్ని పద్యరూపంలో తండ్రి గానం చేయగా జయసింహుని తలచుకుని ఊహాలోకంలో విహరిస్తుంది. తరువాత జయసింహుడు తనను సోదరిగా భావించు తున్నాడని తెలిసి కృంగి, త్యాగానికి సిద్ధ పడుతుంది. ఈ సన్నివేశాలలో గుమ్మడికి మాస్టారు గానం చేసిన రెండు పద్యాలను, తదుపరి నేపథ్యంలో వినిపించే విషాద గీతాన్ని వాటి సాహిత్యాన్ని ఈ పోస్టులో మీకు అందిస్తున్నాము.
నరు వలచిన - ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
కృతక యతికి - ఆడియో: ఘంటసాల గాన చరిత
చిత్రం: | జయసింహ (1955) | |
రచన: | సముద్రాల జూనియర్ | |
సంగీతం: | టి.వి.రాజు | |
గానం: | ఘంటసాల |
పద్యం: | నరు వలచిన సోదరి మనసెరిగిన హరీ! | ||
నరు వలచిన సోదరి మనసెరిగిన | |||
హరీ! తీర్థయాత్రకేగిన నరునిన్ | |||
ద్వారకకును మాయా మునివరు | |||
గారాబనిచె వాని వరు గావింపన్ | |||
ఆ..ఆ..ఆ..ఆ.. | |||
వచనం: | అటులేతెంచిన | ||
పద్యం: | కృతక యతికి పరిచర్యకు | ||
చతురత నియమించునటుల సలిపే సుభద్రన్ | | కృతక | | ||
అతులిత వినయ విధేయతా | |||
కుతుక నియతి కొలుచుచుండె కోమలి అతనిన్ | |||
కోమలి అతనిన్ ఆ..ఆ..ఆ..ఆ.. | |||
పాట: | ఆ.. మింటిపైన వెలుగారిపోయే | ||
కంటికీ లోకమే చీకటాయె | |||
బ్రతుకు నులివేడి కన్నీరయేనా | |||
ఆశలన్నీ అడియాసలేనా..ఆ.. |
కృతజ్ఞతలు: వీడియో లభ్యం చేసిన బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి