31, ఆగస్టు 2012, శుక్రవారం

ఘంటసాల బ్లాగు తొలి వార్షికోత్సవం

ఘంటసాల అనగానే గుండెల అంచుల్లో కంచుఘంట మ్రోగే సంగీతకాంత శక్తి అని ఆయన గొంతు కనీసం ఒక్కసారి విన్నవారెవరైనా తప్పక చెబుతారు. అందరూ అభిమానంతో పిలుచుకునే పిలుపు ’మాస్టారు’. మన మాస్టారి పాట విననిదే నాకు పొద్దు గడవదు. ఊహ తెలిసినప్పటినుండి ఆ మంగళ శ్రీకంఠ శ్రీఖండ ప్రసాదసేవనతో ప్రతిదినం ఆయన గానం వింటూ పెరిగాను. ఖంగుమనే ఆ గొంతు వింటే కలిగే స్పందన, గుండెలోతుల భావాలని స్పందిస్తూ అనుక్షణం విలక్షణంగా వినిపిస్తూనే వుంటుంది. నేనే కాదు భారతీయ భావసంగీతంలో మాస్టారి పాటలు వినని వారుండరు. భౌతికంగా ఆయన మనముందు లేనప్పటికీ, ఈనాడు కూడ 80 ఏళ్ళ వృద్ధులయితేనేమి, 8 సంవత్సరాల కుర్రవాళ్ళయితేనేమి ఆయన పాడినపాటలను పాడుకోవడం వింటుంటాం. గాత్రం సంకుచితంకాక, స్వరగాంభీర్యాన్ని, త్రిస్థాయిలో పలికించగల జగన్మంగళగళుడాయన. తన వాచకంతో, గాయన శైలితో సాహిత్యానికి, భావానికి అనుగుణంగా పాటలో రసోత్పత్తిని పండించడంలో ఆయనకు ఆయనే సాటి. వాణిని వినిపించడమేకాదు, తను కట్టిన బాణిలో మనకు కనిపిస్తాడు ఆ మహామహుడు. పాటలను పాడటంలో తన పాటవం చూపిన ఈ గానగంధర్వుడు అంతవరకు నాటకరంగానికి పరిమితమైన పద్యాలను జనం మెచ్చిన రీతిలో, కర్ణపేయంగా చలనచిత్రాలకు అనుగుణంగా వివిధ పౌరాణిక, సాంఘిక, జానపద పాత్రలకు అన్వయింపజేసి, నలుగురూ ఆస్వాదించగల పద్ధతిలో ఆలపించి, తనదంటూ ఒక ప్రత్యేక శైలిని సృజియించి, పద్యవాచనమంటె ఇలా ఉండాలన్న కొంగ్రొత్త ఒరవడిని నెలకొల్పిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఘంటసాల మాస్టారు. ఆయన గానం చేసిన పాటలు, పద్యాల యొక్క సాహిత్యం పూర్తిగా అందరికీ అందుబాటులో లేదు. అవన్నీ ఎలాగయినా ఒక వేదికపైకి తీసుకువస్తే బాగుండునని అనిపించింది నాకు. అయితే నాకున్న పరిజ్ఞానం తక్కువ. "నేను చేయగలనా?" అన్న సందేహం వచ్చింది. అయితే ప్రారంభిస్తే ఏదోవిధంగా సహాయం దొరకకపోదని అనిపించింది. ఆ సంకల్పానికి లభించిన మనస్ఫూర్తికి ఫలమే సరిగ్గా ఒక సంవత్సరం ముందు ఈ 'ఘంటసాల' బ్లాగుకు  నాందీ ప్రస్తావన జరగటం. ఈ బ్లాగు అభివృద్ధికి ముఖ్యంగా ప్రాజెక్టు ఘంటసాల బ్లాగునందు పలువురు ఘంటసాల అభిమానులు సేకరించిన సమాచారము మరియు శ్రవణ సముదాయము, శ్రీయుతులు కొల్లూరు భాస్కరరావు గారి ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి బ్లాగు, శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వరరావు గారు, ప్రణీత్ గారు, తదితరుల వీడియోలు ఒక ఎత్తయితే, మిత్రులు, మన ఘంటసాల-రాగశాల నిర్వాహకులు, సహృదయులు శ్రీ చంద్రమౌళి గారి సాంగత్యము, వారి సహాయ, సహకార, సౌభ్రాతృత్వాలు ఈ బ్లాగు వర్ధనానికి మరింత దోహదం చేశాయి. వీరందరికి సర్వదా కృతజ్ఞుడ్ని. తత్ఫలితంగా ఒక ఏడాదిలో సుమారు 150 ప్రచురణలు చేయడం సాధ్యమయింది. ఇందులో పాటలు, పద్యాలు, వ్యాసాలు, అవధానాలు, పరిచయాలు, ముఖాముఖి చర్చలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పలువురు ఘంటసాల అభిమానులు తమ తమ అమూల్యమైన అభిప్రాయాలను, సలహాలను, సద్విమర్శలను పొందుపరచారు. మీ అందరి సమిష్టి సహకారంతో మాస్టారికి సంబంధించిన మరిన్ని విషయాలు, విశేషాలు మన ఘంటసాల బ్లాగులో ప్రచురించి మాస్టారి అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించాలని ఆశిస్తూ..
- ఎందరో మహానుభావులు! అందరికీ వందనములు.

20 కామెంట్‌లు:

  1. gantasala varu hindi lo padina ekaika pata may be from "rani" evaraina post cheyyandi

    రిప్లయితొలగించండి
  2. అఖిల భారత సంక్రు అభిమాన సంగానికి పెసిడెంటుఆగస్టు 31, 2012

    సుబాకాంచలు

    రిప్లయితొలగించండి
  3. మీ 'బ్లాగ్'కు తొలి వార్షికోత్సవ అభినందనలు.
    @శ్రీ

    రిప్లయితొలగించండి
  4. Dear Suryam gAru,

    Hearty congratulations and 'bravo' for your quality contribution. Through your blog, I am personally benefitted of enhancing my level of appreciation of Ghantasala's music and the important ingredients around and behind each song that was posted.

    Your attitude of gratitude, eye for details,clarity in sharing your knowledge and tapping the sources of specialised knowledge is high commandable.

    Hope you would sustain your enthusiasm and inspiration to work on many more gems of Ghantasala.

    Bon Courage !

    Sreenivasa

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Dear Srinivasa Murty garu, thanks for all the good words, which are blessings for us to carry forward. Certainly there will be much more posts on Ghantasala Mastaru.

      తొలగించండి
  5. ఈ సందర్భంగా మీ blog కు నా అభివందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ శివసుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదములు. మీ అభివందనలే మాకు ఆశీస్సులు.

      తొలగించండి
  6. ఘంటసాల అభిమానులకు మీరు చేస్తున్న సేవ ప్రశంసనీయము. భవిష్యత్తులో మరింత సేవకు మీకు భగవంతుడు సకల సౌకర్యాములు కలుగుచేయాలని కోరుకుంటున్నాము.

    రిప్లయితొలగించండి
  7. ఘంటసాల అభిమానులకు మీరు చేస్తున్న సేవ ప్రశంసనీయము. భవిష్యత్తులో మరింత సేవకు మీకు భగవంతుడు సకల సౌకర్యాములు కలుగుచేయాలని కోరుకుంటున్నాము.

    రిప్లయితొలగించండి
  8. Dear Suryanarayana garu,
    Thanks a million for creating the BLOG and maintaining it very nicely.
    Really looking forward for your regular E mail.
    Regards,
    Apparao (UK now in Vizag)

    రిప్లయితొలగించండి
  9. శ్రీ జాజి శర్మ గారికి, అప్పారావు నాగభైరు గారికి ధన్యవాదాలు. మీ అభినందనలే శుభాసీస్సులు.

    రిప్లయితొలగించండి
  10. అజ్ఞాతజూన్ 26, 2014

    Dear VulimiriGaru
    I have been a frequent visitor to your site as I have been a life long fan of Ghantasala - a rich and a complete voice. You have been doing such a wonderful job of providing quality information and songs and videos. Although few people take time to formally acknowledge what you are doing to popularise and sustain interest in Ghantasala's music, there must be hundreds who quietly watch and enjoy. I believe, it is however, good if people can provide appreciation which will be continuing motivation to keep the excellent work going. Without efforts from yourself we would know less about this devine voice of Ghantasala mastaru and no opportunity to listen to his music. with regards, Muni Chandarshekar

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Dear Chandrashekar garu, thanks for the good words. I am glad you are enjoying my blog.
      Regards
      Suryanarayana Vulimiri

      తొలగించండి

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (2) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కథానాయిక మొల్ల-1970 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్నతల్లి-1972 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (3) చి-పరోపకారం-1953 (3) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-ప్రేమలు పెళ్ళిళ్ళు-1974 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (4) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (4) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (2) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (4) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (2) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కధ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీదేవి-1970 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964 (6) చి-శ్రీసింహాచలక్షేత్రమహిమ-1965 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (3) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (4) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (6) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (87) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (55) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (36) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.ఎస్.విశ్వనాథన్ (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (13) సం-ఓగిరాల (2) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (3) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (85) సం-జి.కె.వెంకటేష్ (1) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (33) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (6) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (40) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (1) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (4) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (4) సం-విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్ (3) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (15) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (20) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (41) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొనకళ్ళ (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-డా. సినారె (1) ర-డా.సినారె (2) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (4) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (27) ర-బమ్మెఱ పోతన (2) ర-బలిజేపల్లి (1) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భక్త నరసింహ మెహతా (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (3) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (5) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (29) ర-సదాశివ బ్రహ్మం (8) ర-సదాశివబ్రహ్మం (1) ర-సముద్రాల జూ. (25) ర-సముద్రాల సీ. (44) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1)