చిత్రం: నవగ్రహ పూజామహిమ (1964)
పాట: జి.కృష్ణమూర్తి
స్తోత్రం: వేదవ్యాస విరచితం
స్తోత్రం: వేదవ్యాస విరచితం
సంగీతం: రాజన్-నాగేంద్ర
గానం: ఘంటసాల, బృందం
గ్రహాల ప్రభావం మన నిత్య కర్మలపై, దైనందిన జీవితం లోని ఫలితాలపై ఉంటుందని చాలామంది నమ్మకం. మన జ్యోతిష శాస్త్రము ప్రకారం గ్రహాలు తొమ్మిది. అవి సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు గ్రహాలు. ఇందులో రాహువు, కేతువు ఛాయా గ్రహాలు. దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా శివ కోవెలలో నవ గ్రహాలను ఈశాన్య దిక్కున ప్రతిష్టిస్తారు. సూర్యుడు కేంద్రంగా మిగిలిన ఎనిమిది గ్రహాలను 3 x 3 వరుసలో ప్రతిష్టిస్తారు. ఈ పోస్టులో ఘంటసాల మాస్టారు నవగ్రహ పూజా మహిమ కోసం గానం చేసిన "నవగ్రహ స్తోత్రం" యొక్క ఆడియో, సాహిత్యం పొందుపరుస్తున్నాను. అయితే నిత్యం వినే స్తోత్రానికి, సినిమాలోని సాహిత్యానికి స్వల్ప వ్యత్యాసం ఉన్నది.
సాకీ: శరణు శరణు గ్రహదేవులారా శరణు
మీ మహిమలను తెలుసుకున్నాను
దాసోహమన్నాను కనులు తెరిచాను
కనులు తెరిచాను
ప: నా మొరను మీరాలకించి
అపరాధము మన్నించి
కావరా మీ దయజూపి | నా మొరను |చ: చేతులారా నేనే, చేసినానపచారం | చేతులారా |
దోషమంతా నాదే, దోషఫలమూ నాదే
కరుణతో నను ఆదరించిన నిరపరాధులకా యీ దందన | నా మొరను |
ఘం: సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ |
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
బృం: సూర్యం ప్రణమామ్యహమ్
ఘం: శ్వేతాశ్వరథమారూఢం కేయూర మకుటోజ్వలమ్ |
జటాధర శిరోరత్నం తం చంద్రం ప్రణమామ్యహమ్ ||
బృం: చంద్రం ప్రణమామ్యహమ్
ఘం: ధరణీగర్భసంభూతం విద్యుత్ కాంతి సమప్రభమ్ |
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ||
బృం: మంగళం ప్రణమామ్యహమ్
ఘం: ప్రియాంగుకలికా శ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ |
సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||
బృం: బుధం ప్రణమామ్యహమ్
ఘం: దేవనాం చ ఋషీనాం చ గురుకాంచన సన్నిభమ్ |
బుద్ధిభూతం త్రిలోకేశం తం గురుం ప్రణమామ్యహమ్ ||
బృం: గురుం ప్రణమామ్యహమ్
ఘం: హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ |
సర్వశాస్త్ర ప్రవక్తారం తం శుక్రం ప్రణమామ్యహమ్ ||
బృం: శుక్రం ప్రణమామ్యహమ్
ఘం: నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజమ్ |
ఛాయా మర్తాండ సంభూతం తం శనిం ప్రణమామ్యహమ్ ||
బృం: శనిం ప్రణమామ్యహమ్
ఘం: అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనమ్ |
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||
బృం: రాహుం ప్రణమామ్యహమ్
ఘం: పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||
బృం: కేతుం ప్రణమామ్యహమ్
ఘం: ప్రణమామ్యహమ్, ప్రణమామ్యహమ్, ప్రణమామ్యహమ్
____________________________________________________
కృతజ్ఞతలు: వీడియో పొందు పరచిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి.
ప్రణమామ్యహమ్!
రిప్లయితొలగించండి...అంతే! అంతకన్నా చెప్పేదేమీ లేదు. :)
సోముడిని మేస్టారు మార్చేశారు.
SNKR గారు ధన్యవాదాలు. అర్థం మారలేదు. పంక్తులు మారాయి. అయినా మాధుర్యం తగ్గలేదు. ప్రణమామ్యహం ఘంటసాల మాస్టారు.
తొలగించండిఈ స్తోత్రంలో నవగ్రహాలను స్తుతించే వరుస (సూర్య్, చంద్ర్, మంగళ, బుధ ..) కీ, ప్రతిష్టించే 3x3 వరుసకీ అసలు పోలికే లేదు .. దీనికేదైనా శాస్త్రంగానీ కథగాని ఉన్నదా?
రిప్లయితొలగించండిశ్రీనాధ్
P.S. మీ బ్లాగ్ చాలా బాగుందండి!
శ్రీనాథ్ గారు, నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు. నవగ్రహాల అమరిక గురించి నాకెరుక లేదు. క్షంతవ్యుడ్ని. అయితే స్తోత్రంలో ఉన్న క్రమంలో వారాల పేర్లు వస్తాయి, రాహువు, కేతువులను మినహాయిస్తే.
తొలగించండిభలేవారే! ఇంతమంచిపాటలని గుర్తుచేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి.
రిప్లయితొలగించండివీడియో ఎక్కడసంపాయించారో గానీ ఇదే మొదటిసారి నేను చూడడం. దీని DVD మీదగ్గర వున్నదా? ఇందులో మరోగొప్ప పాటుంది - "ఎవ్వరో, ఎందుకీరీతి సాదింతురో" - అదికూడా పెట్టండీ వీలయితే. కాకబోతే చిత్రీకరణకన్నా పాట ఎంతో గొప్పగా వుంది(నా అభిప్రాయం మాత్రమే, క్షమించాలి!)
- శ్రీనాధ్
శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. ఈ వీడియో యూ ట్యూబ్ లో దొరికింది. నా దగ్గర DVD లేదండి. మీరు చెప్పిన పాట వీడియో దొరకగానే పోస్ట్ చేస్తాను. అయితే మొత్తం సినిమా భారత్‌మూవీస్.కాం లో ఉన్నది. అవే కాక చాల పాత సినిమాలు ఉన్నాయి.
రిప్లయితొలగించండిచాలా బాగుంది ఈ నవగ్రహస్తోత్రం . Thanq so much
రిప్లయితొలగించండిHats off ---Great GVR
రిప్లయితొలగించండిkani Rahuvu yokka slokamlo "mahaveeryam" ani padabadinadi
ala kakunda "Mahaveeram" ani unte ento bagundedi
NavgrahaGrahastotram must not be changed-ilati doshalu endko arojullo chala chesevaru
Devatalau,Divaniki sambandinchina slokalu gani mantralu gani marche adhikaram
evvarkiledu -adi Divapacharam avutundi-----anyhow good song-thanks for uploading
Kumarfx గారు, నిజమేనండి. ఏదో పొరపాటు జరిగి వుంటుంది. మనకు కారణం ఏమిటో సరిగ్గా తెలియదు. దానిని సీరియస్ గా తీసుకోకండి. ఆ మహానుభావుడు ఉచ్చారణలో, స్వఛ్చతలో, ఎంతో కృషి చేశాడు. ఈ రోజుల్లో చూసుకుంటే, భాష రాకపోయినా, వేరే లిపిలో వ్రాస్కుకుని తప్పులు పాడుతున్నవాళ్ళూ ఉన్నారు. వారితో పోలిస్తే మాస్టారి పొరపాటు చాల స్వల్పం.
తొలగించండిఇకపోతే మీరు చెప్పిన "అధికారం లేదు, అర్హత లేదు, అపచారం" అన్న విమర్శతో నేను ఏకీభవించలేనండి. వాటి గురించి నేను అంత బాధ పడను. మీరు చదువురాని వాడిని తీసుకుంటే, వాడు కేవలం విని ఒక్క తప్పూ లేకుండ పాడగలడనుకోను. వాడికి చదువురాదు, సంస్కృతం రాదు కనుక వాడు భగవంతుడిని తలచుకోకూడదని, స్తుతించకూడదని అనలేం కదా! వాడికున్న పరిజ్ఞానంతో వాడు పాడుకుంటాడు. ఇక్కడ భక్తి ప్రధానం. సరిగ్గా పలికాడా లేదా అన్నది కాదు. నత్తి ఉన్నవాడు శుక్లాంబరధరం కు బదులు చుక్లాంబలదలం అంటాడు. అది పాపం చేయడం వంటిది, అది అపచారం అనుకుంటే, వాడి భక్తిని శంకించినట్లు కాదా. వాడికి భగవంతుడు ఎంత పరిజ్ఞానం ఇచ్చాడో వాడు అంతే ప్రకటించగలడు. మీ స్పందనకు, నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు.
Mee visala drukpadanini na satadhika joharlu
తొలగించండిVimala gana Gandharvulu,karanajanmulu aina Ghantasla gariki eevishayamulo
isumanta doshamuledu- veda sampradayamuga unnatlite bagundunani na abhiprayamu
ante-(sabdamu vilomamina sare aayana madhuragalamu nunchi vaste chalu-madhurame mari)
ఈ విషయంలో మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఘంటసాల మాస్టారు కారణ జన్ములు. అటువంటి ప్రజ్ఞా, పాటవాలు గల సంగీతవేత్త, వ్యక్తిగతంగా నిగర్వి, పరోపకారి, లౌక్యం తెలియని అమాయకుడు, విశాల హృదయుడు, త్రిస్థాయిలో సునాయాసంగా పాడగల అద్వితీయ గాన గంధర్వుడు మరొకరు లేరు, రారు. ఇది ముమ్మాటికీ నిజం. ఆయనలా పాడే వారు చాలమంది వుండవచ్చును. కాని ఆయన లేని లోటును భర్తీ చేసేవారు లేరు. ఆ గళం జగన్మంగళం, అజరామరం.
తొలగించండిPogadina Vyakyalekadu satybharitamina vakhyalinappudu vimarsalu kuda post cheyyalli
రిప్లయితొలగించండిpogidanavi sweekarinchadamu manchivi vedasammatamina vimarasalanu tiraskarinchuta anta manchipani kadu.
LIVING LEGEND గారు, నా బ్లాగు ప్రారంభించినదగ్గర నుంచి అన్ని సలహాలు, విమర్శలు యధాతధంగా ప్రచురించడం జరిగింది. ఈ పాట పోస్టు చేసి చాల రోజులయింది. వీలయినంత వరకు, నాకు తెలిసినంత వరకు సమాధానం వ్రాస్తున్నాను. అప్పుడప్పుడు సమయం చిక్కక వెంటనే స్పందించలేక పోతున్నాను. అంతే. మీరు చేసిన ఆరోపణలు అవాస్తవం. ఇంతవరకు ఇలాంటి కువిమర్శ వినడం ఇదే ప్రధమం. సద్విమర్శలు చేసే వారు సాధారణంగా అజ్ఞాతంగానో, నిక్ నేమ్ పెట్టుకునో వ్రాయరు. మీరు సమాధానం ఆశించే ముందు మీరెవరో తెలిపితే బాగుంటుంది.
తొలగించండిమీకున్న జ్ఞానాన్ని నాకు చాలా అసూయగా వుంది
రిప్లయితొలగించండిమీకున్న జ్ఞాన్ని చూస్తే నాకు చాలా అసూయ గ వుంది
రిప్లయితొలగించండి