గరళకంఠుని వర్ణించు వికటకవి పద్యం గానార్ణవుడైన ఘంటసాల గళంలో
ఈ కార్తీక మాసంలో పరమ శివుని పై ఘంటసాల మాస్టారు పాడిన కొన్ని పద్యాలు, శ్లోకాలు, పాటలు ముందు పోస్టులలో పొందు పరచాను. అయితే కార్తీక మాసము పూర్తి అయ్యే లోగా ఏదైనా చిన్న శ్లోకమో, పద్యమో ప్రస్తుతిద్దా మనుకునేసరికి అనుకోకుండా తెనాలి రామకృష్ణ (1956) చిత్రంలోని ఒక సన్నివేశంలోని శ్లోకం శివునికి సంబంధించినదని అంతర్జాలంలో కొంచెం శోధించాక తెలిసింది. బహుశ ఇది చాలమందికి తెలుసనుకుంటాను. నాకు ఇపుడే తెలిసింది. ఇక ఉండబట్టలేక ఈ పోస్టు వ్రాస్తున్నాను. దేవి వరప్రసాదం వలన రామకృష్ణుడు వికటకవియై, శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో చేరి, తన చతురతతో, సమయస్ఫూర్తితో, అందరినీ ఆనందింపజేసేవాడు. తెనాలి రామకృష్ణునితో కలసి మొత్తం ఎనిమిది మంది కవులు (అష్ట దిగ్గజములు) గల సభను భువనవిజయము అని కూడ అంటారు. ఒక రోజు భువన విజయానికి 'సహస్ర ఘంటకవి' అని బిరుదుగల ప్రెగడ నరసరాజు కవి వచ్చి, తాను "పట్టిన ఘంటం ఆపకుండా వ్రాస్తానని, పరుల కవిత్వలో తప్పులు పడతానని", తన ప్రతిభను గౌరవించి జయపత్రిక ఇవ్వమని రాయలవారిని అడుగుతాడు.
రాయల అనుమతి మీదట ముందుగా అల్లసాని పెద్దన అందుకుని
మరుద్వృధా తటస్థ
శత్రు మండలీ గళాంతర
క్షరన్న వాస్యగాపగాభిసారికాదృతాంబుధీ
మరుత్పతిస్వరుక్షతిక్రమత్రుటత్కుభృద్వర
స్ఫురద్వని
ప్రవృద్ధ యుద్ధ పుంఖితానకార్భటీ
అనే పద్యం చెబుతాడు. ఈ పద్యానికి నేను సేకరించిన విశ్లేషణ, వివరణ ఈ విధంగా వున్నాయిః
ప్రతిపదార్థము - మరుద్వృధా
= కావేరీ నది యొక్క (మరుత్ = గాలుల చేత, వృధా = వృద్ధి గలది); తటస్థ = తీరమునందున్న;
శత్రు మండలీ = శత్రు సమూహముల యొక్క; గళాంతర = గొంతుకల మధ్య నుండి; క్షరత్ = జారుచున్న;
నవాస్యగాపగా(?) = క్రొన్నెత్తురు పేరులనెడు; అభిసారికా = అభిసారికయనగా ప్రియుని గూర్చి
చనునట్లు నుండెడి స్త్రీ; అదృత = సంతోషపరుపబడిన; అంబుధీ = సముద్రము;
తాత్పర్యము - అనగా కృష్ణరాయలు
కావేరీ తీర ప్రాంతములందలి శత్రు రాజులను జంపి వారి నెత్తురును ఏరులుగా ప్రవహింపజేసి
సముద్రము వరకు పారునట్లు చేసెననియు, అవి చూడ నా నెత్తురుటేరులు అభిసారికలవలె సముద్రము
వరకు బోవుట అని భావము.
ప్రతిపదార్థము - మరుత్పతి =
ఇంద్రుని యొక్క; స్వరు = వజ్రాయుధము యొక్క; క్షతిక్రమ = వేటుల వరుస చేత; త్రుటత్ =
పగిలిన; కుభృద్వర(?) = పర్వత శ్రేష్ఠముల వలె; స్ఫురత్ = అధికమగు; ధ్వని = శబ్దముల చేత;
ప్రవృద్ధ = అతిశయించుచున్న; యుద్ధ = యుద్ధమునందలి; పుంఖిత = గుంపులగు; ఆనక = భేరుల
యొక్క; ఆర్బటీ = మ్రోత గల వాడా.
తాత్పర్యము - అనగా కృష్ణరాయలు
యుద్ధము నందు తీసికొని పోవు భేరుల మ్రోతలు దేవేంద్రుని వజ్రాయుధ హతిచే కూలు; పర్వత
ధ్వనుల వలె నొప్పెనాని భావము.
(సేకరణ - తిమ్మనార్య
కృత పారిజాతాపహారణ కావ్యమునకు శ్రీ నాగపూడి కుప్పుస్వామయ్య గారి వ్యాఖ్యానము నుండి.)
దీనిని సమీకరించి
స్పందన రూపంలో నాకు ఒసంగిన శ్రీ సూర్య (బెంగళూరు) వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ పద్యం వ్రాసానని నరసరాజు చెప్పడంతో, ఎలాగైనా ఈ కవి గర్వం అణచాలని నిశ్చయించుకుని తెనాలి రామకృష్ణుడు ఈ దిగువ గల పద్యం వ్రాయమంటాడు -
శివుని వర్ణన
త్పృవ్వటబాబా తలపై
పువ్వట జాబిల్లి, వల్వ బూదట, చేదే
బువ్వట, చూడగను ళుళు
క్కవ్వట, నరయంగ నట్టి హరునకు జేజే !!
ఈ పద్యం ఎలా ప్రారంభించాలో మొదట్లోనే ఇబ్బంది పడిన నరసరాజు ఘంటం ఆగిపోతుంది. అపుడు రామకృష్ణుడు మందలింపుగా ఇలా తిడతాడు.
తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్
పలుకగ రాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ
పలికిన నోట దుమ్ముబడ భావ్యమెరుంగవు పెద్దలైన వా
రల నిరసింతురా ప్రగడ రాణ్ణరసా! విరసా! తుసా! భుసా!
అపుడు రాయల వారు రామకృష్ణుని శాంతించమని నరసరాజ కవికి కావలసినంత ధనం ఇప్పించి పంపించేస్తాడు. తరువాత అదే పద్యాన్ని రాయల వారు తన భార్య తిరుమల దేవికి చెప్పగా, ఆమె చిత్ర రూపంలో ఆ పద్యాన్ని వ్రాసి చూపించి రాయల వారి కానుక గ్రహిస్తుంది.
ఈ శ్లోకంలో "అట" అనే శబ్దం పలుమార్లు వస్తుంది. త్పృవ్వ* = ఎద్దు (పశువుల కాపరులు ఆవులు కాస్తూ పెదవులతో చేసే ధ్వని ఇది. అలాగే తువ్వాయి కి అర్ధం "దూడ" అని; బాబా = వాహనము (ఇది బహుశా ఆవుగాని ఎద్దుగాని అంబా..అంబా. అని అరుస్తాయి. అందులోనుంచి పుట్టిన ధ్వని కావచ్చు; *నా చిరకాల మిత్రులు శ్రీ అహోబిల మురళి గారు హ్యుస్తను,టెక్సాస్ నుండి ఫోనుచేసి సూచించారు. త్ప్రువ్వత అనే పదం రాయల సీమలో వాడుకలో ఉండే పదం. దానికి అర్ధం నీరు అని. త్ప్రువ్ = నీరు; బాబా = శివుడు; తలపై నీరు (గంగ) కలవాడు = గంగాధరుడు లేదా శివుడు. వల్వ = వస్త్రము; బూది = విభూది లేక విభూతి లేక బూడిద; చేదే = చేదుగా ఉండెడిది (విషం); బువ్వ = ఆహారము; ళుళుక్కవ్వ = ఉండకపోవటం; (ఉదా.హుళక్కి); అరయంగనట్టి = అటుల వెలుగొందు; హరుడు = శివుడు; జేజే = విజయము.
తాత్పర్యం: తలపై గంగ ధరించిన వాడట. తల మీద చంద్రుడు పువ్వువలె ఉన్నాడట. విభూతే వస్త్రమట. చేదైనది (విషం) భోజనమట. దిక్కులేని వాడట. అట్టి పరమశివునికి జేజేలు.
గమనిక: ఈ వివరణ నా స్వంతం కాదు. ఆసక్తితో అంతర్జాలంలో శోధించగా ఒక బ్లాగులో దొరికింది నాకు. దానికి నా ఊహను జోడించి పైన వివరించాను. ఈ శ్లోకం యొక్క అర్ధం వివరించబడిన బ్లాగు లింకు కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అయితే మన తెలుగు మనం మరచి పోతున్న ఈ రోజులలో ఇలాంటి వివరణలు లభిస్తే పద్యాలను ఇంకెంతో ఆస్వాదించ వచ్చును. ఔత్సాహికులయిన తెలుగు ఆచార్యులు ఈ పనికి పూనుకుంటే చాల బాగుంటుంది.
తెలుగు భాషలో సందర్భానుసారంగా కొన్ని పదాల అర్థాలు మారుతుంటాయి. ఈ పోస్టులోని త్ప్రువ్వట బాబా పద్యంలో మొదటి వాక్యానికి గల అర్ధాన్ని వివరించిన మిత్రులు శ్రీ అహోబిలవఝ్ఝల మురళిగారికి ధన్యవాదాలు.
మరుద్వృధా తటస్థ శత్రు మండలీ గళాంతర క్షరన్నవాసృగాపగాభిసారికాదృతాంబుధీ మరుత్పతిస్వరుక్షతిక్రమత్రుటత్కుభృద్వర స్ఫురద్ధ్వనిప్రవృద్ధ యుద్ధ పుంఖితానకార్భటీ
మరుద్వృధా = కావేరీ నది యొక్క (మరుత్ = గాలుల చేత, వృధా = వృద్ధి గలది) తటస్థ = తీరమునందున్న శత్రు మండలీ = శత్రు సమూహముల యొక్క గళాంతర = గొంతుకల మధ్య నుండి క్షరత్ = జారుచున్న నవాసృగాపగా = క్రొన్నెత్తురు టేరులనెడు అభిసారికా = అభిసారిక స్త్రీల చేత అదృత = సంతోషపరుపబడిన అంబుధీ = సముద్రము కల వాడా
అనగా కృష్ణరాయలు కావేరీ తీర ప్రాంతములందలి శత్రు రాజులను జంపి వారి నెత్తురు లేరులుగా ప్రవహించి సముద్రము వరకు పారునట్లు చేసెననియు, నవి చూడ నా నెత్తురుటేరు లభిసారికల వలెను నవి సముద్రము వరకు బోవుట అభిసారికలు ప్రియుని గూర్చి చనునట్లు నుండెననియు భావము.
మరుత్పతి = ఇంద్రుని యొక్క స్వరు = వజ్రాయుధము యొక్క క్షతిక్రమ = ఏటుల వరుస చేత త్రుటత్ = పగిలిన కుభృద్వర = పర్వత శ్రేష్ఠముల వలె స్ఫురత్ = అధికమగు ధ్వని = శబ్దముల చేత ప్రవృద్ధ = అతిశయించుచున్న యుద్ధ = యుద్ధమునందలి పుంఖిత = గుంపులగు ఆనక = భేరుల యొక్క ఆర్భటీ = మ్రోత గల వాడా
అనగా కృష్ణరాయలు యుద్ధము నందు తీసికొని పోవు భేరుల మ్రోతలు దేవేంద్రుని వజ్రాయుధ హతిచే కూలు పర్వత ధ్వనుల వలె నొప్పెనాని భావము.
(సేకరణ - తిమ్మనార్య కృత పారిజాతాపహారణ కావ్యమునకు శ్రీ నాగపూడి కుప్పుస్వామయ్య గారి వ్యాఖ్యానము నుండి)
శ్రీ సూర్య గారు, మొదటగా కారణాంతరాల వలన మీ స్పందంకు ప్రతిస్పందన నిచ్చుటలో మితిమీరిన జాప్యం జరిగింది. అందుకు క్షంతవ్యుడ్ని. మీరు పొందుపరచిన పద్యవిశ్లేషణకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ వివరాలను జోడించి సవరించెదను.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com
తెలుగు భాషలో సందర్భానుసారంగా కొన్ని పదాల అర్థాలు మారుతుంటాయి. ఈ పోస్టులోని త్ప్రువ్వట బాబా పద్యంలో మొదటి వాక్యానికి గల అర్ధాన్ని వివరించిన మిత్రులు శ్రీ అహోబిలవఝ్ఝల మురళిగారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిee padyaalu vintunte ento haayigaa undi. malli malli vinaalanipistunnaadi. meeku dhanyavaadaalu
రిప్లయితొలగించండిcinema madhyamam dwara panditulane kadu pamarulanu kooda rasagnuluga, kavita poshakuluga, abhiruchini penchi vaarilo kooda grandhika kavitwamu meeda aasakti, pandityamu patla abhiruchi, abhimanamu penchavachchani niroopinchina itivruttalu koorchabadina aa rojula lone kavulaku, sahitimoortulaku satakoti vandanalu -rao
రిప్లయితొలగించండిసూర్యనారాయణ గారు "భువన విజయం" నాటకం చార్లెట్ లో ఏప్రిల్ 27 వ తేదీన వేస్తున్నారండి. మీకు ఆసక్తి ఉంటే తెలుగు అసోసియేషన్ సభ్యులను ఎవరినైనా సంప్రదించండి.
రిప్లయితొలగించండిSunil gariki, abhivandanalu mariyu abhinandanalu. mee sahithi seva goppaga undi.
రిప్లయితొలగించండిఇప్పటి వరకు రామకృష్ణకవి చెప్పిన పద్యానికి అర్ధం తెలియకుండానే ఆనందించాం.
రిప్లయితొలగించండితెలిపి మరింత సంతోషపెట్టిన మీకు శతవందనాలు.
మరుద్వృధా తటస్థ శత్రు మండలీ గళాంతర
రిప్లయితొలగించండిక్షరన్నవాసృగాపగాభిసారికాదృతాంబుధీ
మరుత్పతిస్వరుక్షతిక్రమత్రుటత్కుభృద్వర
స్ఫురద్ధ్వనిప్రవృద్ధ యుద్ధ పుంఖితానకార్భటీ
మరుద్వృధా = కావేరీ నది యొక్క (మరుత్ = గాలుల చేత, వృధా = వృద్ధి గలది)
తటస్థ = తీరమునందున్న
శత్రు మండలీ = శత్రు సమూహముల యొక్క
గళాంతర = గొంతుకల మధ్య నుండి
క్షరత్ = జారుచున్న
నవాసృగాపగా = క్రొన్నెత్తురు టేరులనెడు
అభిసారికా = అభిసారిక స్త్రీల చేత
అదృత = సంతోషపరుపబడిన
అంబుధీ = సముద్రము కల వాడా
అనగా కృష్ణరాయలు కావేరీ తీర ప్రాంతములందలి శత్రు రాజులను జంపి వారి నెత్తురు లేరులుగా ప్రవహించి సముద్రము వరకు పారునట్లు చేసెననియు, నవి చూడ నా నెత్తురుటేరు లభిసారికల వలెను నవి సముద్రము వరకు బోవుట అభిసారికలు ప్రియుని గూర్చి చనునట్లు నుండెననియు భావము.
మరుత్పతి = ఇంద్రుని యొక్క
స్వరు = వజ్రాయుధము యొక్క
క్షతిక్రమ = ఏటుల వరుస చేత
త్రుటత్ = పగిలిన
కుభృద్వర = పర్వత శ్రేష్ఠముల వలె
స్ఫురత్ = అధికమగు
ధ్వని = శబ్దముల చేత
ప్రవృద్ధ = అతిశయించుచున్న
యుద్ధ = యుద్ధమునందలి
పుంఖిత = గుంపులగు
ఆనక = భేరుల యొక్క
ఆర్భటీ = మ్రోత గల వాడా
అనగా కృష్ణరాయలు యుద్ధము నందు తీసికొని పోవు భేరుల మ్రోతలు దేవేంద్రుని వజ్రాయుధ హతిచే కూలు పర్వత ధ్వనుల వలె నొప్పెనాని భావము.
(సేకరణ - తిమ్మనార్య కృత పారిజాతాపహారణ కావ్యమునకు శ్రీ నాగపూడి కుప్పుస్వామయ్య గారి వ్యాఖ్యానము నుండి)
శ్రీ సూర్య గారు, మొదటగా కారణాంతరాల వలన మీ స్పందంకు ప్రతిస్పందన నిచ్చుటలో మితిమీరిన జాప్యం జరిగింది. అందుకు క్షంతవ్యుడ్ని. మీరు పొందుపరచిన పద్యవిశ్లేషణకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ వివరాలను జోడించి సవరించెదను.
తొలగించండి