1962 సంవత్సరంలో విడుదలైన శరవణా ఫిలింస్ సంస్థ నిర్మించిన ప్రాయశ్చిత్తం అనువాద చిత్రం నుండి ఘంటసాల మాస్టారు ఘంటసాల మాస్టారు పాడిన "మధుర ప్రేమను కానుక ఇచ్చి " అనే ఈ ఏకగళం రచన అనిసెట్టి, స్వరపరచినది విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్. ఈ చిత్రంలో తారాగణం శివాజీగణేశన్, బి. సరోజాదేవి, జానకి . ఈ చిత్రానికి నిర్మాత తెలియదు మరియు దర్శకుడు ఎ.భీంసింగ్. ఈ చిత్రానికి మాతృక 1961 లో విడుదలైన “పాలుంపళముం” అనే తమిళ చిత్రం.
#0000 | పాట: | మధురప్రేమను కానుక యిచ్చి | |
---|---|---|---|
పతాకం: | శరవణా ఫిలింస్ | ||
చిత్రం: | ప్రాయశ్చిత్తం(1961) - అనువాద చిత్రం | ||
సంగీతం: | ఎం.ఎస్.విశ్వనాథన్ - రామ్మూర్తి | ||
రచన: | సముద్రాల సీనియర్ | ||
గానం: | ఘంటసాల | ||
సాకీ | ఊ...ఊ...ఊ... | ||
ప. | మధుర ప్రేమను కానుక యిచ్చీ, మనసులోన మమతను నించి | ||
శోకమయమీ జీవనయాత్ర తోడునీడగ లభించినావె | ||మధుర|| | ||
చ. | ఒడిని జేర్చీ పాటలు పాడీ, హృదయ మిచ్చీ సరసమ్మాడీ -2 | ||
కంటిరెప్పగ ననుకాపాడు, కాంతయే నాకీ భువితోడు -2 | ||మధుర|| | ||
చ. | ముగ్ధముగమూ విరియనెలేదు, ముద్దు మాటల మురిపంలేదు | ||
లేతనగవే కనపడదేలా?, ఆశవీడి తపింతువేలా? | ||మధుర|| | ||
చ. | కన్నతల్లినె కనలేదు నేను, నాకు దైవం వేరెవ్వరిలను -2 | ||
నిన్ను కావగ వృధ నా జన్మ వేదనందూ కుమిలెదవేలా -2 | ||మధుర|| | ||
ఊ... ఊ... ఊ...ఊ.... |
Thanks to Sri Vutukuri Satyanarayana garu, Australia for providing the valuable video clip.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి