ప్రతిష్ఠాత్మకమైన చిత్రాలను అందించే అలనాటి మేటి సంస్థ విజయ. ఈ సంస్థ 1959లో, "అప్పు" ఇతివృత్తంగా నిర్మించిన ఆద్యంతం గిలిగింతలు పెట్టే చక్కని చిత్రం "అప్పుచేసి పప్పుకూడు". అందులో ముఖ్యంగా ఈ సన్నివేశంలో భజగోవిందం (రేలంగి) అభినయించిన ఘంటసాల మాస్టారి పద్యం 'నవకళాసమితిలో'. నాటకాల కంపెనీలో పనిచేస్తూ నటుల అనుభవాలను, వాళ్ళు కంటున్న కలలకు ప్రతిరూపం ఈ పద్యయుగళం. పద్యానికి ఒరవడి దిద్దిన ప్రాజ్ఞుడు ఘంటసాల. ఆ పద్యాలు పలుచిత్రాలలో కథకు ప్రాణం పోసాయనడంలో అతిశయోక్తిలేదు. అలనాటి మాటల మాంత్రికుడు పింగళి నాగేశ్వరరావు కలం నుండి జాలువారిన ఈ రసగుళికలకు, రసాలూరు సాలూరు రాజేశ్వర రావు గారు సంగీతం సమకూర్చగా, అద్భుతంగా గానం చేసారు ఘంటసాల మాస్టారు. ఆస్వాదించండి.
Thanks: Video courtesy by Sri Nukala Prabhakar garu (Project Ghantasala)
నవకళాసమితిలోనా వేషమును చూసి
ఎచ్చటెచ్చటి జనుల్ మెచ్చవలదె….
నటరాజ నటరత్న నటకావతంసుడన్
బిరుదులుగొని విఱ్ఱవీగవలదె!
ప్రతి పట్టణ, గ్రామ, పల్లెపల్లెలుకూడ
ఈ భజగోవిందమేలవలదే…
ఊరూరగల కాఫిహోటళ్ళలో, కిళ్ళి
కొట్లలో మనకప్పు పుట్టవలదే…
ఆంధ్రనాటక రంగమార్తాండుడనుచు
సభలుకావించి ప్రేక్షకుల్ సత్కరింప
పెట్టుబడికోసమప్పులిప్పించి, యిచ్చి,
ఈ విశాలాంధ్ర నన్ను పోషించవలదె!
Thanks: Video courtesy by Sri Nukala Prabhakar garu (Project Ghantasala)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి