3, డిసెంబర్ 2014, బుధవారం

రాగశాల పాటల తోటలో జనరంజక గాయకుని జయంతి సందర్భాన ఈ పూట: ఘంటసాల నోట - గంభీర నాట

మాస్టారికి జన్మదిన శుభాకాంక్షలు
తెలుగువారి గుండెలను తన గాన మాధుర్యమనే ఆనందార్ణవాన్ని నింపిన రసరాగ సింధువు మరియు స్వరరాగ నిఘంటువు మన ఘంటసాల. ఈ సర్వమంగళ గుణసంపన్న గాన గంధర్వుడు మనం ప్రతి క్షణం తలచే గళవేల్పు. అజరామరమైన బాణీలను తన వాణిలో పూరించి, మాణిక్యవీణను పలికించి, రసరాజులను మెప్పించి 'రసికరాజ తగువారము కామా' అని జయభేరి మ్రోగించిన అమరగాయకుడు మన ఘంటసాల మాస్టారు. ఆయన తన పాటల్లో మనకు కర్ణపేయమైన కర్ణాటక సంగీతంతో పాటు బందోబస్తుగ ముస్తాబైన హిందుస్తానీ పోకడలను కూడ రుచిచూపించాడు. తన విలక్షణమైన సంగీతజ్ఞతతో ఎన్నో అద్భుతాలు చేసాడాయన.  అన్యస్వరాలనుపయోగించినా పాట మాధుర్యాన్ని పెంచాడే తప్ప తగ్గించలేదు.  తెలుగు చలనచిత్ర సంగీతత్రయములో సాలూరు, పెండ్యాల, ఘంటసాల తిరుగులేని సంగీత సామ్రాజ్య రసరాజులు. అయితే ఘంటసాల గళమివ్వడము, స్వరపరచడము మాత్రమే కాక స్వయంగా రచనలు చేయడం గొప్ప విషయం. అటువంటి రాగ-భావ-తాళ-మేళాలను సంఘటిటపరచిన మన ఘంటసాల జన్మదినం ఈరోజు. మన ఘంటసాల రాగశాలలో మాస్టారు పాడిన ఎన్నో రాగాల గుఱించి ఇదివరకు మిత్రులు చంద్రమౌళి గారు ముచ్చటించారు. మరి ఈ రోజు మరొక రాగం గుఱించి తెలుసుకుందామా? అయితే అడుగుపెట్టండి రాగశాల లోనికి.


సంగీత ప్రపంచపు వేలకొలది విద్వాంసులలో ఎందరో శాస్త్రవేత్తలు, మరెందరో గాయకులు, వారిలో కొందరే ఖ్యాతనాములు.  ఆ కొందరిలో వ్రేళ్ళమీద లెక్కపెట్టగలిగినంత మాత్రమే స్వరసాహిత్యసవ్యసాచులు. ఆ కొద్దిమందిలో సంగీత మాధురినీ, సాహిత్య సంపదను తమ స్పష్టోచ్చారణతో, ఎదను కరిగించి, కదిలించే భావరసగానవర్షణాసమర్థ యుగపురుషులు ఎందరు? త్యాగరాజస్వామి వారి భాషలో చెప్పాలంటే, 'సామ నిగమజ సుధామయ గానవిచక్షణ' మైనది ఘంటసాల మోహన గళం. త్రిస్థాయిలో గమక సంపదల మెరుపులతో రక్తికట్టించే గళమది. అది ఇత్తడిని పుత్తడిచేసే స్పర్శమణి. ఏపాటైనా ఏపద్యమైనా ఘంటసాల గళం నుండి వెలువడితే అది రసికుల ఎదలో మెదలి పెదవులపైన పలుకుతుంది.  చిరస్మరణీయంగా నిలబడిన అలాంటి రత్నాలెన్నో!

తనకు తెలిసిన  శాస్త్రీయ సంగీత రహస్యాలను వ్యాసాలలో, భాషణాలలో వ్యాఖ్యానించక, ఇది శాస్త్రీయ సంగీతం, ఇది ఇలాంటి రాగాన్ని ఆధారింపబడినది అని ఎక్కడా చెప్పక, తన స్వరకల్పనలో, ఆలాపనలో, పాటలలో మరియు పద్యాలలో అపురూపమైన శాస్త్రీయరాగాలని ప్రవేశబెట్టిన మహితాత్ముడు మన ఘంటసాల మాస్టారు. ఆయన ఎన్నో రాగాలకు తన గళంతో ప్రాణం పోశారు. అల్పప్రసిద్ధములైన రాగాలకి సైతం రసపుష్టిని సమకూర్చి అసాధారణంగా ఆలపించారు. తన జీవనసంధ్యాసమయంలో అధ్యాత్మికానుభూతితో భగవద్గీతలోని సారభూతమైన అష్టోత్తరశతశ్లోకగాయనమునకు ఆయన వాడిన రాగాలు దాదాపు నలభైయైదు ఉన్నాయి. ఆ రాగాలలో ఆయనే ప్రసిద్ధపరచిన రాగాలు గాక, ఎన్నో కొత్తప్రయోగాలూ, పోకడలు మనకు వినిపిస్తాయి. త్యాగరాయ కృతులనూ, రామదాస – అన్నమయ్య కీర్తనలనూ ఆ మార్గంలోనే పాడాలన్న ఆయన అభిలాష పూర్తిగా నెరవేరక అవన్నీ గంధర్వ సదస్సులో వినిపించడానికే మాస్టారు నిర్ణయించుకున్నారా అనిపిస్తుంది. 

గాయకజీవనారంభదశలో, ఆయన శాస్త్రీయ సంగీత కచేరీలు చేస్తూ, ఆ వృత్తి ఆర్థికంగా విఫలమైన ఘటన శాస్త్రీయసంగీతానికి అపారనష్టాన్ని కలిగించింది. కాని వెండితెరకు నేపథ్యగానమాధుర్యాన్ని, తెలుగుపద్య పఠనావిధానాన్ని సమకూర్చి నిరవధికమైన కీర్తిని, లాభాన్ని చేకూర్చింది. ఘంటసాల శాస్త్రీయ సంగీతంలోనే  రాణించి నిలిచి ఉంటే, కర్ణాటక శాస్త్రీయసంగీత దేవతకు, రెండు కళ్ళుగా ఇద్దరు గాయకసార్వభౌములుండేవారు.  వారు మధురమైన గళమూ, శాస్త్రీయ సంగీతవైదుష్యమూ కావ్యనాటకాది సాహిత్యప్రతిభాలబ్ధ వాగ్గేయకారత్వ సవ్యసాచిత్వమూ సమ్మిళితమైన ఘంటసాల మరియు మంగళంపల్లి గార్లు. ఆవిధంగా శాస్త్రీయగానానికి లభ్యంకాని ఘంటసాల స్వరనిధి, సినిమా సంగీతానికి అక్షయమైన పెన్నిధిగా నిలవడం నిజంగా విధివిలాసమే.

సప్తస్వర సంపూర్ణములైన 72 మేళకర్తరాగాలలో కొన్నివేల జన్యరాగాలు జన్మనెత్తాయి. స్వరోత్పత్తి తంత్రాంశాన్ని ప్రత్యేకించి గమనించిన శ్రుతులలో దీప్త, ఆయత, కరుణ, మృదు, మధ్యమములని ఐదు జాతులున్నవి. షడ్జమమునకు నాలుగు, రిషభమునకు మూడు, గాంధారమునకు రెండు, మధ్యమమునకు నాలుగు, పంచమమునకు నాలుగు, దైవతమునకు మూడు, నిషాదమునకు రెండు శ్రుతులుగా సప్తస్వరాలకు 22 శ్రుతులు గలవు. ఇందులో స--ప స్వరాలకు మాత్రమే 4 శ్రుతులుగనుక ఇవే ప్రధానస్వరాలు. స అను షడ్జమస్వరమే మిగిలిన ఆరు స్వరములకు ఆధారం. వనస్పతి, మానవతి, సేనావతి, హాటకాంబరి, వరుణప్రియ, యాగప్రియ, నవనీతము, గవాంబోధి….ఈ పేర్లు మనం సంగీత కచేరీలలో వింటున్నామా? అవి రాగాల పేర్లేనా? అనే అనుమానం వస్తుందేమో గాని ఈ మేళకర్తరాగాల స్వరస్వరూపం కల్యాణి, చక్రవాకం,శంకరాభరణ రాగాల్లా సామాన్య సంగీతరసికులకు బోధపడదు. పాటలకు బాణీ కట్టే సందర్భాలలో (రాగసంయోజనావిధానం)  ప్రజలు పాడుకోవడానికి వీలుగ ఉండాలని నా తపన" అంటూ  ఘంటసాలగారే ఒక సందర్భంలో అన్నారు.  సప్తస్వరాలూగల జనకరాగాల విస్తృతవిన్యాసం ఒక వైభవమైతే, ఐదుస్వరములుగల ఔడవ-ఔడవరాగాల (ఆరోహణావరోహణంలో ఐదు స్వరాలున్న రాగాలు) ఆకర్షణ బహుజనరంజకం. ఔడవరాగాలలో రెండుస్వరాల నడుమ ఉన్న శ్రుతుల అంతరం ఎక్కువ. అందువలన స్వరస్థానాలు నిర్దిష్టముగా పలుకడానికి అనుకూలంగా వుంటుంది  నిర్దిష్టముగా పలికే  పంచస్వరసంయోజితరాగాలు జనరంజకాలు. ఉదాహరణకు వేదమంత్ర పఠనానికి ఆధారం మూడు స్వరాలే. అవి ని-స-రి. 

ఘంటసాల ఈ రహస్యాన్ని గుర్తించి చేసిన రాగప్రయోగాలు ఎన్నో పాటలలో మనకు కనిపిస్తాయి. ఒక్కక్షణంలోనె ఉద్దేశిత రసావిష్కరణమును చేయగల శక్తి ఆయన గాత్రానిదైతే, దానికి ఔడవరాగప్రయోగాలు అనుకూలంగా పొసగినవి.  అందులోనూ హిందోళం, భూపాలం, శుద్ధధన్యాసి, శుద్ధసావేరి, హంసధ్వని, రేగుప్తి, మోహన, వలజి, శివరంజని, అమృతవర్షిణి, ఆభోగి, విజయనాగరి వంటి  ఔడవ రాగాలను ఆయన ఎక్కువగా ఎన్నుకొన్నారు. ఇవన్నీ ప్రఖ్యాతమైన రాగములే. అయితే అంతగా ఖ్యాతిగాంచని ఒక రాగం "గంభీర నాట". ఇది ముప్పైయారవ మేళకర్త చలనాటరాగజన్యం. 'చల' అన్నపూర్వపదం 'కటపయాది' సూత్రనియమితమైన సంఖ్యాసూచక పద్ధతి. చలనాటకు ఆరోహణ  S R3 G3 M1 P D3 N3 S,  అవరోహణ  S N3 D3 P M1 G3 R3 S. దీని నుండి వచ్చిన ప్రముఖ జన్యరాగాలు రెండు. అవి నాట రాగం (ఆ: S R3 G3 M1 P D3 N3 S  |  అవ: S N3 P M1 G3 M1 R3 S) మరియు గంభీర నాట రాగం (ఆ: S G3 M1 P N3 S  | అవ:  S N3 P M1 G3 S ). గంభీర నాట (నాట్టై – తమిళం, శుద్ధ నాట్టై) ఔడవ-ఔడవరాగం. గంభీర నాటకు తిల్లంగ్ రాగానికి (ఆ: S G3 M1 P N3 S  | అ:  S N2 P M1 G3 S ) చాల దగ్గరపోలికలున్నాయి. ఆరోహణంలో రెండురాగాలకూ అవే స్వరాలుంటాయి. అయితే తిల్లాంగ్ అవరోహణంలో గంభీరనాటలోని కాకలి నిషాదానికి (తీవ్ర్ నిషాద్, N3, B-sharp ఫ్రీక్వెన్సీ 15/8) మారుగా కైశిక నిషాదం (కోమల్ నిషాద్ N2, B-flat ఫ్రీక్వెన్సీ 9/5) వస్తుంది. గంభీరనాట మూర్ఛనలో గాంధారంపై గ్రహబేధం చేయగా భూపాలరాగం సృజింపబడుతుంది. ఇంకొక విశేషమేమంటే గంభీరనాటలోని శుద్ధమధ్యమాన్ని ప్రతిమధ్యమంజేస్తె అరుదెంచే రాగం అమృతవర్షిణి. అలాగే మధ్యమాన్ని తీసి చతుశ్రుతి రిషభం వేస్తే హంసధ్వని ధ్వనిస్తుంది. ఇవన్నీ ప్రఖ్యాతమైన రాగాలే.

గంభీరనాట త్యాగరాజుల కాలంలో ప్ర్రచురణలో ఉన్నట్టు మనకు తెలియదుగాని, ఇది ప్రముఖంగా తమిళ ప్రాంతంలో ఎక్కువ ప్రసిద్ధమైన రాగం.  దేవస్థానోత్సవ సంబంధిత మంగళ సన్నివేశాలలో నాదస్వర వాదనం అనాదిగానున్న ఆచారం. నాదస్వర వాదన ప్రస్తుతిలో మల్లారి, పంచనడై, ఘనరాగపంచకం, రాగం-తానం-పల్లవి మొదలైన సాంప్రదాయిక అంశములున్నవి.  శాస్త్రీయ సంగీతంలో "మల్లారి" అనబడే అంశం నాగస్వరానికే సంబంధించిన గంభీరనాట రాగంలో ప్రస్తుతించబడుతుంది.  తమిళంలో బహుప్రఖ్యాతమైన "తేవారములు" ఈరాగంలో పాడబడతాయి. ఈ రాగంలో సంగీతత్రిమూర్తుల రచనలు మనకు కనిపించకున్నా, ఊతుక్కాడు వెంకటకవి రచన 'శ్రీ విఘ్నరాజం భజే', జయచామరాజేంద్ర ఒడెయర్ కృతి 'శ్రీ జాలంధరమాశ్రయామి' మరియు మంగళంపల్లి మాధుర్యములొలికించు వర్ణం "అమ్మా ఆనందదాయిని" ప్రసిద్ధిగాంచిన గంభీరనాట రచనలు. ఈ రాగంలోని  మరికొన్ని రచనలు శరణెంబె వాణి (పురందరదాసు), జయ దేవకీకిశోర (స్వాతి తిరునాళ్), గిరిజారమణ (మైసూరు వాసుదేవాచార్) మొదలయినవి. గంభీరముగా సాగే ఈ రాగంలో స్వరాలు:  షడ్జమం, అంతరగాంధారం, శుద్ధమధ్యమం, పంచమం, కాకలి నిషాదం. ఒక గాంధారద్వయి వైవిధ్యం తప్ప, హిందూస్థాని పద్ధతిలో “జోగ్” రాగం మన గంభీరనాట కోవకు చెందుతుంది. ఇండోనీషియన్ సంగీతములోనూ గంభీరనాట ఛాయలు కనిపిస్తాయి. తిల్లాంగ్ రాగానికున్న అవరోహణలోని కైశికి నిషాదం గమనించకున్నచో ముందు చెప్పినట్లు గంబీరనాట-తిల్లాంగ్  ఒకేలా వినిపిస్తాయి.

గంభీర నాటరాగంలో ఎన్నోకీర్తనలు, మాస్టారే పాడిన పాటలూ ఉన్నా, ఈ రాగంయొక్క పరాకాష్ఠతను మాస్టారు "శ్రీ సత్యనారాయణ మహాత్మ్యము" లో శాశ్వతీకరించారు. తనకు సహజమైన ఒకటవ శృతికి అరశృతి ఎక్కువ స్ఠాయిలో అంటె C# స్తరంలో మొదలిడి తారపంచమాన్ని అధిగమించి  పైస్థాయిలోనే సాగే పాట భక్తుని మొరలను వైకుంఠపు సరిహద్దులు దాటే విధమైన సన్నివేశశుద్ధి గలది. ఈ పదాలు పాటను పరిచయంచేయవచ్చును లేక వర్ణించవచ్చునేమో కాని అనుభవమును ఇచ్చునా? గంభీరమైన ఈరాగంలో, హింసకు గురియైన భక్తుని శోకార్తవాణికి, మాస్టారు ఎలా స్వరాలను సమకూర్చారా అన్నదే విస్మయం. గంభీరనాట మూర్ఛనలో పంచమం నుండి పై-పంచమందాక (స-గ-మ-ప-ని-స గ-మ-ప) వచ్చుస్వరాలలోనే బాణికట్టి, భావానికి కట్టులు విప్పి కరుణరసావిష్కరణ గావించారు.
1.  శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం
హే మాధవా....     మధుసూదనా...   కనజాలవా...
పనిసగా గామాగా.. నిసగామగా.   నిసగమపామపా.. పమగా..గసనీ.. పమగా..నిసనిగరిస... (గ-మ-ప స్వరాలన్ని తారస్థాయిస్వరాలు)


జగన్నాయక    అభయదాయకా జాలము సేయగ రావా


మపాపాపపమ గమామామమా గామపగాసస ససగమపా


హేమురారి కరుణాకర శౌరి  నామొరలే వి నలేవా


గామపాస  నినినీనిని సనినీ నీసానీపప  మపనినిసా


నమ్మిసేవించు నన్నుశోధింప న్యాయమా నీకు  దేవా..


పానిసాగగ     గామమాగాస   సాసనీ    పామ  సానిపమగా


సాకారా  నిరాకారా ఆశ్రిత కామిత మందార -2


గామాపా నిపామాగా గామపగాసని  నిసగమపా





పాలముంచిన నీటముంచినా భారము నీదే దేవా 


మపాపాపపమ గమామామమా గామపగాసస ససగమపా


శ్రీనివాస వైకుంఠనివాస దేవానాగతి నీవే


గామపాస  నినినీనిని సనినీ నీసానీపప  మపనినిసా


జగము తరియింప కరుణ కురిపించి కావుమా దేవ దేవా..


పానిసాగగ     గామమాగాస   సాసనీ    పామ  సానిపమగా


సాకారా  నిరాకారా ఆశ్రిత కామిత మందార -2


గామాపా నిపామాగా గామపగాసని  నిసగమపా


కామిత మందార





హే మాధవా  కరుణించవా |హే మాధవా  కరుణించవా|హే మాధవా  కరుణించవా


పా నీనిసా.    పపనీనిసా..   పా నీనిసా.    పపనీనిసా.. పా నీసగా.    పపనీసగా..


హే   మాధవా.....         మధుసూదన .....    కనజాలవా


పనిసగా గామగా.....     నిసగమగమా ....   మపనిసగామపా



హే! మాధవా : శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం 

పాట చివరలో ఎలుగెత్తి పిలచి హే! మాధవా, (పై గాంధారం) మధుసూధనా... (పై మధ్యమం) కనజాలవా.. అంటూ   తారపంచమ స్వరారోహణంతో పరమాద్భుతమైన భావం సృష్టించి ఆ సన్నివేశానికి సెట్టింగులతో సాగని వన్నెల వెన్నలనే ఆవిష్కరించారు మాస్టారు.

2. లవకుశ
లవకుశ చిత్రంలో కథాప్రారంభమున వశిష్ఠ మహర్షి, శ్రీరాముని తన వంశకర్తయైన సూర్యభగవానునికి నమస్కరించమనగ, రాముడు గంభీర గమనంతో నడుస్తున్నట్టె, నేపథ్యంలో మనకు గంభీరనాటరాగం వినిపిస్తుంది. (గగస, మమగ, పపమ, నినిప, సనిపమగా అను స్వరవరుసలను ఇక్కడ వినగలరు). ఈ దృశ్యఖండిక కన్నడభాషలో విడుదలైన "లవకుశ" చిత్రానిది.


పా మా గా సని | సా... సగమపని| పామాగా సనిసా


గమపస నీ పామా గస పా మగసా


గగస మమగ పపని నినిప ససని గగస నిపమగ పామాగాసని సా....
ఇలా సాగే మధుర వీణానిస్వన స్వరపుష్పాలు కురియుచుండగా సీతాసమైతుడై శ్రీరాముడు పూర్ణాహుతిగావించి, గురువు నిర్దేశించగా భాస్కరనమస్కారమునకు నయ గంభీర లయముతో నడచుచున్న సన్నివేశాన్ని గంభీరనాటరాగంతో మాస్టారు ఎలా అలంకరించి, దైవీభావ ప్రభావ వైభవాన్ని కలిగించారో గమనించి చూసి వినండి:
సప్తాశ్వ రథమారూఢం (పాపాప పపపాపాప) ప్రచండం కశ్యపాత్మజం (మామామ మామ గమపా మగా)
శ్వేతపద్మధరం దేవం ( గామపాని నినీ నీసా) తం (సా) సూర్యం (సగమాగసా) ప్రణమామ్యహం (నిసనీ పపా)
తం (పా) సూర్యం (పనిసాసనినిపపామగా) ప్రణమామ్యహం (గమగాసస)



సప్తాశ్వ రథమారూఢం (లవకుశ-కన్నడ)
 

లవకుశ (తెలుగు) లో వాల్మికి మరియు లవకుశలు పాడే మొదటి పాట, కానడరాగ నిబద్ధమైన "జగదభిరాముడు శ్రీరాముడె". తమిళంలో లవకుశ చిత్రానికి ప్రాంతీయకారణంగా కె.వి.మహాదేవన్ స్వరకల్పనచేశారు. ఘంటసాల బాణి, పాటల్లో, నేపథ్యంలో వినబడినా తమిళంలో కొన్ని పాటలకు వేరుగ బాణీ కట్టడం జరిగింది.  మూల స్వర మాతృక సృష్టికర్తయైన ఘంటసాల మరియు తమిళ అవతరణిక సంగీతదర్శకుడైన మహాదేవన్ వీరిరువురి మధ్యన ఏ ఆసక్తికరమైన సంప్రదింపులు జరిగియుండునో మనకు తెలియదుగాని, తమి అవతరణికలో ఈ పాటను, గంభీరనాటరాగంలో సంయోజించారు. తెలుగులోని కానడరాగయుక్తమైన ఆ పాటను, మిళంలో గంభీరనాట రాగబద్ధమైన ఈ పాటనూ ఘంటసాలే పాడినా, ఏది సందర్భోచితమో చెప్పడం సహృదయులకు పెద్ద సమస్యకాదు. కానడరాగంలో రామభక్తి వెల్లడైతే, గంభీరనాటలో భక్తికన్న రామప్రశంసభావమే కనిపిస్తుంది. ఏదియేమైనా, తెలుగులో లేని గంభీరనాటరాగంలో మాస్టారు పాడిన పాట అపురూపమనే చెప్పాలి.

తమిళంలోని పాట సాహిత్యం "తిరువళర్ నాయగన్ శ్రీరామనె,  రవికుల సోమనుం జయరామనే" దీనియొక్క, అర్థమూ, చతుర్మాత్రాగతి, ఆదితాళనిబద్ధత అన్నిటికి ఆధారం అచ్చంగా మూలపు ’జగదభి రాముడు శ్రీరాముడే’ . ఘంటసాల సంయోజించిన కానడరాగానికి బదులుగా మహాదేవన్ గంభీరనాటరాగం మేళవించారు.

జయజయరామ్ (మ ప గ మ పా నీ) జయరఘురామ్ (సరి*సనిసా)
వీణాధ్వని: గమపనిపామాగ పాపమాగ పాగమాగస..
తిరువళర్ నాయగన్     శ్రీరామనె           రవికుల సోమనుం జయరామనే
ససగమ పాపప      మపమపామగా       గగమప పమగస ససనీనిస
తిరువళర్ నాయగన్ శ్రీరామనె రవికులసోమనుం జయరామనే
ససగమ పాపప      మపమపామగా..      

తందెయిన్- ఆణెయై- తలెమీల్- తాంగి    తన్నుయిర్-అన్నయయ్-అరసయ్ - నీంగి
మపపమ- పాపప- మపపమ-  నిమప   గమపని- నీసస- నిసనిప- నినిస
సతియుడ వనంసేంద్ర ధర్మావతారన్ ||తిరువళర్
పనిసగ సరి*నీని పానిసనీప మమపమగగస...


తిరువళర్ నాయగన్ శ్రీరామనె: (లవకుశ - తమిళం)
 
( * లవకుశలో మాస్టారు శుద్ధ శాస్త్రీయరాగాలనే వాడారు. పై పాటలో మహాదేవన్, గంభీరనాటరాగంలోలేని  అన్యస్వరమైన చతుశ్రుతి రిషభాన్నిరెండు చోట్ల వినియోగించారు)

ఘంటసాల గంభీరనాటరాగంలో పాడారా, ఆ రాగన్ని వాడారా అన్న విషయం  చదివిగాని వినిగాని ఎరుగను.  ఘంటసాలగారు  తమిళ భాషలో లవకుశ చిత్రానికి ఆలపించిన ఒక్కపాటను, ఘంటసాల అభిమాని, సహృదయ సంగీతరసికులైన శ్రీ ఎం.ఆర్.శ్రీనివాసమూర్తిగారు నాకు పంపగా ఆ పాట స్వర-రాగం గురించి మనసులో చిన్న అన్వేషణ ఉండిపోయింది.  ఈ వ్యాసరచనకు అది మూలం. ఆయనకు నా కృతజ్ఞాతాపూర్వక శుభాశిస్సులు.
వాల్మీకి చిత్రానికై స్వరపరచి ఘంటసాల గానంచేసిన "శ్రీరామాయణ కావ్యకథా" రాగమాలికలోని చరణం "జానకి జాడను తెలియుదు నేను" గంభీరనాట రాగమే. ఈ దృశ్య భాగాన్ని ఇక్కడ చూడగలరు. 
చిత్రం: వాల్మీకి; పాట: శ్రీ రామాయణ కావ్య కథా

జానకి జాడలు - శ్రీ రామాయణ కావ్య కథ: (వాల్మీకి)
టి.వి.రాజు స్వరకూర్పుతో దేవకన్య చిత్రానికై మాస్టారు పాడిన "ఈశా గిరీశా మహేశ" ప్రసిద్ధమైన పాట. రాగమాలికలో కూర్చిన ఈ పాటకు ఎనిమిదిరాగాలు. "మోహన, కళ్యాణి, ఆరభి, షణ్ముఖప్రియ, హంసధ్వని, హిందోళ, హంసానంది మరియు గంభీరనాట" వాడారు. ఇందులో "రామప్రతిష్టిత సైకతలింగ" అను చరణం గంభీరనాటరాగాధారితం. ఘంటసాల ఆరంభ దశలోనే ఈ రాగాన్ని వాడుకొన్నారు. మాయాబజార్ చిత్రంలోని "విన్నావ యశోదమ్మ" పాటకు గంభీరనాట ఆధారం. పెండ్యాల బాణికట్టిన, శ్రీకృష్ణతులాభారంలో భామాకృష్ణుల స్వాగతనృత్యం "కొనుమిదే కుసుమాంజలి", చిన్నారి ఓ చిలుక విన్నావ (శ్రీ వేంకటేశ్వరమాహాత్మ్యం) గంభీరనాటరాగాధారితం. శ్రీ సితారామకళ్యాణం చిత్రంలో మాస్టారు గానంజేసిన "జయ గోవింద మాధవ దామోదరా" రాగమాలికాగీతంలో పరశురామావతార వర్ణనాత్మకమైన చరణం  "ధరణీ నాథుల శిరముల గొట్టి" గంభీరనాటరాగం.

గమనిక :
శుద్ధ శాస్త్రీయ కృతులను వినకపోవడం వలన, ఈ రాగస్వరూపం మనకు పూర్తిగా అర్థంకాదు. గంభీరనాటరాగనిబద్ధమైన ఈ మూడుకృతులనూ వినండి.

"అమ్మా ఆనంద దాయిని అకార ఉకార మకార రూపిణి" - బాలమురళికృష్ణగారి వర్ణం సర్వాంగసుందరమైన సుమధుర స్వరపదసమాహారం.
రాగం: గంభీరనాట; ఆలాపన/గానం: శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 
(వర్ణం: అమ్మా! ఆనందదాయిని)

రాగం: గంభీరనాట; గానం: ప్రియా సిస్టర్స్రచన: ఊత్తుకాడు వెంకటసుబ్బయ్యర్ (శ్రీ విఘ్నరాజం భజే )

శ్రీ జయచామరాజేంద్ర ఒడెయర్ గంభీరనాటరాగంలో రచించిన అద్భుత కృతి,  శ్రీ జాలంధర మాశ్రయామ్యహం: వీణా మరియు కీబోర్డ్ లో వినిపించినది శ్రీ ఎన్.ఎమ్.కె: (శ్రీ జాలంధర మాశ్రయామ్యహం)


ఏ పాటైనా ఏ రాగమైనా ’ఆహా’ అనిపించే గమకాలను, సంగతులను సృష్టించి తన గానాన్ని శాశ్వతీకరించారు మాస్టారు. తను పుట్టింది తొంభై రెండేళ్ళ క్రితమేయైనా, ఈనాటి తొమ్మిదేళ్ళ పిల్లలు సైతం ఘంటసాల గానాన్ని మెచ్చుకొని, నేర్చుకొని, పాడుతున్నారంటే, ఘంటసాల కంఠశ్రీ ఈ శతాబ్దపు లలిత-భావ సంగితయాత్రకు ఘంటాపథం.
  
రాగశాలలో, మాస్టారి పాటల-పద్యాల వెనుకనున్న శాస్త్ర్రీయ అంశములను,  ఘంటసాల గానాన్ని, రాగాల వరసన నెమరువెసుకొనే నా అదృష్టానికి ముఖ్యకారకులు ఇద్దరు. ఒకరు కర్ణాటక సుప్రసిద్ధ విద్వాంసులు శతావధాని డా|| ఆర్.గణేశ్ గారు. ఆయన ప్రతి వ్యాసాన్ని చదివి, తమ అభిప్రాయాన్ని అందిస్తూ, ప్రోత్సాహిస్తూ, నేను  జాప్యంచేసి రాయకున్న, ఇప్పుడు ఏ రాగం గురించి రాస్తున్నారు అని అడుగుతూ ఉత్తేజపరుస్తూ ఉంటారు.  శ్రీ గణేశ్ గారు అభిమానించే ఘంటసాల జయంతి, ఈరోజు, ఆయన పుట్టిన రోజూ కావడం ఒక విశేషం. ఇక రెండవ వ్యక్తి రాగశాలకు ఆశ్రయదాత,  ఆసక్తికరంగా, అవిరామంగా ఈ బ్లాగును నడుపుతూ, నా కర్ణాటభాష-తెలుగువేషాన్ని సహిస్తూ, నాచేత వ్రాయిస్తున్న మిత్రులు సూర్యం గారు.  వీరిద్దరికీ నా నమస్సులు. మరో రాగాశ్రయంతో మళ్ళి కలుద్దాం.

8 కామెంట్‌లు:

  1. Chandra mouli garu, Very good article, The series of your articles on classical raga based film songs ,shows that how deeply you have Listened/ studied them to analyse , so interestingly for the pleasure of all music lovers In fact I have also been doing similer exercise for the last 35 years. I admire you good work. I would love to exchange more information from u. I stay in Hyderabad, My e mail id rtummar@yahoo.com, ph no 9849860639. Pl mail me your e mail id and Ph no. Regards Raja gopal

    రిప్లయితొలగించండి
  2. amara gaayakudi jayanthi rojuna maa andarikee hrudyangamamina vishayanni nishta tho, nibaddhatatho vivarincharu.

    meeku dhanyavaadalu. meeru inka inka chakkati sahitya seva cheyalanee, anduku ghantasala vaari ilavelupina sree venkateswarudu meepai karuna kataksha aseeh veekshanalu prasarinchalnee manasaaraa korukuntunna.

    namaskaram
    anjaneyulu bvsr

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ ఆంజనేలు గారు,
      మీ అభిప్రాయం, అభిరుచి, ఆశిస్సులకు నమోవాకములు.

      తొలగించండి
  3. వ్యాసం చాలా చాలా బాగుంది, చంద్రమౌళి గారికి బహు ధన్యవాదాలు. మౌళి గారి ఈ వ్యాసాల కోసం ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటాను.

    సత్యనారాయణ మహాత్మ్యం లోని పాట తిలాంగ్ అనుకునే వాడిని, ఈ పాటకి, కృష్ణ కుచేల లోని "దీనపాల నా దీక్ష బూనినా" పాటకి ఉన్న పోలికలవల్ల. (కృష్ణ కుచేల లోని పాట తిలాంగ్ అని విన్నాను). ఇప్పుడే తిలాంగ్ కి గంభీరనాట కి తేడా తెలిసింది.

    రామ ప్రసాద్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ ప్రసాద్ గారికి ధన్యవాదములు. కృష్ణకుచేల పాటలకోసం వెదుకుతున్నాను. ఆ సినిమా సి.డి.కాని, mp3 కాని దొరుకునా?

      తొలగించండి
    2. చంద్ర మౌళి గారు, నా దగ్గర ఆ చిత్రం లోని కొన్ని పాటలు ఉన్నాయి్. మీ e-mail address ఇస్తే నేను mp3 లు పంపగలను.
      రామ ప్రసాద్

      తొలగించండి
    3. శ్రీ రామ్ ప్రసాద్ గారు, నా email: cmowly@gmail.com

      తొలగించండి
  4. "ఔడవరాగాల జాబీతాలో "వలజి" రాగానికి బదులుగా "మలయమారుతమని" పడింది. మలయమారుతం షాడవరాగం.ఈ అంశాన్ని గమనించి సవరణకు తోడ్పడిన శతావధాని డా| ఆర్.గణేశ్ గారికి కృతజ్ఞతాపూర్వకమైన వందనములు"

    రిప్లయితొలగించండి

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (1) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (2) చి-పరోపకారం-1953 (2) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (3) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (3) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (1) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (2) చి-వెలుగునీదలు-1961 (1) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీ సత్యనారాయణ మహత్యం-1964 (2) చి-శ్రీ సింహాచలక్షేత్ర మహిమ-1965 (1) చి-శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (2) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (3) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (5) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (79) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (49) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (35) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (12) సం-ఓగిరాల (1) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (2) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (79) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (31) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (5) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (38) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (2) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (5) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (13) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (18) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (39) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (3) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (26) ర-బమ్మెఱ పోతన (2) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (2) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (4) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (28) ర-సదాశివ బ్రహ్మం (9) ర-సముద్రాల జూ. (20) ర-సముద్రాల సీ. (42) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1) రచన-సముద్రాల సీ. (1)