దీపావళి చిత్రానికి సంగీతం నిర్వహించింది ఘంటసాల మాస్టారు. ఈ చిత్రంలో ఒకే పాటను సందర్భానుసారంగా
రెండువిధాలుగా పాడారాయన. ఆ పాట "కరుణాచూడవయా". కారాగారంలో పాడినపుడు భక్తిరసాన్ని
వెల్లడిస్తే, అదే బాణీలో నరకుని అంతఃపురంలో పాడినపుడు "అలుకా మానవయా"
భయమూ, హాస్యమూ కలబోసి రసవత్తరంగా హిందోళ
రాగంలో వినిపించారు మనకు. "మమసా
గామమమ (కరుణాచూడవయా) అంటూ ప్రారంభమై, నరకుని కోపాన్ని తగ్గించడానికి వినోదభరితంగా
స్వరాల్ని జల్లించడం ఒక త్రిశ్రగతి నర్తనానికి తోడుగా ఉంటుంది.
దదని-మమద-గగమ-గమగ-సా అలుకా మానవయా అన్నప్పుడు ఈ స్వరాలు త్రిశ్ర గతిలో
మధ్యమకాలంలో ఉన్నాయి. సానిద నీదమగా, నీదమ దా మగసా, సా సానీదామాగా సా - అలుకా
మానవయా అన్న త్రిశ్రగతి స్వరప్రస్తారం మూడవకాలంలో నడుస్తుంది. తరువాత తీవ్రగతి
స్వరాలలో, గమదనిసా నిదనీదమగా, సగమదనీ దమదామగసా, ఇక్కడ గమదనిసా, సగమదనీ స్వరాలు
నాలుగవకాలంలో అంటే ఒక దెబ్బకు ఆరు అక్షరకాల ప్రమాణంలో ఉంటాయి.
సంగీతవైదుష్యంతో పాటు హాస్య, నాట్య, లయ వైవిధ్యాలు ఇందులో మిళితమైనాయి. హిందోళ
రాగం లో మాస్టారు ఆలపించిన, బాణీ కట్టిన పాటలు, రాగం తాలూకు వివరాలు ఇదివరలో మొదటిభాగం మరియు రెండవ భాగం లో శ్రీ చంద్ర మౌళి గారు రాగశాల లో ప్రస్తావించారు. ఇక్కడ ఆ
పాటల సాహిత్యాన్ని దీపావళి పండగ సందర్భంగా మరల గుర్తుచేసుకుందాం. విని ఆనందించండి.
అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
చిత్రం: | దీపావళి (1960) | ||||
రచన: | సముద్రాల రాఘవాచార్య | ||||
గానం: | ఘంటసాల: | ||||
సంగీతం: | ఘంటసాల: | ||||
ఘంటసాల: | కరుణాజూడవయా పరమూ జూపవయా | కరుణాజూడవయా పరమూ జూపవయా | |||
మురళీ మోహన వినీల మేఘశ్యామా! | మురళీ మోహన వినీల మేఘశ్యామా! | ||||
కరుణా.. | |||||
ఘంటసాల: | మనసూ నీపైన మరలిన చాలుగా.. | ఆ..ఆ..ఆ.. | |||
మనసూ నీపైన మరలిన చాలుగా.. | అలుకా మానవయా! జాలీ బూనవయా! | ||||
పులులే జింకలయి లెంకలుగా మారుగా | నరకాధీశ్వరా! త్రిలోక జీవపాలా! | ||||
పులులే జింకలయి లెంకలుగా మారుగా | అలుకా మానవయా! | ||||
నిరుపమ లీలా నిలయా దయామయా | |||||
కరుణాజూడవయా పరమూ జూపవయా | మృతికి భీతిలని భుజబల సారమూ.. | ||||
మురళీ మోహన వినీల మేఘశ్యామా! | మృతికి భీతిలని భుజబల సారమూ.. | ||||
అదితీ కుండలముల దోచుకొనే బీరము | |||||
ఘంటసాల: | మదిలో నీ స్మరణే సలిపిన హాయిగా.. | కలిగెను నీకీ జగతీ భళా భళీ | |||
మదిలో నీ స్మరణే సలిపిన హాయిగా.. | అలుకా మానవయా! జాలీ బూనవయా! | ||||
బ్రతుకే తీయనై వెన్నెలయై కాయుగా.. | నరకాధీశ్వరా! త్రిలోక జీవపాలా! | ||||
బ్రతుకే తీయనై వెన్నెలయై కాయుగా.. | అలుకా మానవయా! | ||||
త్రిభువన పావన చరణా సనాతనా.. | దదని మమద గగమగమగసా | ||||
అలుకా మానవయా! | |||||
ఘంటసాల: | రాధే గోవింద కృష్ణ! రాధే గోపాల కృష్ణ! | సానిద నీదమగ, నీదమ సామగస | |||
రాధే గోవింద కృష్ణ! రాధే గోపాల కృష్ణ! | సా సానీదామాగాస అలుకా మానవయా! | ||||
ఘంటసాల: | కన్నులకు విందుగా కనిపించవయ్య కృష్ణ | గమదనిసా నిద నీదమగ | |||
కన్నులకు విందుగా కనిపించవయ్య కృష్ణ | సగమదనీ దమ దామగస | ||||
రాధే గోవింద కృష్ణ! రాధే గోపాల కృష్ణ! | గమదనిస గమదనిస గమదనిస సనిదపమగస | ||||
ఘంటసాల: | రాధే.. బృందం: గోవింద కృష్ణ! | అలుకా మానవయా! ఆ..ఆ..ఆ.. | |||
ఘంటసాల: | రాధే.. బృందం: గోవింద కృష్ణ! | ఆ..ఆ..ఆ..ఆ..ఆ… | |||
ఘంటసాల: | రాధే.. బృందం: గోవింద కృష్ణ! | అలుకా మానవయా! | |||
ఘంటసాల: | రాధే.. బృందం: గోవింద కృష్ణ! | నినిసస దదనిని మమద | |||
ఘంటసాల: | రాధే.. బృందం: గోవింద కృష్ణ! | దదనిని మమదద గగమ | |||
ఘంటసాల: | రాధే.. బృందం: గోవింద కృష్ణ! | దదమదని సానిదపమాగాసా | |||
ఘంటసాల: | రాధే.. బృందం: గోవింద కృష్ణ! | తతోం తకదిమి తతోం తకదిమి తతోం తతా | |||
Thanks to Chandra Mowly garu for the analysis of the song, Sakhiyaa.com for the poster and DivyaMedia for the video clips.
Dear Suryanarayana garu,
రిప్లయితొలగించండిFirst wish u a Happy Deepavali. Thanks for posting a relevant song for this festival. The lyric, music and singing all are excellent.