28, జూన్ 2012, గురువారం

ఘంటసాల గానం చేసిన శ్రీ రామాయణ కావ్య కథ - వాల్మీకి చిత్రం నుండి

1963 లో జూపిటర్ సంస్థ శ్రీ సి.ఎస్.రావు దర్శకత్వం లో నిర్మించిన చిత్రం "వాల్మీకి". ఇందులో శ్రీ ఎన్‌.టి.ఆర్. టైటిల్ పాత్ర పోషించారు. ఇతర నటులు కె.రఘురామయ్య, రాజసులోచన, రాజనాల గార్లు. ఘంటసాల మాస్టారు వాల్మీకి చిత్రానికి చాల పాటలు, శ్లోకాలు గానం చేశారు. ఈ చిత్రంలో ఎక్కువగా విన్న పాట "అనురాగమిలా కొనసాగవలే" ఘంటసాల, సుశీల పాడిన యుగళగీతం. ఈ చిత్రం కోసం మొత్తం రామాయణాన్ని చక్కని పాటగా వ్రాసిన వారు శ్రీ సముద్రాల రాఘవాచార్యులు గారు. ఈ చిత్రం కన్న ముందు వచ్చిన భూకైలాస్ (1958) లోని "రాముని అవతారం రవికుల సోముని అవతారం" కూడ శ్రీ సముద్రాల గారే వ్రాసారు. అయితే ఈ చిత్రంలో మరికొన్ని అదనపు చరణాలతో, వివరాలతో వ్రాసారు.  సంగీతం ఘంటసాల గారేనని  వింటే తెలిసిపోతుంది. ఈ చిత్రానికి దర్శకులు సి.ఎస్.రావు, నిర్మాత హబీబుల్లా. 
  
                             చిత్రం:     వాల్మీకి (1963)
                             కలం:      సముద్రాల రాఘవాచార్య 
                             స్వరం:    ఘంటసాల 
                             గానం:     ఘంటసాల


పల్లవి: శ్రీ రామాయణ కావ్య కథ, జీవన తారక మంత్ర సుధా..
శ్రీ రామాయణ కావ్య కథ
చరణం: తపసూ, ధర్మము వీడని వాడు తనయులులేని దశరథుడు 
తనయుల కోరి చేసెను యాగము, దైవమొసంగెను పాయసము
శ్రీ రామాయణ కావ్య కథ
చరణం: కౌసల్య, కైకేయి, సుమిత్ర యాగఫలముగ బడసిరి కొమరుల
రామ, భరత, లక్ష్మణ, శతృఘ్నుల (2), రఘుకుల తిలకుల వీరులా
శ్రీ రామాయణ కావ్య కథ
చరణం: యాగము కావగ రాము బంపుమని దశరథునడిగెను కౌశికుడు
తండ్రి సెలవుగొని, తమ్ముని తోగొని రాఘవుడాతని వెంట జనే
శ్రీ రామాయణ కావ్య కథ
చరణం: నారినెదురుకొను తాటక ద్రుంచి, మారీచ-సుబాహుల మదమడచి
చతుర్ధాటి శ్రీ రఘురాముడు ముని రాజుల దీవనలందుకుని 
శ్రీ రామాయణ కావ్య కథ
చరణం: రాతి బొమ్మయై రామరామయని వగచు అహల్యకు శాపము బాపి 
మిథిలకేగి హరు చాపము విఱచి (2), జానకినేలెను రఘునాయకుడు
శ్రీ రామాయణ కావ్య కథ
చరణం: సీతాపతి ధరణీపతి జేయగ జతనము జేసెను మహరాజు
రాముని వనులకు పంపి భరతుని ప్రభుని చేయుమనె కైకేయి 
సీతా, లక్ష్మణయుతుడై రాముడు విడచినాడు సాకేత పురి 
పుత్ర శోకమును సైపని భూపతి మూర్ఛిలి జేరెను అమరపురి 
రాముని దేవుని వలె పూజించి గుహుడు గంగను దాటించె 
చిత్రకూటమున పర్ణశాలలో చెలువతో రాముడు నివసించె 
భరతుడు రాముని పదముల వ్రాలి పురికి రమ్మని ప్రార్థించె 
ఆడితప్పనని తనకు బదులుగా పాదుకలొసగి పంపించే..
శ్రీ రామాయణ కావ్య కథ జీవన తారక మంత్రసుధ 
శ్రీ రామాయణ కావ్య కథ
చరణం: రఘురామునిగని శూర్పణఖ బిగి కౌగిలినిమ్మని డాసె 
కత్తి దూసి లక్ష్మణుడా రక్కసి ముక్కూ, చెవులను గోసే
హుంకరించి లంకాపతి పంపెను మారీచుని బంగారు లేడిగా
దాశరథీ వెన్నాడెను లేడిని ధరణిజ తెమ్మని వేడగా
హా! లక్ష్మణా! హా లక్ష్మణయను అన్న పిలుపువిని 
అరిగెను తోడుగ లక్ష్మణుడు 
బిచ్చమడిగి ముని ముచ్చు విధాన మృచ్ఛిలే సీతను రావణుడు 
అడ్డగించి ఎదురించి జటాయువు రెక్కలూడి భువి పడిపోయే
లంకాపురిలో అశోకవనిలో సీతమ్మకు తీరని చెఱలాయే..
శ్రీ రామాయణ కావ్య కథ జీవన తారక మంత్రసుధ 
శ్రీ రామాయణ కావ్య కథ
చరణం: జానకి జాడలు తీయుదు నేను, వాలి జంపుమనె రవిసుతుడు
కిష్కింధకు నిను రాజుసేతునని బాసలు చేసెను రవికులుడు 
సమబలులై సుగ్రీవుడు, వాలియు సమరము జేసిరి కవ్వించి 
తరువు చాటున నిలచి రాముడు సరగున వాలిని వధియించె 
రఘుకుల తిలకుడు వానర సీమకు రవిసుతు రాజును జేసే
జానకి ఉనికిని కనుగొని రమ్మని హనుమను పయనము జేసే
సంబరమేసి అంబరవీధి..ఈ.. ఆ..ఆ..
సంబరమేసి అంబరవీధి అంబుధి దాటెను హనుమా..
శ్రీ రామాయణ కావ్య కథ జీవన తారక మంత్రసుధ 
శ్రీ రామాయణ కావ్య కథ
చరణం: తారక మంత్రము మనసున మరువని భూమిజ కాంచెను పావని 
రాముని ముద్రిక అమ్మకు నొసగి చూడామణి తన చేతగొని 
పావని ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రమునకు తలవంచె, బంధించి తండ్రి ముందుంచె
నీతి మాలిన రాజు దూత వాలమును కాల్పించె 
లంకనే కాలిచి ఎగిరి, రామచంద్రుని ముందు వ్రాలెను హనుమ 
కదనానికి కపులగోరి కదలినాడు దాశరథి 
కడలి వడకి ఎడమునీయ కట్టించెను వారధి 
అన్నా! యిక సీత విడువుమన్నాడు విభీషణుడు 
కన్నులురిమి అతని తలను తన్నినాడు రావణుడు 
రామచంద్రు చరణములే శరణమనె విభీషణుడు 
చేరదీసి లంకాపురి విభుని చేసె రఘువరుడు 
శ్రీ రామాయణ కావ్య కథ జీవన తారక మంత్రసుధ 
శ్రీ రామాయణ కావ్య కథ
చరణం: రావణ రాఘవ సమరములోన చావడు రావణుడెంతటికైనా
జీవ రహస్యము నెరిగిన రాముడు శరమును వదలెను రోషాన
కడుపులో సుధా కలశము పగిలి పడియెను రావణుడిలపైన 
అతి పునీత యీ అవనీజాత అని దీవించెను హుతవరుడు 
సురలును, నరులును, సన్నుతిసేయ పురమును జేరే రఘూద్వహుడు 
సతీ సహోదరయుతుడై చల్లగ రాజ్యము చేసెను రఘువరుడు 
శ్రీ రామాయణ కావ్య కథ జీవన తారక మంత్రసుధ 
శ్రీ రామాయణ కావ్య కథ

కృతజ్ఞతలు: యూ ట్యూబ్ వీడియో పొందు పరచిన బొల్లాప్రగడ సోమేశ్వరరావు గారికి, చిత్రం సాంకేతిక వివరాలు అందించిన ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి బ్లాగు కొల్లూరి భాస్కర్ గారికి, వికిపీడియా వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.
*You can download this page as PDF file by clicking on the "Print Friendly" button below.

3 కామెంట్‌లు:

  1. Dear Suryam gAru,
    Thanks for posting this great song and thanks to your focused efforts in capturing the lyrics. My understanding and appreciation enhanced as I listened and read the lyrics.

    Would you please consider the following suggestions ?

    1. As this composition has many rAgas, it would be valuable, if this could be annexed with rAgashAla, identifying all the rAgas possible.
    2. Would also you please consider posting a PDF file of lyrics in your blog, so that it can be downloaded and referred by the users, when required ?

    I suppose, there is a typo in the last charaNam.
    I hear ... kaDupulO sudhA kalashamu and perhaps not .. kaDupulO gala kalashamu .. as written.
    Kindly check.
    Thanks again,
    Best Regards,
    Sreenivasa

    రిప్లయితొలగించండి
  2. Dear Srinivasa murthy garu, Thanks for the comments. I made that correction. We will try to get the details of ragas.
    There is an inbuilt PDF creator already in the blog. At the bottom of the page you will find a green button named "Print Friendly". If you click that it will generate a PDF version. You can get it by following the instruction. Hope this helps.
    Regards
    Suryam

    రిప్లయితొలగించండి
  3. Thank you Suryam gAru, appreciate your prompt response.
    Got the PDF version !

    Regards,
    Sreenivasa

    రిప్లయితొలగించండి

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (2) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కథానాయిక మొల్ల-1970 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్నతల్లి-1972 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (3) చి-పరోపకారం-1953 (3) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-ప్రేమలు పెళ్ళిళ్ళు-1974 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (4) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (4) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (2) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (4) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (2) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కధ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీదేవి-1970 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964 (6) చి-శ్రీసింహాచలక్షేత్రమహిమ-1965 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (3) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (4) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (6) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (87) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (55) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (36) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.ఎస్.విశ్వనాథన్ (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (13) సం-ఓగిరాల (2) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (3) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (85) సం-జి.కె.వెంకటేష్ (1) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (33) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (6) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (40) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (1) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (4) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (4) సం-విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్ (3) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (15) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (20) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (41) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొనకళ్ళ (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-డా. సినారె (1) ర-డా.సినారె (2) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (4) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (27) ర-బమ్మెఱ పోతన (2) ర-బలిజేపల్లి (1) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భక్త నరసింహ మెహతా (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (3) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (5) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (29) ర-సదాశివ బ్రహ్మం (8) ర-సదాశివబ్రహ్మం (1) ర-సముద్రాల జూ. (25) ర-సముద్రాల సీ. (44) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1)