Welcome to the GHANTASALA blog!
తెలుగువారి గళవేల్పు శ్రీ
ఘంటసాల మాస్టారు. వారి గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావ ప్రకటన అసాధారణం, భాష
అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్వితచర్వణం, వెరసి మధురాతిమధురం మరియు ఆపాత
మధురం. ఆ మహానుభావునిపై 2011 ఆగస్టు 31న ఈ ఘంటసాల బ్లాగును ప్రారంభించాను. మాస్టారు పాడిన పాటల, పద్యాల సాహిత్యము, శ్రవణ,
దృశ్యఖండికలను స్థాపించడం ఈ బ్లాగు ఉద్దేశ్యము. ముందస్తుగా అరుదుగా వినిపించే ఆణిముత్యాలను
సేకరించి, తత్సంబంధమైన విషయాలను క్రోడీకరించి, ఆ పాట లేదా పద్యానికి ఎటువంటి సాంకేతికనిపుణులు
శ్రమించి ఫలింపజేసారో వారి వివరాలను వీలైనంత సమీకరించి ఒక చోట చేర్చడం అనేది నా లక్ష్యం.
అపుడపుడు నాకు తోచినంతలో నా వివరణలను, విశ్లేషణలను జోడిస్తున్నాను. తప్పులుంటే నాకు
తప్పక మీ కామెంట్ల రూపంలో తెలుపగలరు. ఈ బ్లాగులో ఒక ఉప శీర్షిక గా “ఘంటసాల రాగశాల”
అనే దానిని ఏర్పరచాను. అందులో మిత్రులు, బెంగళూరు వాస్తవ్యులు, సంగీతజ్ఞులు శ్రీయుతులు
ఎం. ఆర్. చంద్రమౌళి గారు కొన్ని రాగాలను విశ్లేషించి ఆయా రాగాలలోని మాస్టారి పాటలు,
పద్యాలు వాటి స్వరవిన్యాసాల గుఱించి వివరంగా వ్రాసారు. ఇటీవలనే “ఘంటసాల గానపద సూచిక”
అను విషయసూచికను ఒక అనుబంధ బ్లాగుగా ఏర్పరచి, మాస్టారి అభిమానులు సులభంగా ఘంటసాల స్వీయ
సంగీత దర్శకత్వంలోను, ఇతర సంగీత దర్శకుల నిర్వహణలో పాడిన ఏకగళ, యుగళ, బృంద గీతాలు,
పద్యాలు, చలనచిత్రేతర గీతాలు (ప్రైవేట్ సాంగ్స్), హరికథలు, బుఱ్ఱకథలు మొదలయినవి వెదుక్కోవడానికి
అనువుగా కొంత ఏర్పాటుచేసాను. ఈ బ్లాగు ఘంటసాల అభిమానులందరిది. మీ అందరి సహాయ, సహకారాలకు,
సూచనలకు, సలహాలకు ఆహ్వానం.
భవదీయుడు
డా. సూర్యనారాయణ వులిమిరి,
ఉత్తర కరోలినా, అమెరికా.
Please scroll down the page to see links given for Ghantasala's works organized by DIRECT FILMS, DUBBING FILMS, by MUSIC DIRECTORS, by LYRICISTS, by the DUETS, SOLOS. On the right side you will find links to RAGA SALA about a few ragas and other information.