1958 లో పొన్నలూరి బ్రదర్స్ సంస్థ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో అంజలి, ఎన్.టి. రామారావు నాయికానాయికలుగా నిర్మించిన చిత్రం "శోభ". ఈ చిత్రానికి సంగీత దర్శకులు అలనాటి మేటి నేపథ్య గాయకులు ఎ.ఎం. రాజా. ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు రెండు మూడు పద్యాలు పాడారు. వీటిని ప్రముఖ హాస్యనటులు రేలంగిపై చిత్రీకరించారు.
ఇందులో మొదటి పద్యం "శశాంక విజయం" (తారా శశాంకం) నుండి గ్రహించబడింది. ఇందులో చంద్రుడు తారను వర్ణించే పద్యమిది.
| కొమ్మగాదిది బంగారు బొమ్మగాని | ||
| ఇంతిగాదిది జాజిపూబంతిగాని | ||
| కలికిగాదిది మరుని పూమొలికిగాని | ||
| భామకాదిది లావణ్యసీమగాని |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి