తుళువ వంశీయుడు అయినప్పటికీ, తెలుగు భాషకు ఎనలేని సేవచేసి "భువన విజయము" అనబడే తన ఆస్థానములో అష్టదిగ్గజాలను నెలకొల్పి తెలుగు కవితను, కావ్య రచనను ప్రోత్సహించిన కవి, సాహితీ సమరాంగణ సార్వ భౌముడు అయిన శ్రీకృష్ణదేవరాయలు మన కందరికీ చిరస్మరణీయుడు. ఆంధ్ర-కర్ణాటక ప్రజల సమన్వయానికి కృషి చేసిన ఈతనిని "ఆంధ్ర భోజుడు" మరియు "కన్నడ రాజ్య రమారమణ" అని పేర్కొంటారు. తెలుగులో "ఆముక్త మాల్యద" లేదా విష్ణుచిత్తీయము (గోదా దేవి కథ) అనే ప్రబంధాన్ని రచించాడు. ఏ దేశంలో వుంటే అక్కడి భాష, సంస్కృతి నేర్చుకోవడం, ఉపయోగించడం అవసరం. ఆ భావాన్ని తెలిపే "తెలుగదేల యన్న దేశంబు తెలుగు", అనే ఈ పద్యం కృష్ణదేవరాయ విరచితమైన ఆముక్తమాల్యద లోనిది. పౌరాణిక, జానపద, చారిత్రక ప్రాముఖ్యత గల పాత్రలకు శ్రీ రామారావు గారిని తప్ప మరొకరిని ఊహించుకోలేము. ఈ చిత్రంలో రాయలే తప్ప రామారావు కనిపించడు. రాయల గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ పోస్టులో చూడండి.
పద్యం: | తెలుగదేలయన్న దేశంబు తెలుగు యేను | |
తెలుగు వల్లభుండ తెలుగొకండ | ||
ఎల్ల నృపులు గొలువ ఎఱుగవే బాసాడి | ||
దేశ భాషలందు తెలుగు లెస్స ఆ..ఆ.. |
suryanarayana garu
రిప్లయితొలగించండిmee blog posts anni nenu chustunnanu vintunnanu
oka ghantasala abhimaniga meeru ichche ee patalu
chala aruduga vinapadevi. avi andistunnanduku dhanyavadamulu.
a small request if audio of seethakalyanam harikatha from the movie Vagdanam kindly post it with lyric i will be very much thankful to you
keep your good service to G fans up
Radhakrishna
Visakhapatnam Ap India.
రాధాకృష్ణగారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట సాహిత్యంతో త్వరలో పోస్టు చేస్తాను.
తొలగించండిGood poem clearly pronounced keeping every aspect in full control.None can sing like him
తొలగించండిరాధారావు గారు ధన్యవాదాలు. మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. మాస్టారి ఉచ్చారణ తేటతెల్లంగా వుంటుంది.
తొలగించండిGreat work, keep it up
రిప్లయితొలగించండిNtr పద్యానికి పెదవి అందించినాడే కానీ ఆ పద్య రచన కర్త కాదు స్వరము కూర్చి అలాపన చేసిన గాయకుడు కాదు శ్రీ కృష్ణ దేవరాయులు రచించిన అముక్తమాల్యద గ్రంథము లోనిది ఘంటసాల గారి స్వరమునుండి రూప కల్పన చెందినది వారిని మరువరాదు
రిప్లయితొలగించండి