శ్రీకృష్ణ పాండవీయం (1966) చిత్రంలో ఘంటసాల మాస్టారు రెండు పాటలు, కొన్ని పద్యాలు పాడారు. ఇదివరకు పోస్టులో మరొక మధుర గీతం "మత్తు వదలరా నిద్దుర" మరియు "వచ్చెద విదర్భ" అనే పద్యం ఇదివరలో పోస్టు చేసాను. ఘంటసాల గారు కృష్ణుని పై పాడిన శృంగార యుగళ గీతాలలో మరొక చక్కని పాట "ప్రియురాల సిగ్గేలనే". ఈ పాట కృష్ణుడు (ఎన్.టి.ఆర్.) రుక్మిణి (కె.ఆర్.విజయ) లపై చిత్రీకరించారు. బహుశ శ్రీమతి కె.ఆర్.విజయకు ఇది తొలి తెలుగు చిత్రం అనుకుంటాను. ఈ చిత్రంలో రుక్మిణి సోదరుడు రుక్మి గా శ్రీ కైకాల సత్యనారాయణ గారు నటించారు. శ్రీ సముద్రాల రాఘవాచార్యుల రచన.ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించినది శ్రీ టి.వి.రాజు (తోటకూర వెంకట రాజు) గారు. ఈయన చాల పౌరాణిక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. వీరి కుమారుడు రాజ్-కోటి జంటలోని రాజ్ (తోటకూర సోమరాజు). ఈ చిత్రం రామారావు గారి స్వీయ దర్శకత్వ చిత్రం, నిర్మాత వారి సోదరుడు శ్రీ త్రివిక్రమరావు గారు.
గానం : ఘంటసాల, పి.సుశీల
సంగీతం: టి.వి.రాజు
రచన: సముద్రాల రాఘవాచార్య
రచన: సముద్రాల రాఘవాచార్య
పల్లవి: | ఘంటసాల: | ప్రియురాల సిగ్గేలనే? .. ఏ.. ఏ.. | |
ప్రియురాల సిగ్గేలనే? నీ మనసేలు మగవాని జేరి | |||
ప్రియురాల సిగ్గేలనే? | |||
సుశీల: | నాలోన ఊహించినా..ఆ..ఆ.. నాలోన ఊహించినా | ||
కలలీనాడు ఫలియించె స్వామీ.. ఈ..ఈ.. | |||
నాలోన ఊహించినా | |||
చరణం: | ఘంటసాల: | ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేరిపినావు | | ఏమీ ఎరుగని | |
మనసుదీర పలుకరించి మా ముద్దు ముచ్చట చెల్లించవే | |||
ప్రియురాల సిగ్గేలనే? ..ఏ.. ఏ.. ప్రియురాల సిగ్గేలనే? | |||
చరణం: | సుశీల: | ప్రేమలు తెలిసిన దేవుడవని విని నా మదిలోనా కొలిచితిని | | ప్రేమలు తెలిసిన | |
స్వామివి నీవని తలచి నీకే, బ్రతుకు కానుక చేసితిని | |||
నాలోన ఊహించినా..ఆ..ఆ.. నాలోన ఊహించినా | |||
కలలీనాడు ఫలియించె స్వామీ.. ఈ..ఈ.. | |||
నాలోన ఊహించినా | |||
చరణం: | ఘంటసాల: | సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవే ఓ! భామా | | సమయానికి | |
ఇపుడేమన్నా ఒప్పునులే ఇక ఎవరేమన్నా తప్పదులే | |||
ప్రియురాల సిగ్గేలనే? .. ఏ.. ఏ.. | |||
ప్రియురాల సిగ్గేలనే? నీ మనసేలు మగవాని జేరి | |||
ప్రియురాల సిగ్గేలనే? |
ఓహో చాలా చక్కటి పాట నాకిష్టమైన పాట
రిప్లయితొలగించండిపోస్ట్ చేసినందుకు ధన్యవాదాలండి
శ్రీను గారు, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఓ అద్భుతమయిన అన్నగారి పాటను పోస్ట్ చేసినందుకు థాంక్స్ అండి!
రిప్లయితొలగించండిహరి గారు, సంతోషం.
రిప్లయితొలగించండి