మాస్టారికి జన్మదిన శుభాకాంక్షలు.
ఈ రోజు సినీ సంగీత ప్రియులకు పర్వ దినం. ఆబాల గోపాలాన్ని తన కంచు కంఠంతో ఊగిసలాడించి, ఉర్రూతలూగించి, ఊయలలూపిన గాన గంధర్వుడు, గాయకులలో 'న భూతో న భవిష్యతి' గా వాసికెక్కిన మన గళవేల్పు ఘంటసాల మాస్టారి 90 వ పుట్టినరోజిది. ఏ అమరలోకంలో వారీ వేళ సురలకు స్వరలహరుల కచేరీ ఇస్తున్నారో ప్రస్తుతం. త్రిస్థాయిలలో పాడటమే కాక, అద్భుతమైన బాణీలు కట్టి, తెలుగు పద్యాలకు తన శైలిలో, తన ప్రతిభతో క్రొత్త వరవడిని దిద్ది పద్యమంటే ఇలా పాడాలని సూత్రీకరించిన మహా మేధావి, అయినా నిగర్వి మన మాస్టారు. ఇదివరకు వ్రాసిన పోస్టులలో మలయ మారుతం, దేశ్, పంతువరాళి రాగాలలో మాస్టారు గానం చేసిన పాటల గురించి తెలుసుకున్నాం. ఈ సారి మరొక క్రొత్త రాగం హిందోళం గురించి తెలుసుకుందాం. ఈ పోస్టులో మొదటి భాగంగా రెండు చిత్రాల నుండి (సతీ అనసూయ, లవకుశ) ఎక్కువ వివరాలతో వ్రాయడం జరిగింది. త్వరలో రెండవ భాగంలో హిందోళం లో స్వల్ప వివరణ తో ఎక్కువ పాటలు క్రోడీకరిస్తాము. ముందుగా మొదటి భాగం లో హిందోళ రాగాన్ని ఆస్వాదించడానికి ప్రియ మిత్రులు చంద్రమౌళి గారి ఘంటసాల-రాగశాల లోకి అడుగిడదామా?
అందాలు చిందించే హిందోళం సర్వ కోమలస్వరాల తీయని రాగం. కొన్ని రాగాలు ఏ కారణంగా
మనసుకు హత్తుకుపోతాయో చెప్పడం కష్టం. అందులోనూ,
తన ఉత్పత్తికి కారణమైన జనకరాగం కంటే అతి ప్రసిద్ధి గాంచిన జన్యరాగాల మాటకొస్తే, హిందోళం,
మోహన, మధ్యమావతి, వలజి, అమృతవర్షిణి వంటి రాగాలు, తమ తండ్రుల తలలనెక్కి కూర్చొని తారసిల్లుతాయి.
మన సంగీత శాస్త్రం చెప్పే 12 స్వరాలలో
ఐదే స్వరాల నాద స్వర సంధాన సంసారంలో ఆనంద సాగరాలని సృష్టించే శక్తి ఈ ఔడవ రాగాలది. హిందోళ రాగంలో స-గ-మ-ద-ని స్వరముల మధ్యనున్న దూరం ఎక్కువగా వుండడమే
ఆ రాగరంజకత్వానికి కారణమా? ఖచ్చితంగా చెప్పలేము.
ప్రత్యేకించి, హిందోళరాగం ఒలికించే గంభీర భావాన్ని శ్రీరాముని నడకలో కన్న త్యాగయ్య
ఒక్క సామజవరగమనా కృతిలో ఆ రాగాన్ని పోతపోశారా అనిపిస్తుంది.
హిందోళ రాగ లక్షణం
హిందోళరాగం, అన్ని సంగీత ప్రకారాలలోనూ బహు ఖ్యాతివంతమైన ఔడవ సమరూప రాగం (symmetrical
pentatonic). హనుమత్తోడి మేళకర్త జన్యమైన
(నటభైరవి జన్యమనియూ వాదన కలదు) ఈ రాగం యొక్క మూర్చన: షడ్జమం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కైశికి నిషాదం (సగ2మ1ద1ని2). "గ ద ని" స్వరాలు కంపితాలు. మధ్యమ స్వరం కంపితం కాదు. స-మ, గ-ద, మ-ని, మ-స అనే జీవస్వరాలే సంవాదులు. రక్తి రాగమై, జనరంజకమై త్రిస్థాయిలో పాడుకోదగిన కరుణ, భక్తి, శృంగార రసాలకు ప్రసిద్ధిగాంచిన రాగమిది. హిందూస్తానీ శాస్త్రీయ సంప్రదాయంలో మాల్కోన్స్ అనబడే ఈ రాగాన్ని కచేరీల్లో అర్ధరాత్రి దాటాక వినిపించినా, కర్ణాటక పద్ధతిలో ఈ రాగం సర్వకాలానుసరణీయం. గ్రహభేదం చేసినటులయితే పుట్టే ఇతర రాగములు: మోహన, శుద్ధసావేరి, ఉదయరవిచంద్రిక (శుద్ధ ధన్యాసి) మరియు మధ్యమావతి (అన్నీ ఘంటసాల ప్రియరాగాలే). అతి ప్రసిద్ధమైన హిందోళ రాగంలో పలువురు ప్రముఖ వాగ్గేయకారులు చక్కని రచనలు చేసారు. ఉదాహరణకు - సామజవరగమనా, మనసులోని మర్మము (త్యాగరాజు). సామజవర గమనా కృతిని మాస్టారు కలకత్తాలో ఇచ్చిన కచేరీలో పాడారు. "మనసులోని మర్మము" కీర్తనను చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళై పరంపరలో కొందరు శుద్ధ ధైవతానికి (ధ1) బదులుగా చతుశ్రుతి ధైవతంతో (ధ2) పాడినా అది రక్తి కట్టలేదు. ఈ రాగంలో మరికొన్ని రచనలు: గోవర్ధన గిరీశం (ముత్తుస్వామి దీక్షితార్), భజరే గోపాలం (సదాశివ బ్రహ్మేంద్ర), పద్మనాభ పాహి (స్వాతి తిరునాళ్), దేవదేవం భజే మరియు కొండలలో నెలకొన్న (అన్నమయ్య), మామవతు శ్రీ సరస్వతి (మైసూర్ వాసుదేవాచార్) మరియు సామగానలోలే (జి.ఎన్.బి.), చింతయామి జగదంబాం (జయచామరాజేంద్ర ఒడెయర్) మొదలైనవి.
హిందోళరాగ వైభవం
చలనచిత్ర సంగీత దర్శకత్వంలో ప్రముఖమైన అంశం, కథాంశ భావసంస్ఫురణం, ఆయా సన్నివేశాలకు తగినట్లుగా, ఏ రాగాన్ని, ఏ స్థాయిలో, ఎలా వాడితే ఎక్కువ జనాదరణ పొందగలదు, అనే అవగాహనతో శాస్త్రీయ రాగాలను యధాతథంగా ప్రయోగించక, స్వరకర్తలు సూక్త బాణీలతోనో, స్వర ఖండికలతోనో ప్రయోగాలు చేస్తారు. ఘంటసాల తన శాస్త్రీయ సంగీత నైపుణ్యంతో, భావ నటన కళాభిజ్ఞతతో శాస్త్రీయ రాగాల మూల సౌందర్యాన్ని నిలుపుకుని, కొంగ్రొత్త ప్రయోగాలతో కొన్ని ఉనికిలోవున్న రాగాలకు మరింత వన్నె తెచ్చారు. ఆయన అంతిమ గానార్పణ అయిన "భగవద్గీత" లో సుమారు 50 రాగాలనుపయోగించారు. ఆయన చలన చిత్ర గానంలో వాడిన ఎన్నో రాగాలను భగవద్గీతలో వాడలేదు. తన స్వీయ దర్సకత్వంలో బాణీలు కూర్చిన చిత్రాలలో ప్రతి చిత్రం లోను 10 నుండి 20 వరకు రాగాలకు అధికంగా నాద వైవిధ్యమున్నది. అందులో ఎన్నో చిత్రాలలో తరచుగా వాడిన కొన్ని ప్రముఖ రాగాలలో పేర్కొనదగినది హిందోళ రాగం. ఆయన ప్రతిభాకుంచం లో స్వరాల తెరపై చిత్రించిన హిందోళ రాగ వైవిధ్యాన్ని, వైభవాన్ని జ్ఞప్తి చేసుకుంటూ, రసికులతో ఆ ఆనందాన్ని పంచుకోవడమే ప్రస్తుత ప్రయత్నం. హిందోళ రాగాధారితమైన ఘంటసాల స్వరకల్పనలు, గీతాలు, పద్యాలు, శ్లోకాలు, నేపథ్య గానాలు మరియు ఆలాపనలు ఎన్నో వున్నా, అన్నిటినీ ఇక్కడ చెప్పుకోలేము. ముఖ్యంగా కొన్నిటిని పరిశీలిస్తూ, ఆ రాగ సత్వాన్ని ఆయన భక్తీ పాటలలో, ప్రేమగీతాలలో, పద్య గాయనంలో ఎలా వివిధ రసాలను ఆవిష్కరింప జేసారో గమనించడం ఆసక్తికరమైన సంగతి. మరిన్ని విశేషాలు తరువాతి భాగంలో చూద్దురుగాని.
స్తుతి వెల్లివిరియ - సతీ అనసూయ లోని గానం
ప్రఖ్యాత సంగీతదర్శకుల స్వరసారథ్యంలోఎన్నోమంచిపాటలను వినిపించిన మాస్టారు తమ స్వీయ సంగీత దర్శకత్వంలో "సతీ అనసూయ" (1957) వంటి సామాన్యమైన చిత్రానికి కూడ అసామాన్యమైన, శాస్త్రీయతను పుణికిపుచ్చుకొన్న "శ్రిత కమలాకుచ మండలా" అను ఒక జయదేవ అష్టపదిని అత్యద్భుతంగా గానం చేశారు. ఏ కథానాయకునికీ దక్కని ఈ నేపథ్య గానావకాశాన్ని పొందిన భాగ్యశాలి, నారద పాత్రధారి పద్మనాభం. "కలిత లలిత వనమాలా" అనే ఉత్తరచరణ భాగానికి చేసిన ఆలాపన మరియు నెరవల్ వివిధ విధాలుగా సాగి హిందోళరాగ గమక వైభవమంతా రెండు నిముషాలలో ఆ స్వరార్ణవ కుంభసంభవునికి ఆపోశనం అయిపోయింది. ఇది తనివితీర విని నెమరు వేసుకోవలసిన వైభవానుభవమే తప్ప వర్ణించడం చప్పడిమాటలే అవుతాయి. ఆలాపనలో పై షడ్జమంలో విహరిస్తూ, అలా పై స్థాయి మధ్యమాన్ని చేరి, అక్కడే నిలబడి "గదమగస, సమగసని, నిగసనిద, దసనిదమ, మనిదమగ, గదమగస", మొదలైన విశిష్ట గమకాలతో ఆలాపనని కొనసాగించి, "కలిత లలిత వనమాలా" అను చరణభాగాన్ని మూడురీతుల నెరవల్ చేయడంలో అటు నారదసంగీత ప్రతిభ, ఇటు ఘంటసాల శాస్త్రీయగాయన సామర్థ్యం రెండూ ద్యోతకమవుతాయి. అయితే, సంపూర్ణ శాస్త్రీయ పద్దతిలో, ఏ అన్యస్వర ప్రయోగమూ లేకుండా పాడిన ఈ పాట ఘంటసాల హిందోళరాగ గాయనానికి దీటురాయైనప్పటికీ ఎందుచేతనో మఱుగునబడింది.

మాస్టారు పాడిన సామజవర గమనా ఆడియో: మూలం - ఘంటసాల గాన చరిత
(అందించిన వారు శ్రీ శ్రీనాథ్ జొన్నవిత్తుల)

జయజయ దేవహరే ఆడియో: సతీ అనసూయ నుండి
లవకుశ చిత్రంలో హిందోళరాగం : ప్రత్యేకత-ప్రయోగాలు
లవకుశ లోని "సందేహించకుమమ్మా" పాట సన్నివేశంలో, అనుమానాందోళితయైన సీతమ్మను
ఓదార్చి, సమాధాన భావాన్ని సృష్టించే సందర్భంలో
"గమగసదా దనిసాస" (సందేహించకుమమ్మ) అని మంద్ర ధైవత మృదు సంచారంతో
ప్రారంభంచేస్తూ, "దని సమమమ మగగ" (రఘురాము ప్రేమను) అన్నప్పుడు మనకు
ఈ రాగం హిందోళమని తెలిసినా, ఏ హిందోళ రాగాధారితమైన పాటలోనూ లేని కొత్తధాటి వినిపిస్తుంది.
అలాగే చరణంలో "మరోభామతో" అన్న పదాలకు "దనిసమామమా" అని స్వరాలు
కూర్చారు మాస్టారు. పై స్థాయిలో "నా కావ్యమ్మె వృథయగు" అన్నప్పుడు
"దని సమగాస సగనిస" అనే స్వరాలను వేశారు. ప్రత్యేకతంతా ఇక్కడే. "సగమదనిసా"
అనే ఆరోహణంలో ఘంటసాల "సమదనిస" అంటూ గాంధారాన్ని దాటి అన్ని సంచారాల్లోని
ఆరోహణంలో "సమసమగస" అనే ప్రయోగాలతో "సగమా" అనే అతి ప్రసిద్ధమైన
వరసను వదలి ఒక సరికొత్త బాణీనే సృష్టించారు. అలాగే అవరోహణంలో గాంధారం వెనుకనున్న షడ్జమాన్ని
స్పృశించక "గనిస" అనే దాటు గమకాలతో, ఆ "సమ" మరియు "గని"
ల ప్రతిఫలన రూపాన్ని అన్వయించిన ఈ పాట అతినవ్య ప్రయోగమని చెప్పవచ్చు.
ఆశ్చర్యకరమైన మరో విశేషం ఏమిటంటే, హిందోళ రాగంలోలేని "పంచమాన్ని" తాకి
ఒక వినూతనమైన మెరుపును సృష్టించడం. ఈ ప్రయోగం
మనకు "రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిననాడు" అనే రెండవ చరణాంత్యములోనూ, పాటను ముక్తాయంచేసే ఆలాపన చివరిభాగములోను
మనకు వినిపిస్తుంది. "కూడిననాడు"
పదాల పలుకును గమనిస్తే, "మదనీదప మగమా"
అను స్వరాలు వినిపిస్తాయి. సాహిత్యపరంగా ఈ
ప్రయోగం అసాధారణం. ఘంటసాల భావనైపుణ్యానికి ఇది మరొక నిదర్శనం. ఎందుకంటే ఆ "మరోభామతో"
కూడుట అసంగతం కదా! హిందోళ రాగానికే అన్యస్వరమైన పంచమాన్ని ప్రవేశపెట్టి, రాగానికి ఏమాత్రమూ
వ్యత్యాసం కలుగకుండా చేసిన, ఆ భిన్నస్వరప్రయోగం అత్యపూర్వం, అర్థగర్భితం.
సందేహించకుమమ్మ
రామకథను వినరయ్యా
లవకుశులు ప్రప్రథమంగా శ్రీరామున్ని దర్శించినప్పుడు పాడిన శ్లోకం "శ్రీరాఘవం",
మధ్యమస్వరం ప్రతిధ్వనించేలా, "సీతాపతిం" అనే పదాలకు నిషాద స్వరనిలకడ అలా
పైస్థాయి మధ్యమం వరకు సోపానక్రమంలో హిందోళ రాగ స్వర సర్వస్వాన్ని లవకుశుల ఆనంద, ఆశ్చర్య,
అద్భుత భావాలను రసవత్తరంగా పండించిన స్వరసంయోజనం ఘంటసాల రససిద్ధి.
రాబోయే పోస్టులలో హిందోళ రాగాదారితమైన మరికొన్ని మాస్టారి మచ్చు తునకలు చూస్తారు. అంతవరకూ శలవు.
(For some reasons Google Chrome does not show the Telugu fonts properly. It looks good in Firefox and Internet Explorer). To get this article as PDF click the "Print Friendly" icon below and follow the instructions.