కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.
1, జనవరి 2026, గురువారం
రాజునురా నే రాజునురా - పల్లెటూరు (1952) చిత్రం నుండి పి.లీల,బేబీ కృష్ణవేణి
ఆపదల పాలైతివా - పల్లెటూరు (1952) చిత్రం నుండి ఘంటసాల
1952 సంవత్సరంలో విడుదలైన పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షంస్ సంస్థ నిర్మించిన పల్లెటూరు చిత్రం నుండి ఘంటసాల పాడిన "ఆపదల పాలైతివా " అనే ఈ ఏకగళగీతం రచన సుంకర,వాసిరెడ్డి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, టి.జి.కమలాదేవి, రమణారెడ్డి, మిక్కిలినేని, చదలవాడ, నాగభూషణం . ఈ చిత్రానికి నిర్మాత పి.శివరామయ్య మరియు దర్శకుడు తాతినేని ప్రకాశరావు. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు. ఈ చిత్రం 16.10.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
ఆంధ్రుడా లేవరా - పల్లెటూరు (1952) చిత్రం నుండి ఘంటసాల, బృందం
1952 సంవత్సరంలో విడుదలైన పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షంస్ సంస్థ నిర్మించిన పల్లెటూరు చిత్రం నుండి ఘంటసాల బృందం తో పాడిన "ఆంధ్రుడా లేవరా" అనే ఈ బృందగీతం రచన సుంకర,వాసిరెడ్డి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, టి.జి.కమలాదేవి, రమణారెడ్డి, మిక్కిలినేని, చదలవాడ, నాగభూషణం . ఈ చిత్రానికి నిర్మాత పి.శివరామయ్య మరియు దర్శకుడు తాతినేని ప్రకాశరావు. దీనిని ఎన్.టి.ఆర్. పై చిత్రీకరించారు. ఈ చిత్రం 16.10.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
రామహరే శ్రీరామహరే - పల్లెటూరు (1952) చిత్రం నుండి ఘంటసాల, బృందం
1952 సంవత్సరంలో విడుదలైన పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షంస్ సంస్థ నిర్మించిన పల్లెటూరు చిత్రం నుండి ఘంటసాల, బృందం తో పాడిన "రామహరే శ్రీరామహరే" అనే ఈ బృందగీతం రచన సుంకర,వాసిరెడ్డి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, టి.జి.కమలాదేవి, రమణారెడ్డి, మిక్కిలినేని, చదలవాడ, నాగభూషణం . ఈ చిత్రానికి నిర్మాత పి.శివరామయ్య మరియు దర్శకుడు తాతినేని ప్రకాశరావు. దీనిని తెలియదు పై చిత్రీకరించారు. ఈ చిత్రం 16.10.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
31, డిసెంబర్ 2025, బుధవారం
కోరినదిస్తాడు అన్నయ్య - పల్లెటూరు (1952) చిత్రం నుండి బేబీ కృష్ణవేణి
1952 సంవత్సరంలో విడుదలైన పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షంస్ సంస్థ నిర్మించిన పల్లెటూరు చిత్రం నుండి ఘంటసాలబేబీ కృష్ణవేణి పాడిన "కోరినదిస్తాడు అన్నయ్య" అనే ఈ ఏకగళగీతం రచన సుంకర,వాసిరెడ్డి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, టి.జి.కమలాదేవి, రమణారెడ్డి, మిక్కిలినేని, చదలవాడ, నాగభూషణం . ఈ చిత్రానికి నిర్మాత పి.శివరామయ్య మరియు దర్శకుడు తాతినేని ప్రకాశరావు. దీనిని బేబీ కృష్ణవేణి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 16.10.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
ఓ మిఠారి దిల్ కఠారి - పల్లెటూరు (1952) చిత్రం నుండి ఘంటసాల, టి.జి.కమలాదేవి
1952 సంవత్సరంలో విడుదలైన పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షంస్ సంస్థ నిర్మించిన పల్లెటూరు చిత్రం నుండి ఘంటసాల టి.జి.కమలాదేవి తో పాడిన "ఓ మిఠారి దిల్ కఠారి" అనే ఈ యుగళగీతం రచన సుంకర,వాసిరెడ్డి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, టి.జి.కమలాదేవి, రమణారెడ్డి, మిక్కిలినేని, చదలవాడ, నాగభూషణం . ఈ చిత్రానికి నిర్మాత పి.శివరామయ్య మరియు దర్శకుడు తాతినేని ప్రకాశరావు. దీనిని పసుమర్తి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 16.10.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
ఆ సంక్రాంతికి ఈ సంక్రాంతికి - పల్లెటూరు (1952) చిత్రం నుండి ఘంటసాల, ఎం.ఎస్.రామారావు, బృందం
1952 సంవత్సరంలో విడుదలైన పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షంస్ సంస్థ నిర్మించిన పల్లెటూరు చిత్రం నుండి ఘంటసాలఎం.ఎస్.రామారావు,బృందం తో పాడిన "ఆ సంక్రాంతికి" అనే ఈ బృందగీతం రచన సుంకర,వాసిరెడ్డి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, టి.జి.కమలాదేవి, రమణారెడ్డి, మిక్కిలినేని, చదలవాడ, నాగభూషణం . ఈ చిత్రానికి నిర్మాత పి.శివరామయ్య మరియు దర్శకుడు తాతినేని ప్రకాశరావు. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు. ఈ చిత్రం 16.10.1952 న విడుదలైంది.
వచ్చిందోయి సంక్రాంతి - పల్లెటూరు (1952) చిత్రం నుండి ఘంటసాల, ఎం.ఎస్.రామారావు, టి.జి.కమలాదేవి
1952 సంవత్సరంలో విడుదలైన పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షంస్ సంస్థ నిర్మించిన పల్లెటూరు చిత్రం నుండి ఘంటసాలఎం.ఎస్.రామారావు,టి.జి.కమలాదేవి తో పాడిన "వచ్చిందోయి సంక్రాంతి" అనే ఈ బహుగళగీతం రచన సుంకర,వాసిరెడ్డి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, టి.జి.కమలాదేవి, రమణారెడ్డి, మిక్కిలినేని, చదలవాడ, నాగభూషణం . ఈ చిత్రానికి నిర్మాత పి.శివరామయ్య మరియు దర్శకుడు తాతినేని ప్రకాశరావు. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు. ఈ చిత్రం 16.10.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
ఘనుడా భూసురుడేగెనో - శోభ (1958) చిత్రం నుండి ఘంటసాల
1958 సంవత్సరంలో విడుదలైన పొన్నలూరి బ్రదర్స్ సంస్థ నిర్మించిన శోభ చిత్రం నుండి ఘంటసాల పాడిన "ఘనుడా భూసురుడేగెనో" అనే ఈ పద్యాలు రచన బమ్మెఱ పోతన, స్వరపరచినది ఎ.ఎం.రాజా. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, అంజలీదేవి, రాజసులోచన, ముక్కామల, రమణారెడ్డి, రేలంగి. ఈ చిత్రానికి నిర్మాత తెలియదు మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు. దీనిని రేలంగి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 01.05.1958 న విడుదలైంది.
ఈ పద్యం బమ్మెఱ పోతన విరచిత భాగవతంలోని రుక్మిణీ కల్యాణం ఘట్టం నుండి తీసుకోబడిన పద్యం ఇది. దీనికి చక్కని వివరణ "ఈమాట" వెబ్ జైన్ లో శ్రీ చీమలమర్రి బృందావనరావు గారు వ్రాసిన వివరణ ఏమంటే - "ఒక యువకుని ప్రేమించి, తన ప్రేమ సాఫల్యం పొందగల అవకాశాలుగాని, తన వారినుంచి తగిన సానుకూలతగానీ లేకపోవడంతో స్వయంగా తన ప్రయత్నాలు ప్రారంభించి, ఆ యత్నాలు ఫలిస్తాయో లేదో అనే సందేహమూ, ఆతురతా, ఏమవుతుందో అనే భయమూ - వీటితో డోలాయమానమౌతున్న కన్నెమనసు ఈ పద్యంలో ఎంతో సహజంగా కనిపిస్తుంది".
ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుండది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుం
డనుకూలింప తలంచునో తలపడో ఆర్యామహాదేవియున్
నను రక్షింప ఎరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో
రాజా మహరాజా - టింగ్ రంగా (1952) చిత్రం నుండి ఘంటసాల
1952 సంవత్సరంలో విడుదలైన యువా సంస్థ నిర్మించిన టింగ్ రంగా చిత్రం నుండి ఘంటసాలఘంటసాల పాడిన "రాజా మహరాజా " అనే ఈ ఏకగళగీతం రచన తాపీ ధర్మారావు, స్వరపరచినది టి.వి.రాజు,ఎస్.బి.దినకరరావు. ఈ చిత్రంలో తారాగణం శ్రీరామ మూర్తి, ఎస్.వరలక్ష్మి, కనకం, నల్ల రామమూర్తి, సీతారాం, పి.సూరిబాబు . ఈ చిత్రానికి నిర్మాత పి.ఎస్.శేషాచలం మరియు దర్శకుడు బి.ఏ.సుబ్బారావు. దీనిని శ్రీరామమూర్తి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 06.06.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
బేలవుగా కనజాలవుగా - టింగ్ రంగా (1952) చిత్రం నుండి ఘంటసాల
1952 సంవత్సరంలో విడుదలైన యువా సంస్థ నిర్మించిన టింగ్ రంగా చిత్రం నుండి ఘంటసాలఘంటసాల పాడిన "బేలవుగా కనజాలవుగా " అనే ఈ ఏకగళగీతం రచన తాపీ ధర్మారావు, స్వరపరచినది టి.వి.రాజు,ఎస్.బి.దినకరరావు. ఈ చిత్రంలో తారాగణం మంత్రిప్రగడ శ్రీరామ మూర్తి, ఎస్.వరలక్ష్మి, కనకం, నల్ల రామమూర్తి, సీతారాం, పి.సూరిబాబు . ఈ చిత్రానికి నిర్మాత పి.ఎస్.శేషాచలం మరియు దర్శకుడు బి.ఏ.సుబ్బారావు. దీనిని శ్రీరామమూర్తి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 06.06.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
లేదా? మునుపిది కనుగొనలేదా? - టింగ్ రంగా (1952) చిత్రం నుండి ఘంటసాల, ఎస్.వరలక్ష్మి
1952 సంవత్సరంలో విడుదలైన యువా సంస్థ నిర్మించిన టింగ్ రంగా చిత్రం నుండి ఘంటసాల, ఎస్.వరలక్ష్మి తో పాడిన "లేదా? మునుపిది కనుగొనలేదా?" అనే ఈ యుగళగీతం రచన తాపీ ధర్మారావు, స్వరపరచినది టి.వి.రాజు,ఎస్.బి.దినకరరావు. ఈ చిత్రంలో తారాగణం శ్రీరామ మూర్తి, ఎస్.వరలక్ష్మి, కనకం, నల్ల రామమూర్తి, సీతారాం, పి.సూరిబాబు . ఈ చిత్రానికి నిర్మాత పి.ఎస్.శేషాచలం మరియు దర్శకుడు బి.ఏ.సుబ్బారావు. దీనిని శ్రీరామమూర్తి, ఎస్.వరలక్ష్మి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 06.06.1952 న విడుదలైంది.
లోకప్రియా హే శ్యామలా - టింగ్ రంగా (1952) చిత్రం నుండి ఘంటసాల
1952 సంవత్సరంలో విడుదలైన యువా సంస్థ నిర్మించిన టింగ్ రంగా చిత్రం నుండి ఘంటసాలఘంటసాల పాడిన "లోకప్రియా హే శ్యామలా\" అనే ఈ ఏకగళగీతం రచన తాపీ ధర్మారావు, స్వరపరచినది టి.వి.రాజు,ఎస్.బి.దినకరరావు. ఈ చిత్రంలో తారాగణం శ్రీరామ మూర్తి, ఎస్.వరలక్ష్మి, కనకం, నల్ల రామమూర్తి, సీతారాం, పి.సూరిబాబు . ఈ చిత్రానికి నిర్మాత పి.ఎస్.శేషాచలం మరియు దర్శకుడు బి.ఏ.సుబ్బారావు. దీనిని శ్రీరామమూర్తి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 06.06.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
29, డిసెంబర్ 2025, సోమవారం
శ్రీ ఘంటసాల గారి గురించి శ్రీమతి జానకి చెప్పినది.
"ప్రియాతిప్రియమైన మా అన్న గారి గురించి ఎంత వ్రాసినా తక్కువే. అసలు ఈ పుస్తకమంతా నేనొక్కదాన్నే వ్రాయొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకం వ్రాయొచ్చు. అటువంటిది నాలుగు ముక్కల్లో వారిని గురించి ఏం వ్రాయాలి? ఎట్టా వ్రాయాలి? ఘంటసాల గారి కంఠం ఒక పెద్ద గంట.
ఒక పెద్ద గంటను బలంగా ఒక్కసారి మోగిస్తే దాని వైబ్రేషన్ చాలా సేపు వినిపిస్తూనే ఉంటుంది. అట్టాగే ఘంటసాల గారు పాడి వదిలేసిన ఆ పాటల నాదం మన చెవుల్లో రింగుమంటూ ప్రపంచమున్నంత కాలం నిలిచే ఉంటుంది. ఘంటసాల లాగా పాడే వారు (అది కూడా ఒక మోస్తరుగా) ఎంతో మంది ఉండొచ్చు. కానీ, వారు ఘంటసాల కాలేరు, కారు. ఆయన కంఠం స్వతహాగా భగవంతుడిచ్చిన వరంగా పుట్టుకతోనే వచ్చింది. మిగిలినవన్నీ అనుకరణలే గానీ అది సహజం కాదు, తెచ్చిపెట్టుకున్నది. ఘంటసాల అంటే ఒక్కడే. అంతే, అది అంతే, వారికి వారే సాటి.
అటువంటి మహాగాయకుడితో కలిసి నేను మొట్టమొదటి తెలుగు పాట పాడటం నా అదృష్టం. అసలు నా మొట్టమొదటి యుగళగీతమే అది కావటం నా భాగ్యం. తిలక్ గారి చిత్రం “ఎం. ఎల్. ఎ”లో, పెండ్యాల గారి సంగీతంలో, ఆరుద్ర గారి రచన “నీ ఆశ అడియాస” అనే యుగళగీతం అది. ఘంటసాల గారి గళంతో గళం కలిపి నేను పాడిన ఆ నా మొదటి యుగళగీతం ఈనాటికీ అందరి హృదయాలలోనూ మారుమ్రోగుతూనే ఉంది. అది ఏడుపు పాటే కావచ్చు. ఒక బిడ్డ పుట్టినప్పుడూ, ఏడుస్తూనే పుడుతుంది గదా? తరువాత నవ్వుతుంది. అట్టాగే నా సినీ గాన జీవితం కూడా ఏడుపు పాటతోనే ప్రారంభమయింది. కానీ, నేను ఇంకా నవ్వుతూనే నా జీవితాన్ని నేపథ్యగాయనిగా వెనుకచూపు లేకుండా నడుపుకుంటూనే ఉన్నాను.
ఘంటసాల గారితో ఎన్నో మంచి మంచి యుగళగీతాలు పాడాను. మేం రికార్డింగ్స్‌లో కలుసుకున్నప్పుడు ఆయన నవ్వుతూ, నవ్విస్తూ చాలా సరదాగా ఉండేవారు, ఎంతో ప్రోత్సాహం ఇచ్చేవారు. ఒక పాట పాడాలంటే దాంట్లో ఎన్నో భావాలుంటాయి. ఆ భావాలొలికిస్తూ నవ్వుతూ ఏడుస్తూ పాడేప్పుడు అస్సలు సిగ్గు పనికి రాదు, సిగ్గు విడిచి పాడాలి. అప్పుడే ఆ భావాలు సరిగ్గా వస్తాయి అని చెప్పేవారు. రికార్డింగ్ అప్పుడు ఎంత మంది ఉన్నా, మననే చూస్తున్నా మనం పట్టించుకోరాదు. అసలక్కడ ఎవ్వరూ లేనట్టూ, మనమే ఒంటరిగా ఉన్నట్టూ భావించి పాడాలి అనేవారు. ముమ్మాటికీ అది నిజం, అక్షరాలా వారు చెప్పింది నిజం.
ఆయన సంగీతంలో కూడా నేను చాలా చిత్రాలలో పాడాను. అందులో ఒకటి “పాండవ వనవాసం”లో “ఓ వన్నెకాడ” అనే పాట చాలా హిట్టయింది. ఆ రికార్డింగ్ అప్పుడు ఆయన నేను చాలా బాగా పాడానని మెచ్చుకుంటూంటే పొంగిపోయాను. సింగర్స్ ఎంతో మంది చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. కానీ ఎవ్వరూ కూడా మ్యూజిక్ డైరెక్టర్‌గా అంతగా రాణించలేదు. కానీ, ఘంటసాల గారు మ్యూజిక్ చేసిన ప్రతి పిక్చరూ మ్యూజికల్‌గా గ్రాండ్ సక్సెస్, అన్ని హిట్ సాంగ్సే. చిత్రాలు, పాటలు కూడా హిట్సే. ఆయన మ్యూజిక్ చేసిన ప్రతి పిక్చరూ ఏవేవీ అని మీకే తెలుసు. అవన్నీ ఏవేవీ అని ఒక్కసారి ఊహించుకుని జ్ఞాపకం చేసుకోండి. మీకే తెలుస్తుంది. ఇటు సింగర్‌గానూ అటు మ్యూజిక్ డైరెక్టర్ గానూ కూడా గ్రాండ్ సక్సెస్ అయిన వ్యక్తి ఒక్క ఘంటసాల గారే, ఆ ఘనత వారికొక్కరికే దక్కింది.
వారు మ్యూజిక్ చేసి పాడిన ప్రైవేట్ సాంగ్స్ కూడా ఎంతో హిట్స్. అందులో పుష్పవిలాపం ఎప్పుడూ నేను నా కచేరీలలో పాడుకుంటూ ఉంటాను.
ఒకసారి నేనూ, మావారు కుటుంబసమేతంగా తిరుపతికి వెళ్ళి స్వామివారి దర్శనం ముగించుకుని వస్తూండగా గుడి బయట ఘంటసాల గారు కనిపించారు. “ఇవ్వాళ ఉంటున్నారా?” అని వారు మా వారిని అడిగారు. “దర్శనం అయిపోయింది గదా, ఇక బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నాం” అన్నారు మా వారు. ఘంటసాల గారు మమ్మల్ని ఆ రోజు ఉండి మర్నాడు వెళ్ళమన్నారు, “ఈ రోజు సాయంకాలం గుళ్ళో స్వామివారి సన్నిధిలో స్వామికి ఎదురుగా కూర్చొని నేను భక్తి గీతాలు పాడుతున్నాను. అమ్మాయి కూడా రెండు పాటలు పాడితే బాగుంటుంది” అన్నారు. స్వామివారి ముందర పాడే సదవకాశాన్ని కలిగించినందుకు సంతోషించి ఒప్పుకుని ఉండిపోయాం. అది మా భాగ్యం. ఆ రోజు సాయంకాలం వేంకటేశ్వరస్వామి ముందర కూర్చుని ఘంటసాల గారితో కలిసి మేమిద్దరమే పాడిన “రంగుల రాట్నం” చిత్రంలోని యుగళగీతం “నడిరేయి ఏ జాములో” పాడాను. ఆ సంఘటన జీవితంలో నేను మరిచిపోను, మరువలేను.
నేనూ ఘంటసాల గారు పాడిన యుగళగీతాలు ఎన్నో హిట్స్ ఉన్నాయి. వాటిలో “నడిరేయి ఏ జాములో” అనే పాట చాలా హిట్టయింది. ఇంకొకటి “ఖైదీ బాబాయ్” అనే చిత్రంలో నేను ఒకే ఒక పాట పాడాను. ఘంటసాల గారు కూడా ఒకే ఒక పాట పాడారు. ఆ పాట “ఓరబ్బీ చెబుతాను” అనే యుగళగీతం. అది చాలా హిట్టయింది.
ఘంటసాల గారి రోజులలో కూడా కొన్ని రికార్డింగ్స్ మేమిద్దరం కలిసి పాడాము. ఆ సమయంలో ఆయన “భగవద్గీత రికార్డ్ చేస్తున్నాను, అది నేను పూర్తి చెయ్యగలనో లేదో” అంటూ బాధపడ్డారు. “అవేం మాటలూ? అట్టా అనకండి. తప్పకుండా పూర్తి చేస్తారు. మీరింకా ఎన్నో పాడాలి, మీరు బాగుండాలి.” అన్నాను. నేను చాలా బాధపడ్డాను.
ఒక విచిత్రం. ఘంటసాల గారితో నేను పాడిన మొట్టమొదటి యుగళగీతం, ఆయనతో పాడిన ఆఖరి యుగళగీతమూ కూడా పెండ్యాల గారి సంగీతమే. నేనూ ఘంటసాల గారూ పాడిన మా ఆఖరి యుగళగీతం కూడ ఏడుపే. “నాన్న అనే రెండక్షరములు” అనే పాట – ఇది పాడేప్పుడు ఆయన “రేపు నా పిల్లలు ఈ పాట పాడుకుంటారు” అన్నారు. “అయ్యొయ్యో ఏంటీ, అట్టా మాట్టాడతారు? ఊరుకోండి.” అన్నాను. నాకు చాలా ఏడుపొచ్చింది. ఆ కొద్ది రోజులలోనే మనందరినీ దుఃఖసాగరంలో ముంచేసి ఘంటసాల గారు స్వర్గస్థులైనారు.
ఘంటసాల గారు మన అందరి హృదయాలలోనూ ఇంకా జీవిస్తూనే ఉన్నారు. వారు అమరులు….వారు అమరులు….వారు అమరులు. ఇది నా హృదయం వ్రాసింది సుమా చేతులు వ్రాయలేదు."
బలిపీఠం (1975) చిత్రం ఆరంభంలో ఘంటసాల మాస్టారు పాడిన శ్లోకం
ఇది భర్తృహరి రచించిన నీతిశతకము లోని మొదటి శ్లోకం.
దిక్కాలాద్యనవచ్ఛిన్నానంత చిన్మాత్ర మూర్తయే|
స్వానుభూత్యేకమానాయ నమ: శాంతాయ తేజసే||
పదవిచ్ఛేదన:
దిక్-కాలాది-అనవచ్ఛిన్న-అనంత చిన్మాత్ర మూర్తయే|
స్వానుభూతి-ఏక-మానాయ నమ: శాంతాయ తేజసే||
ప్రతిపదార్థం:
దిక్ - దిక్కులు; కాల - కాలము; ఆది - మొదలైన; అనవచ్ఛిన్న - బంధింపబడని ; అనంత - అంతములేని; చిన్మాత్ర - స్వచ్ఛమైన మేధస్సు; మూర్తయే - ప్రతిరూపమైన; స్వ - స్వీయ; అనుభూతి - అనుభవము లేదా భావన; ఏక - ఏకమైన లేదా ఒక్కటే; మానాయ - చిత్తోన్నతి; నమ: - నమస్సులు; శాంతాయ - శాంత స్వరూపుడైన; తేజసే - ప్రకాశవంతమైన.
తాత్పర్యం (మాస్టారు ఆలపించింది):
దేశ (దిశా*) కాల పరిమితిలేక, జ్ఞానస్వరూపమై, అనుభవముచేతనే ఎరుంగదగినదై, శాంతమైన జ్యోతిస్వరూపమగు పరబ్రహ్మకు నమస్కారము.
*దేశ అని కాక దిశా (దిక్కు) అని వుండాలని నా అభిప్రాయము.
ఈ తాత్పర్యం నా మాటల్లో:
దిక్కులు మరియు కాలం అనే పరిమితులకు అతీతుడైన, స్వచ్ఛమైన మేధస్సుకు ప్రతిరూపమై, కేవలం ఆత్మ ప్రయత్నం మరియు అనుభవం ద్వారానే అర్థం చేసుకోదగిన, ప్రకాశవంతమైన మరియు శాంత స్వరూపుడైన ఆ దేవునికి నమస్కారాలు.
ఎవరిది విజయం - శ్రీమతి చిత్రం నుండి ఘంటసాల, పిఠాాపురం, వి.సూర్యనారాయణ, బృందం
1966 సంవత్సరంలో విడుదలైన శ్రీనిలయం పిక్చర్స్ సంస్థ నిర్మించిన శ్రీమతి చిత్రం నుండి ఘంటసాల, పిఠాాపురం, వి.సూర్యనారాయణ, బృందంపాడిన "ఎవరిది విజయం " అనే ఈ బహుగళగీతం రచన శ్రీశ్రీ, స్వరపరచినది శ్రీ నిత్యానంద్. ఈ చిత్రంలో తారాగణం కాంతారావు,శారద,చలం,గీతాంజలి, వాసంతి. ఈ చిత్రానికి నిర్మాత తెలియదు మరియు దర్శకుడు విజయానంద్. దీనిని కాంతాారావు, చలం, పొన్నతోట రఘురాం, తదితరులు పైచిత్రీకరించారు. ఈ చిత్రం 9.12.1966 న విడుదలైంది.
కోరికలా కుటీరములో - శ్రీమతి చిత్రం నుండి ఘంటసాల, పి.సుశీల
1966 సంవత్సరంలో విడుదలైన శ్రీనిలయం పిక్చర్స్ సంస్థ నిర్మించిన శ్రీమతి చిత్రం నుండి ఘంటసాల పాడిన "కోరికలా కుటీరములో " అనే ఈ యుగళగీతం రచన ఆరుద్ర, స్వరపరచినది శ్రీ నిత్యానంద్. ఈ చిత్రంలో తారాగణం కాంతారావు,శారద,చలం,గీతాంజలి, వాసంతి. ఈ చిత్రానికి నిర్మాత తెలియదు మరియు దర్శకుడు విజయానంద్. దీనిని కాంతారావు, శారద పైచిత్రీకరించారు. ఈ చిత్రం 9.12.1966 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
మ్రోగింది గుడిలోని గంట - శ్రీమతి చిత్రం నుండి ఘంటసాల, సుశీల
1966 సంవత్సరంలో విడుదలైన శ్రీనిలయం పిక్చర్స్ సంస్థ నిర్మించిన శ్రీమతి చిత్రం నుండి ఘంటసాల పాడిన "మ్రోగింది గుడిలోన గంట" అనే ఈ యుగళగీతం రచన ఆరుద్ర, స్వరపరచినది శ్రీ నిత్యానంద్. ఈ చిత్రంలో తారాగణం కాంతారావు,శారద,చలం,గీతాంజలి, వాసంతి. ఈ చిత్రానికి నిర్మాత తెలియదు మరియు దర్శకుడు విజయానంద్. దీనిని కాంతారావు, శారద పైచిత్రీకరించారు. ఈ చిత్రం 9.12.1966 న విడుదలైంది.