యన్టీఆర్
'అర్జునుడి'గా ఐదు చిత్రాలలో నటించారు. అవి   'జయసింహ' (స్వప్న దృశ్యంలో), 'నర్తనశాల', 'బభ్రువాహన',  'ప్రమీలార్జునీయం' మరియు 'శ్రీమద్విరాటపర్వము'.  ప్రమీలార్జునీయం చిత్రానికి అలనాటి ప్రముఖ చలన చిత్ర  నటి సీనియర్ శ్రీరంజని
కుమారుడైన మల్లికార్జునరావు దర్శకుడిగా పరిచయమయ్యారు.  కురుక్షేత్ర యుద్ధానంతరం బంధుమిత్ర సంహారం వలన సంక్రమించిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసం అశ్వమేథ యాగాన్ని తలపెడతాడు అజాతశత్రువుగా వాసికెక్కిన ధర్మరాజు.  యాగాశ్వాన్ని రక్షిస్తూ వెళ్లి అర్జునుడు స్త్రీ
మండలమైన ప్రమీలా రాజ్యంలో చేరుకుంటాడు.  అక్కడ  ప్రమీలకు అర్జునునకు 
మధ్య వైరం ఏర్పడి క్రమేపి అది 
అనురాగంగా మారి, కడకు ఇరువురి కళ్యాణం జరిగి కథ సుఖాంతం అవుతుంది. ఈ చిత్రానికి నిర్మాత కందిమళ్ల ఆదిబాబు. 
చిత్రం: ప్రమీలార్జునీయం (1965)
చిత్రం: ప్రమీలార్జునీయం (1965)
రచన:         పింగళి నాగేంద్ర రావు
గానం:         ఘంటసాల
సంగీతం:      పెండ్యాల నాగేశ్వర రావు
నటీ నటులు: ఎన్.టి.ఆర్, బి.సరోజ, కాంతారావు
నటీ నటులు: ఎన్.టి.ఆర్, బి.సరోజ, కాంతారావు
                            సాకీ.  ఓహో మనోజ్ఞ సుందరీ, మాట మాట  
                            ప.     అతి ధీరవే గాని, అపురూప రమణివే
                                    అతి ధీరవే గాని, అపురూప రమణివే
                                    జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త
                            చ.     నీ సుకుమార ఠీవికి మురిసి ఓ...
                                    నీ సుకుమార ఠీవికి మురిసి
                                    నీ అసమాన ధాటికి దడిసి
                                    ఎవని కనులు చెదరునో,
                                    నీకు దిష్టి తగులునొ తరుణీ             || అతి ధీరవే ||
                            చ.     నీ నయగారమే సెలయేరుగా,
                                    నీ అనురాగమే సుడిగాలిగా ఆ..ఆ..
                                    నీ నయగారమే సెలయేరుగా,
                                    నీ అనురాగమే సుడిగాలిగా
                                    ఎవడు మూర్ఛ మునుగునో, 
                                    నీ మనసు కరుగునొ జవ్వనీ            || అతి ధీరవే ||
                            చ.     నీ క్రీగంట విరిసిన చూపులు ఓ..ఓ..
                                    నీ క్రీగంట విరిసిన చూపులు
                                    అహ ప్రాణాల నొరిసే చూపులే
                                    ఎవని గుండెలదరునో
                                    నీకు జాలి కలుగునొ రమణీ             || అతి ధీరవే ||


 
