1972 సంవత్సరంలో
విడుదలైన వీనస్ మహీజా సంస్థ నిర్మించిన బాల భారతం చిత్రం
నుండి ఘంటసాల పాడిన “నారాయణ నీలీల నవరసభరితం” అనే
ఈ ఏకగళగీతం రచన ఆరుద్ర, స్వరపరచినది  ఎస్.
రాజేశ్వరరావు. ఈ చిత్రంలో తారాగణం
ఎస్.వి. రంగారావు, అంజలీదేవి,
బేబి శ్రీదేవి, కాంతారావు, ఎస్. వరలక్ష్మి, హరనాధ్
ఈ చిత్రానికి నిర్మాత సి.హెచ్.ప్రకాశరావు
మరియు దర్శకుడు కె.కామేశ్వరరావు.
| #0000 | ఏకగళం | పాట: | నారాయణ నీ లీల నవరసభరితం | 
|---|---|---|---|
| పతాకం: | వీనస్ మహీజా వారి | ||
| చిత్రం: | బాలభారతము (1972) | ||
| సంగీతం: | ఎస్. రాజేశ్వరరావు | ||
| గీతరచయిత: | ఆరుద్ర | ||
| నేపథ్య గానం: | ఘంటసాల | ||
| దర్శకత్వం: | కమలాకర కామేశ్వరరావు | ||
| పల్లవి : | నారాయణ నీ లీల నవరసభరితం | ||
| నీ ప్రేరణచే జనియించే బాలభారతం.. బాలభారతం | |||
| నీ ప్రేరణచే జనియించే బాలభారతం.. బాలభారతం | |||
| చరణం 1 : | ముని శాపముచే వగచే సతీపతులకూ | ||
| తనయుల నొందే మార్గము తాపసి తెలిపే | |||
| మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేతా.. ఆ.. ఆ | |||
| మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేతా.. | |||
| తన వంశము నిలపమని జనపతి కోరే | |||
| నారాయణ నీ లీల నవరసభరితం.. | |||
| నీ ప్రేరణచే జనియించే బాలభారతం.. బాలభారతం | |||
| చరణం 2 : | కృష్ణాగ్రజుడై బలరాముడు గోకులమున జనియించే | ||
| కుంతికి ధర్ముని అనుగ్రహంబున కులదీపకుడుదయించే | |||
| ఆ శుభవార్తకు గాంధారీ సతి అసూయ చెందినదీ | |||
| ఈసున గర్భ తాడన మింతి తానొనరించినదీ | |||
| వ్రయ్యలైన గర్భమ్మును వ్యాసుడు సంరక్షించెనూ | |||
| పిండమును నూటొక్క కుండల విభజించెనూ | |||
| వరమునిచ్చెను వాయుదేవుడు.. అంత వనిత కుంతికి పుట్టె భీముడు | |||
| మొదటి కడవ జొచ్చెను కలిపురుషుడు | |||
| కలిగే గాంధారికి తొలి పుత్రుడూ.. కలిగే గాంధారికి తొలి పుత్రుడూ | |||
| దుర్యోధన జననముచే దుశ్శకునమ్ములు దోచే | |||
| దుర్భర రావమ్ములకు దుహ్ ఖించెను జగతీ | |||
| దుష్టుల శిక్షించుటకై.. శిష్టుల రక్షించుటకై | |||
| అష్టమి శుభలగ్నమున హరి సరుగున వెలసే .. హరి సరుగున వెలసే | |||
| నారాయణ నీ లీల నవరసభరితం.. | |||
| నీ ప్రేరణచే జనియించే బాలభారతం.. బాలభారతం | |||
| చరణం 3 : | జనియించిన హరి జననీ జనకుల జ్ఞానుల గావించే | ||
| తనయుని చేకొని వసుదేవుడు తా వ్రేపల్లెకు జేర్చే | |||
| యశోద సుతయౌ యోగమాయ నా నిశీధమున తెచ్చే | |||
| నశింపజేయగ దలచెడి కంసుడు అశెక్త దిగ్బ్రముడాయే | |||
| అమరేంద్రుని అతినిష్టతొ అర్చించెను కుంతి | |||
| అతని వరముచే నరుడే అర్జునుడై పుట్టె | |||
| నరనారాయణ జననము ధరణికి ముదమాయే | |||
| సురలు మురిసి సుధలు చిందు విరివానలు విరిసే | |||
| శతపుత్రుల పిదప నొక్కసుతను గాంచె గాంధారీ | |||
| శకుని కూడ సుతుని బడసి సంతోషము తానొందె | |||
| నాతి మాద్రి అశ్వినులను ప్రీతితో భజించే | |||
| నకులుడు సహదీవుడనే నందనులను గాంచే | |||
| కౌరవులూ.. పాండవులూ.. కమనీయులు యాదవులూ | |||
| కారణ జన్ములు సర్వులు ధారుణి ప్రవర్దమానులైరి | |||
| దారుణ హింసా కాండల దానవ పతి కంసుడూ | |||
| ధనుర్యాగమని బలరామకృష్ణుల తన వద్దకు రప్పించే | 

 
