1950 లో సొసైటీ పిక్చర్సు పతాకం పై తీసిన చిత్రం ప్రపంచం. ఈ చిత్రంలో పద్మశ్రీ చిత్తూరు వి. నాగయ్య, జి.వరలక్ష్మి (గరికపాటి వరలక్ష్మి) నాయికా, నాయకులుగా నటించారు. జి.వరలక్ష్మి తొలిచిత్రం శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రచించిన కథ ఆధారంగా అదే పేరుతో 1940 లో తీసిన బారిస్టరు పార్వతీశం చిత్రం. ప్రపంచం చిత్రంలో ఘంటసాల మాస్టారు పాడిన ఒకే యుగళ గీతం శ్రీమతి ఎన్.ఎల్.గానసరస్వతి గారితో. ఈవిడ బహుశా మళయాళ రంగం నుండి అనుకుంటాను. వీరే కాక ఈ చిత్రంలో శ్రీమతి ఎమ్.ఎల్.వసంత కుమారి, ఎ.ఎమ్.రాజా కూడ పాడారు. మిగిలిన వివరాలు ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి లో చూడగలరు. ఈ పాట రచయిత మహాకవి శ్రీశ్రీ. సంగీత దర్శకులు ఎమ్.ఎస్.జి.మణి మరియు పూర్ణానంద.
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
చిత్రం: ప్రపంచం (1950)
గీతరచన: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, ఎన్. ఎల్. గానసరస్వతి
సంగీతం: ఎం.ఎస్.జి. మణి మరియు టి. పూర్ణానంద
గానసరస్వతి: | ఆ..ఆ.. | ||
ఘంటసాల: | ఆ..ఆ.. | ||
పల్లవి: | గానసరస్వతి: | ప్రేమ సుధా సరసిలో హంసలమై | | ప్రేమసుధా | |
ప్రియముగ విహరించ మనసాయెగా | |||
ప్రేమ సుధా సరసిలో | |||
చరణం: | ఘంటసాల: | ఆమని అరుదెంచె ఆశలు చిగురించే..ఏ..ఏ.. | |ఆమని| |
ఆమని అరుదెంచె ఆశలు చిగురించే | |||
ప్రేమము కుసుమించె నేడే | |||
మన జీవితమే తేలి తూగే | |||
గానసరస్వతి: | కలసిన హృదయాల వెలసిన స్నేహాల | | కలసిన | | |
విలసనమె హాయి హాయి | | విలసనమె | | ||
ఘంటసాల: | ప్రణయ లోకాలలో | ||
గానసరస్వతి: | మధుర గానాలలో | ||
ఘంటసాల: | ప్రణయ లోకాలలో | ||
గానసరస్వతి: | మధుర గానాలలో | ||
ఇద్దరు: | కడు ప్రియమార నడయాడ మనసాయెగా..ఆ.. | ||
ప్రియమార నడయాడ మనసాయెగా | |||
చరణం: | గానసరస్వతి: | వెన్నెల కెరటాలా..ఆ..ఆ.. | |
వెన్నెల కెరటాల యవ్వన సుమడోల | |||
ముదరణములసేయ మనసాయెరా | |||
ఘంటసాల: | నా మది పులకించే..ఏ..ఏ.. | ||
నా మది పులకించే నా ఎద కరగించే.. | |||
కోయిలవై పాడినావే | | కోయిలవై | | ||
గానసరస్వతి: | ఓ! నవ మోహనా | ||
ఘంటసాల: | ఓ! వనజాననా | ||
గానసరస్వతి: | ఓ! నవ మోహనా | ||
ఘంటసాల: | ఓ! వనజాననా | ||
గానసరస్వతి: | ప్రేమయే.. | ||
ఘంటసాల: | జీవము | ||
గానసరస్వతి: | జీవమే.. | ||
ఘంటసాల: | ప్రేమము | ||
ఇద్దరు: | ఇక మన ప్రేమకిల సాటి కనరాదుగా | ||
కనరాదుగా |
కృతజ్ఞతలు: సినిమా పోస్టరు ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి నుండి; ఆడియో సంగీతము అందించిన సఖియా.కాం నిర్వాహకులైన హైదరాబాద్ శ్రీ ఘంటసాల సంగీత కళాశాల సంచాలకులు శ్రీ కొల్లూరి భాస్కరరావు గారికి.
Suryanarayana Garu,
రిప్లయితొలగించండిnamastE! I never heard this song before. Thanks you very much for sharing a rare song. Are you sure the female singer is Gana Saraswati Garu. The female voice sounded more like Smt. M.L Vasanta Kumari garu. Can you verify?
best regards,
Ramanna Vishnubhotla
Ramanna garu, Namaskaram. Sorry for the late reply. I also had the same doubt. I got the information from Ghantasala Galamrutamu Patala Palavelli.
తొలగించండినమస్కారం! సూర్యనారాయణగారు
రిప్లయితొలగించండిమీ బ్లాగుద్వారా అరుదైన, వీనుల విందు అయిన ఘంటసాల మాస్టారు వారి పాటలు వినగలుగుతున్నాను. మీకు సర్వదా కృతజ్ఞుడను. ఈ పాటలో మహాకవి శ్రీ శ్రీ గారు తేట తెలుగు లో ఎంత చక్కగా చెప్పారో నిజంగా ప్రేమయే..జీవము..జీవమే..ప్రేమము
ముందు ముందు మరిన్ని మధుర మైన పాటలు అందిస్తారని అశిస్తూ..
భవదీయుడు
రామారావు
రామారావు గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీకు ముందు ముందు అరుదైన పాటలు తప్పకుండ అందిస్తాను.
తొలగించండిhii.. Nice Post Great job.
రిప్లయితొలగించండిThanks for sharing.
Any time More Entertainment for you.
తొలగించండిచాలా బాగుంది సూర్యనారాయణగారు,చాలా విశేషాలు తెలియజేసేరు.శ్రీశ్రీ గారి అరుదైన సాహిత్యాన్ని అందించేరు.శ్రీశ్రీ గారు తెలుగులో మొదటిపాట "ఆహుతి" అనే డబ్బింగు సినిమాకి రాసేరు(ప్రేమయే జననమరణ లీల-ఘంటశాల-సాలూరు రాజేశ్వరరావు).జి.వరలక్ష్మి గారు గరికపాటి వారని ఇప్పటివరకూ నాకు తెలియదు.ధన్యవాదములు
రిప్లయితొలగించండి