మనకు ఉన్న ఆధారాల ప్రకారం 1757 జనవరి 24 న, అంటే సరిగ్గా 258 సంవత్సరాల క్రితం ఇదే రోజున, కోస్తా ఆంధ్ర లో గల విజయనగరం మరియు బొబ్బిలి రాజులకు పరస్పర విద్వేషాల ఫలితంగా జరిగిన
చారిత్రక యుద్ధం బొబ్బిలి యుద్ధం. ఈ యిరు సీమల వీరులు ధైర్య, సాహసాలకు,
పౌరుష ప్రతాపాలకు పెట్టింది పేరు. విజయనగరం రాజు పూసపాటి విజయరామ రాజు.
బొబ్బిలి రాజు రంగారావు నాయుడు, అతని సేనాని బొబ్బిలి బెబ్బులి (పెద్ద పులి) గా ప్రఖ్యాతమైన
తాండ్ర పాపారాయుడు. పాపారాయుని చెల్లెలు సుభద్ర రంగారావు నాయుని తమ్ముడైన
వెంగళరాయుని ప్రేమిస్తుంది. ఇరు రాజ్యాల నడుమ పరస్పర వైర విద్వేషాలు పెచ్చు
పెరిగి విజయరామరాజు ఫ్రెంచ్ జనరల్ బుస్సీ సహాయంతో బొబ్బిలిపై దండెత్తి
రాజా రంగారావును చంపుతాడు. అందుకు ప్రతీకారంగా పాపారాయుడు విజయరామరాజును
హతమారుస్తాడు. బొబ్బిలి గురించి ఒక చక్కని రూపకాన్ని క్రింది వీడియోలో చూడవచ్చు. బొబ్బిలి మా ముత్తాతగారు శ్రీ వులిమిరి రామలింగస్వామి గారి వూరు. ఆయన బొబ్బిలి లో రాజుగారు నిర్మించిన బొబ్బిలి సంస్థానం హై స్కూలుకు తొలి ప్రధానోధ్యాపకులు. వారు బొబ్బిలి రాజుగారి ఆహ్వానంపై గోదావరి జిల్లాలనుండి వలస వచ్చి బొబ్బిలిలో అగ్రహారం వీధిలో స్థిరపడ్డారు.
1964 లో రిపబ్లిక్ ప్రొడక్షంసు పతాకంపై ఈ కథను బొబ్బిలి యుద్ధం పేరున నిర్మించారు సి.సీతారాం. అతనే వెంగళరాయుడు పాత్ర పోషించారు. రంగారావు నాయుడు గా ఎన్.టి.ఆర్., తాండ్రపాపారాయుడు గా ఎస్.వి.ఆర్., పాపారాయుడు చెల్లెలు గా జమున నటించారు. ఫ్రెంచ్ జనరల్ బుస్సీగా ముక్కామల నటన ఆయన నటజీవితంలోనే అత్యద్బుతమైన పాత్రగా చెబుతారు. ఇందులో ఘంటసాల, సుశీల పాడిన చక్కని రెండు శృంగార గీతాలను శ్రీశ్రీ వ్రాసారు. సంగీతం సాలూరు రాజేశ్వర రావు. ఇక్కడ అనురాగాల రాగాలు, నయగారాల గారాలు వెరసి మురిపించే అందాలు - శ్రీ శ్రీ మాటల ఒరవడిని పాట ఉరవడిని ఈ యుగళ గీతంలో విని ఆనందించండి.
Thanks to Wikipedia for providing important background information
Thanks to V6 Telugu News for providing video on Bobbili.
1964 లో రిపబ్లిక్ ప్రొడక్షంసు పతాకంపై ఈ కథను బొబ్బిలి యుద్ధం పేరున నిర్మించారు సి.సీతారాం. అతనే వెంగళరాయుడు పాత్ర పోషించారు. రంగారావు నాయుడు గా ఎన్.టి.ఆర్., తాండ్రపాపారాయుడు గా ఎస్.వి.ఆర్., పాపారాయుడు చెల్లెలు గా జమున నటించారు. ఫ్రెంచ్ జనరల్ బుస్సీగా ముక్కామల నటన ఆయన నటజీవితంలోనే అత్యద్బుతమైన పాత్రగా చెబుతారు. ఇందులో ఘంటసాల, సుశీల పాడిన చక్కని రెండు శృంగార గీతాలను శ్రీశ్రీ వ్రాసారు. సంగీతం సాలూరు రాజేశ్వర రావు. ఇక్కడ అనురాగాల రాగాలు, నయగారాల గారాలు వెరసి మురిపించే అందాలు - శ్రీ శ్రీ మాటల ఒరవడిని పాట ఉరవడిని ఈ యుగళ గీతంలో విని ఆనందించండి.
Thanks to Volga Video for posting the song on You Tube
చిత్రం: | బొబ్బిలి యుద్ధం (1964) | |
సంగీతం: | సాలూరి రాజేశ్వర రావు | |
రచన: | శ్రీ శ్రీ | |
గానం: | ఘంటసాల, సుశీల | |
సాకీ: | ఘంటసాల: | సొగసు కీల్జడదానా… సోగకన్నులదాన |
వజ్రాలవంటి పల్వరుసదాన | ||
బంగారు జిగిదానా… సింగారములదాన | ||
నయమైన వయ్యారి నడలదాన | ||
తోరంపుకటిదానా…తొణకు సిగ్గులదాన | ||
పిడికిట నడగు నెన్నడుముదానా... ఆ... | ||
పల్లవి: | ఘంటసాల: | మురిపించే అందాలే అవి నన్నే చెందాలే (2) |
నా దానవు నీవేలే, నీ వాడను నేనేలే ఆ... | ||
దరిచేర రావే సఖీ నా సఖీ… ప్రేయసీ సిగ్గేలా | ||
సుశీల: | మరపించే మురిపాలే కరిగించే కెరటాలై (2) | |
నిదురించే భావాల, కదిలించే ఈవేళ... ఆ... | ||
అదే హాయి కాదా సఖా నా సఖా… | ||
ఘంటసాల: | మురిపించే అందాలే అవి నన్నే చెందాలే | |
చరణం: | ఘంటసాల: | చెలి తొలిచూపె మంత్రించెనే..ఏ..ఏ..ఏ..ఏ.. |
సుశీల: | ప్రియ సఖురూపె మదినేలెనే..ఏ..ఏ..ఏ..ఏ.. | |
ఘంటసాల: | చెలి తొలిచూపే మంత్రించెనే..ఏ..ఏ..ఏ..ఏ | |
సుశీల: | ప్రియ సఖురూపె మదినేలెనే..ఏ..ఏ..ఏ..ఏ.. | |
ఇద్దరు: | ఇది ఎడబాటు కనలేని ప్రేమ ఇల మనకింక సురలోక సీమ | |
సుశీల: | ఇదే హాయి కాదా సఖా నా సఖా… | |
ఘంటసాల: | మురిపించే అందాలే అవి నన్నే చెందాలే | |
చరణం: | ఘంటసాల: | అనురాగాల రాగాలలో…ఓ.ఓ.ఓ.ఓ. |
సుశీల: | నయగారాల గారాలలో…ఓ.ఓ.ఓ.ఓ. | |
ఘంటసాల: | అనురాగాల రాగాలలో…ఓ.ఓ.ఓ.ఓ. | |
సుశీల: | నయగారాల గారాలలో…ఓ.ఓ.ఓ.ఓ. | |
ఇద్దరు: | మధు మాధుర్యమే నిండిపోయె హృదయానందమే పొంగిపోయె (2) | |
ఘంటసాల: | దరిచేర రావే సఖీ నా సఖీ… | |
మురిపించే అందాలే అవి నన్నే చెందాలే |