ముత్తరాజుసుబ్బారావు (1888-1922) రచించిన సుప్రసిద్ధ నాటకం శ్రీకృష్ణ తులాభారం. దానినే ముమ్మారు
చలనచిత్రంగా రూపొందించారు. మూడవసారి సురేష్ నిర్మాణసంస్థ 1966 లో నిర్మించింది.
అందులో ఎక్కువగా సుబ్బారావుగారి పద్యాలను కొన్ని సముద్రాల పద్యాలను ఉపయోగించారు. మన తెలుగుగు భాషలోని పదాల పొందికను సామాన్యులకు పరిచయంచేసినది
చలనచిత్ర మాధ్యమం. ఈ కోవలోకి వచ్చేవి పౌరాణిక, జానపద చిత్రాలలో పద్యాలలో కూర్చబడిన
పదాలు. శ్రీకృష్ణ తులాభారం చిత్రానికి దేవేంద్రునికి శ్రీకృష్ణునికి పారిజాతవృక్షం
విషయంలో ఒకరినొకరు ఎత్తిపొడుపులతో భాషించే సంవాద పద్యాలలో సముద్రాల రాఘవాచార్యులు అనేక
పర్యాయపదాలు వాడారు. ఉదాహరణకు కృష్ణునికి వాసుదేవ, మురళీధర, ముకుంద, మురవైరి, గోపాల,
అలాగే ఇంద్రునికి వజ్రి, మఘవ, అమరేంద్ర, బిడౌజ, సురనాధ మొదలయినవి. ఈ సంవాద పద్యాలను
ఎస్.వరలక్ష్మి, ఘంటసాల, మాధవపెద్ది పాడారు. సంగీతం పెండ్యాల.
చిత్రం: | శ్రీకృష్ణ తులాభారం (1969) | |
రచన: | సముద్రాల రాఘవాచార్య | |
సంగీతం: | పెండ్యాల | |
గానం: | ఘంటసాల, మాధవపెద్ది, ఎస్.వరలక్ష్మి |
Video Courtesy: Sri Nukala Prabhakar garu (Ghantasala Gaana Charita)
ఎస్.వర: | విభుడునీమాట జవదాట వెరచునంచు మురిసిపోకుము | |
కల్పకభూమి రుహము కర్మభూమికి తరలింపగలుగు ఫలము | ||
అనుభవింతువు నీవు అవశ్యముగ మగువా! | ||
మా: | గొల్లగొట్టియలతో గొట్టికాయలు కావు | |
వజ్రితో సమరంబు వాసుదేవ | ||
ఘం: | గోవర్ధనంబెత్తి కొనగోట నిల్పిన | |
మురళీధరునితోడి పోరు మఘవ | ||
మా: | అతివల వస్త్రమ్ములపహరించుటగాదు | |
అమరేంద్రుతోడ కయ్యము ముకుంద | ||
ఘం: | మునికాంతకై పోయి తనువెల్ల కళ్ళుగా | |
తిరిగెడు ఘనత నీదే బిడౌజ | ||
మా: | పాలీయవచ్చిన పడతి జంపుటగాదు | |
సురనాధుతోడి సంగరం కృష్ణ | ||
ఘం: | నరకాది దుష్టదానవవినాశకుడైన | |
మురవైరి శక్తిని మరువకింద్ర | ||
మా: | చాలు గోపాల ఈ సరసాలు మాని | |
చేవగలిగిన శస్త్రము చేతగొనుము | ||
ఘం: | ఔర అంతటి సమరాభిలాషయున్న | |
నీదు ముచ్చట చెల్లింతు నేను రమ్మా |