1961 సంవత్సరంలోవిడుదలైనవిశ్వశాంతిపిక్చర్స్సంస్థనిర్మించినవిప్లవస్త్రీ (డ) అనే అనువాద చిత్రంనుండిఘంటసాలమాస్టారుపి.సుశీలతోపాడిన "కనువిందుకలిగించుపరువం" అనేఈయుగళగీతంరచనసముద్రాలజూ., స్వరపరచినదిపామర్తి. ఈచిత్రంలోతారాగణంఆనందన్, ఎం. ఆర్. రాధ,దేవర్,పుష్పలత,పండరీబాయి,లలిత,రాజకుమారి. ఈచిత్రానికినిర్మాతయు.విశ్వేశ్వరరావుమరియుదర్శకుడుఎం.ఏ.తిరుముగం. ఈ చిత్రానికి త.మిళ మాతృక "కొంగునాట్టు తంగం".
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
1962 సంవత్సరంలో విడుదలైన
అలంకార్ ఫిలింస్ సంస్థ నిర్మించిన “శ్రీశైల మహత్యం” అనువాద చిత్రం నుండి ఘంటసాల-బృందం
పాడిన “మానవా నీకిదే అమృతమౌర” అనే ఈ బృందగీతం రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి, స్వరపరచినది పామర్తి. ఈ చిత్రంలో తారాగణం రాజకుమార్,సంధ్య,కృష్ణకుమారి,మాధవరావు.
ఈ చిత్రానికి నిర్మాత బి.యన్.స్వామి మరియు దర్శకుడు అరూర్ పట్టాభి.
1964 సంవత్సరంలో విడుదలైన నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన "బభ్రువాహన" చిత్రం నుండి ఘంటసాల మాస్టారు ఎస్.వరలక్ష్మితో పాడిన “నీ సరి మనోహరి” అనే ఈ యుగళగీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది పామర్తి. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు,
కాంతారావు, ఎస్.వరలక్ష్మి, చలం, ఎల్. విజయలక్ష్మి.
1964 సంవత్సరంలో విడుదలైన
నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన బభ్రువాహన చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీలతో
పాడిన నిన్నే నిన్నే చెలి నిలునిలుమా అనే ఈ యుగళగీతంరచన సముద్రాల సీ., స్వరపరచినదిపామర్తి. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు,
కాంతారావు, ఎస్.వరలక్ష్మి, చలం, ఎల్. విజయలక్ష్మి.
ప్రముఖ దర్శకులు పి. పుల్లయ్య వద్ద సహాయకునిగా పనిచేసిన యు.విశ్వేశ్వరరావు "విశ్వ శాంతి" అనే ప్రతిష్టాత్మకమైన చిత్రనిర్మాణ సంస్థ స్థాపించి మొదట అనేక తెలుగు, తమిళ డబ్బింగ్ చిత్రాలు నిర్మించారు. తదుపరి కాలంలో ఆయన నిర్మించిన నేరు చిత్రాలైన "కంచుకోట", "నిలువుదోపిడి", "పెత్తందార్లు", "దేశోద్ధారకులు" ద్వారా నిర్మాతగా స్థిరపడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు "తీర్పు", "మార్పు", "నగ్న సత్యం", "హరిశ్చంద్రుడు", "కీర్తి కాంత కనకం" చిత్రాలు సంచలనం సృష్టించాయి. అందులో "నగ్న సత్యం", "హరిశ్చంద్రుడు" చిత్రాలకు ఫిలిం ఫేర్ పురస్కారాలు రాగా, "కీర్తి కాంత కనకం" చిత్రానికి దర్శకునిగా, "పెళ్ళిళ్ళ చదరంగం" చిత్రానికి స్క్రీన్ ప్లే రచయితగా నంది పురస్కారాలు లభించాయి. 1962 లో నిర్మించబడిన డబ్బింగ్ చిత్రం "దశావతారములు". ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు నాలుగు పాటలు పాడారు. వాటిలో ఒక పాట మాత్రమే దొరికింది. అది "జయహే! మాధవా". గీత రచన సముద్రాల రాఘవాచార్యులు. ఈ పాటలో సముద్రాల వారు దశావతారాలను సంక్షిప్తంగా, సులభమైన, సరళమైన పదాలతో చక్కగా వివరించారు. అంతేకాక చిత్ర నిర్మాణ సంస్థ పేరును ఆఖరి చరణంలో అద్భుతంగా కూర్చారు. సంగీతం పామర్తి. ఈ చిత్రం మార్చ్ 28, 1962 లో విడుదలయింది. ఇందులో నటీనటులు రాజకుమార్, ఉదయ్‌కుమార్,రాజశ్రీ, ఆదోని లక్ష్మి. అలభ్యమైన దృశ్యఖండికకు బదులుగా శ్రీ రాజశేక్షర్ రాజు గారు చక్కని దశావతారాల చిత్రాలను దృశ్యనేపథ్యంలో అద్భుతంగా పొందుపరచారు.
నిర్మాణం:
విశ్వశాంతి పిక్చర్సు
వారి
చిత్రం:
దశావతారములు (డబ్బింగ్) 1962
రచన:
సముద్రాల సీనియర్
సంగీతం:
పామర్తి
గానం:
ఘంటసాల
పల్లవి:
జయహే! మాధవా! -2
సాధులోక పరిపాలన దీనా-2
జయహే! మాధవా!
చరణం:
సోమకహర మీనావతారా!
మందరగిరిధర కూర్మావతారా!
ధరణీసుందర ఆదివరాహా!
ప్రహ్లాదవరద నరసింహా..ఆ..
జయహే! మాధవా!
చరణం:
మాటను దాటని బలిని మెచ్చుకుని
కోటను దాటే వామనరూపా!
పగకు పగే తగు దండనగా..ఆ..ఆ..
పగకు పగే తగు దండనగా
రాజులనణచిన భృగురామా!
చరణం:
తండ్రియాన జవదాటగ నొల్లని
ధర్మపాలనా రఘురామా.ఆ!
తండ్రియాన జవదాటగ నొల్లని
ధర్మపాలనా రఘురామా.ఆ!
ప్రేమికి, జ్ఞానికి భేదము లేదని -2
బోధించిన గోపాలబాల
చరణం:
శోకమయమ్మగు లోకములోన
శాంతిని నిలిపిన సిద్ధార్థా..ఆ.
శోకమయమ్మగు లోకములోన
శాంతిని నిలిపిన సిద్ధార్థా..
విశ్వశాంతికై స్వార్థజీవుల -2
దునిమే కల్కి అవతా..రా..
కృతజ్ఞతలు: ఈ ఆడియో-వీడియో ఖండికను యు ట్యూబ్ లో పొందుపరచిన శ్రీ రాజశేఖర్ రాజు గారికి ధన్యవాదాలు. చిత్రం వివరాలు పొందుపరచిన ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి బ్లాగు నిర్వాహకులు శ్రీ కొల్లూరు భాస్కర రావు గారికి కృతజ్ఞతలు.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com