శ్రీశ్రీ తను వ్రాసిన "ప్రేమయే జనన మరణ లీలా/ మృత్యుపాశమే అమరబంధమా/ యువ ప్రాణుల మ్రోలా...అనే పాట గురించి శ్రీశ్రీ యిలా గుర్తు చేసుకున్నారు - "సినిమాకు నేను రాసిన పాటలన్నింటిలోనూ యిది మొట్టమొదటిది. ట్యూన్కి మాత్రమే కాక పెదవుల కదలికకు కూడా సరిపోయే విధంగా ‘నీరా ఔర్ నందా’ అనే హిందీ చిత్రానికి రాసిన డబ్బింగ్ పాట యిది...
ఆహుతిలోని పాటలన్నీ బాగున్నాయంటే అందుకు సాలూరు రాజేశ్వరరావు సంగీతం గొప్పగా తోడ్పడిందని చెప్పక తప్పదు. హిందీ ఒరిజనల్లోని ట్యూన్లంటినీ అతడు పూర్తిగా మార్చి తన సొంతముద్ర వేశాడు. సినిమాకు పాటలు రాయడం చాలా మంది అజ్ఞానులనుకునేటంత సులభం కాదు. ఇక డబ్బింగ్కు రాయడమనేది మరీ కష్టంతో కూడుకున్న పని. ఉదాహరణకు ‘ప్రేమయే’ అన్న పాటనే తీసుకుందాం. హిందీలో దీని పల్లవి ‘ప్రేమ్ హై జనమ్ మరణ్ - కా ఖేల్’. ఇందులోని ఆఖరి ‘కాఖేల్’ చాలా ఇబ్బంది పెట్టింది. ‘ప్రేమయే జనన మరణ హేల’ అని రాశాను. కాని ‘లీల’ మాట మొదట్లో స్ఫురించలేదు. ఆ రాత్రి కలత నిద్రలో రాజేశ్వరరావు ట్యూను మననం చేసుకొంటూవుంటే ప్రేమయే జనన మరణలీల’ అనే పల్లవి దొరికింది. మర్నాడు పాటంతా పూర్తి చేశాను." పాటను అమర గాయకుడు ఘంటసాల మరియు లలిత సంగీత సామ్రాజ్ఞి రావు బాలసరస్వతి గానం చేసారు. ఈ చిత్రానికి సంగీత సారధి ర'సాలూరు రాజేశ్వర రావు.
| చిత్రం: | ఆహుతి (1950) | |
| సంగీతం: | సాలూరు రాజేశ్వర రావు | |
| గానం: | ఘంటసాల, రావు బాలసరస్వతి | |
| రచన: | శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) |
| ప: | ఘం: | జనన మరణలీల, ప్రేమయే |
| జనన మరణ లీల | ||
| మృత్యుపాశమే అమర బంధమౌ -2 | ||
| యువప్రాణుల మ్రోలా..ఆ..ఆ..-2 | ||
| ప్రేమయే జనన మరణ లీల -2 | ||
| చ: | ఘం: | తనుసామ్రాజ్యము స్మృతియే కాదా |
| తనుసామ్రాజ్యము స్మృతియే కాదా | ||
| నిలచు దృఢముగా మానసగాధ -2 | ||
| ఇ: | మృత్యుపాశమే | |
| బా: | అమర బంధమౌ | |
| మృత్యుపాశమే అమర బంధమౌ | ||
| యువప్రాణుల మ్రోలా | ||
| ప్రేమయే జనన మరణ లీల -2 | ||
| లీలా.. |
Thanks to GVS Sastry garu for the audio clip loaded to You Tube.



