1952 లో పి. భానుమతి మరియు ఎ.నాగేశ్వరరావు నాయికా నాయకులు గా నటించిన భరణీ సంస్థ నిర్మించిన చిత్రం "ప్రేమ". ఈ చిత్రానికి తన తొలి ప్రయత్నంగా కథ సమకూర్చినది భానుమతీ రామకృష్ణ. అయితే ఇదివరలో వారు తీసిన లైలా మజ్ను చిత్రపు కథనే రొమాంటిక్ ట్రాజెడీగా అదే ప్రధాన నటులతో "ప్రేమ" చిత్రంగా నిర్మించినా అది విజయవంతం కాలేదు. అయితే సంగీత దర్శకులు సి. ఆర్. సుబ్బురామన్ బాణీలు బాగా పాపులర్ అయ్యాయి. చిత్రమేమిటంటే సుబ్బురామన్ మాస్టారితో 'స్వప్నసుందరి' లో పాడించిన తరువాత 'ప్రేమ' చిత్రానికి స్వరసారధ్యం వహించేలోగా అర డజను చిత్రాలు చేసినా ఎందుకో ఘంటసాలతో పాడించలేదు. 'ప్రేమ' చిత్రానికి మాస్టారు మూడు పాటలు పాడారు. అవి దివ్య ప్రేమకు సాటియౌనే, రోజుకు రోజు మరింత మోజు, నా ప్రేమ నావ. పాటలు వ్రాసినది కొండముది గోపాలరాయ శర్మ. ముక్కామల, సి. యస్. ఆర్. ఆంజనేయులు, రేలంగి, శ్రీరంజని తదితర నటీనటులు.
కృతజ్ఞతలు: ఈ చిత్రపు సినిమా పోస్టరును పొందుపరచిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి ధన్యవాదాలు.
చిత్రం: | ప్రేమ (1952) | ||
రచన: | కొండముది గోపాలరాయ శర్మ | ||
సంగీతం: | సి. ఆర్. సుబ్బురామన్ | ||
గానం: | ఘంటసాల, భానుమతి | ||
పల్లవి: | ఘంటసాల: | దివ్యప్రేమకు సాటి ఔనే, స్వర్గమేయైనా | |
వెన్నెల మెచ్చీ యిచ్చే దీవెన | |||
భానుమతి: | దివ్యప్రేమకు సాటి ఔనే, స్వర్గమేయైనా | ||
వెన్నెల మెచ్చీ యిచ్చే దీవెన | |||
చరణం: | ఘంటసాల: | వినిపించును వేయీ ప్రేమగీతాలీ రేయి -2 | |
భానుమతి: | మనసే లయగా..ఆ.. పాడేనోయి -2 | ||
దివ్యప్రేమకు సాటి ఔనే, స్వర్గమేయైనా | |||
వెన్నెల మెచ్చీ యిచ్చే దీవెన | |||
చరణం: | ఘంటసాల: | మాయామర్మము లేని సీమ సెలయేరే ప్రేమ | |
ఇదే శాశ్వతమే ఈ సుఖమే | | మాయా| | ||
చిరుమబ్బుల లీలా ఐక్యమౌదామీవేళా -2 | |||
స్వరరాగములై విహరిద్దామే -2 | |||
ఏ...దివ్యప్రేమకు సాటి ఔనే, స్వర్గమేయైనా | |||
వెన్నెల మెచ్చీ యిచ్చే దీవెన | |||
చరణం: | భానుమతి: | నిన్నే నమ్మినదాననోయి నీ రాణీ నోయి | |
ఇదో నీ వశమే నా మనసే | | నిన్నే| | ||
కనుమూసితి నేనే చూతునోయి నీ రూపే -2 | |||
కలలే నిజమాయే బ్రతుకే హాయీ -2 | |||
ఇద్దరు: | దివ్యప్రేమకు సాటి ఔనే, స్వర్గమేయైనా | ||
వెన్నెల మెచ్చీ యిచ్చే దీవెన |
కృతజ్ఞతలు: ఈ చిత్రపు సినిమా పోస్టరును పొందుపరచిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి ధన్యవాదాలు.