1953 సంవత్సరంలో
విడుదలైన ప్రసాద్ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన పెంపుడు కొడుకు చిత్రం నుండి
ఘంటసాలజిక్కీ తో పాడిన "మబ్బులు మబ్బులు" అనే ఈ యుగళగీతం రచన
సదాశివబ్రహ్మం, స్వరపరచినది సాలూరురాజేశ్వరరావు. ఈ చిత్రంలో తారాగణం ఎల్.వి.ప్రసాద్, పుష్పవల్లి, సావిత్రి, కందా మోహన్‌బాబు,
శివాజీ గణేశన్ . ఈ చిత్రానికి నిర్మాత
ఎ.వి.సుబ్బారావు మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని శ్రీరామమూర్తి, సావిత్రి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 12.11.1953 న విడుదలైంది.
~ చిత్రం వివరాలు ~
చిత్రం#
విడుదల
నిర్మాణం
చిత్రం
సంగీతం
నిర్మాత
దర్శకుడు
41
12.11.1953
ప్రసాద్ ఆర్ట్స్
పెంపుడు కొడుకు
సాలూరు
ఎ.వి.సుబ్బారావు
ఎల్.వి.ప్రసాద్
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
1950 సంవత్సరంలో విడుదలైన అశోకా పిక్చర్స్ సంస్థ నిర్మించిన వాలి సుగ్రీవ చిత్రం నుండి ఘంటసాల, ఎస్.వరలక్ష్మి తో పాడిన "కళావిలాసము ప్రేమే" అనే ఈ యుగళగీతం రచన జంపన, స్వరపరచినది సాలూరు రాజేశ్వరరావు. ఈ చిత్రంలో తారాగణం సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, రాజారావు, సదాశివరావు, ఎ.వి.సుబ్బారావు, రేలంగి, ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి, శ్రీరంజని, బాలసరస్వతి . ఈ చిత్రానికి నిర్మాత ఎస్.భావనారాయణ మరియు దర్శకుడు జంపన. ఈ చిత్రం 19.01.1950 న విడుదలైంది.
ఈ పాట అలభ్యం.
కృతజ్ఞతలుః ఈ పాట సాహిత్యాన్ని తను ప్రచురించిన "శతాబ్దిగాయకుడు ఘంటసాల" పుస్తకంలో పొందుపరచిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి ధన్యవాదాలు.
1968 సంవత్సరంలో విడుదలైన మహీజా ఫిలింస్ సంస్థ నిర్మించిన వీరాంజనేయ చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పాడిన “నయనాభి రామా నా తండ్రి రామా” అనే ఈ ఏకగళగీతం రచన డా.సినారె, స్వరపరచినది సాలూరు రాజేశ్వరరావు. ఈ చిత్రంలో తారాగణం అర్జా జనార్ధనరావు, ఎస్.వి. రంగారావు,కాంతారావు, అంజలీదేవి, జి.వరలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత సి.హెచ్.ప్రకాశరావు మరియు దర్శకుడు కమలాకర.కామేశ్వర రావు.
1961 సంవత్సరంలో విడుదలైన
అన్నపూర్ణా సంస్థ నిర్మించిన ఇద్దరు మిత్రులు చిత్రం నుండి ఘంటసాల-పి.సుశీల పాడిన ‘ఖుషీ
ఖషీగా నవ్వుతూ’అనే ఈ యుగళగీతం రచన దాశరధి,
స్వరపరచినదిసాలూరు రాజేశ్వరరావు. ఈ చిత్రంలో
తారాగణం అక్కినేని, రాజసులోచన, ఇ.వి. సరోజ, గుమ్మడి, పద్మనాభం, శారద.
1951 సంవత్సరంలో విడుదలైన వాహినీ సంస్థ నిర్మించిన మల్లీశ్వరి చిత్రం నుండి ఘంటసాలపి.భానుమతి తో పాడిన "పరుగులుతీయాలి ఒ గిత్తలు" అనే ఈ యుగళగీతం రచన దేవులపల్లి, స్వరపరచినది ఎస్.రాజేశ్వరరావు. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, పి.భానుమతి, శ్రీవాత్సవ, సురభి కమలాబాయి, న్యాయపతి రాఘవరావు. ఈ చిత్రానికి నిర్మాత బి.ఎన్.రెడ్డి మరియు దర్శకుడు బి.ఎన్.రెడ్డి. దీనిని ఎన్.టి.ఆర్., భానుమతి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 20.12.1951 న విడుదలైంది.
అష్టవసువులు ఒకసారి వారిలో ద్యు అనే వాడి ప్రోద్బలంతో వశిష్ట ముని ఆశ్రమములోని కామధేనువును అపహరిస్తారు. ఆ ముని ఉగ్రుడై ఆ ఎనమండుగురిని భూలోకంలో జన్మించమని శపిస్తాడు.ద్యు తప్ప మిగిలిన వారు ముని కాళ్ళపై పడి క్షమాపణకోరి శాపం ఉపసంహరించమని ప్రార్థిస్తారు. అయితే సహాయంచేసిన ఏడుగురు వసువులు భూమిపై స్వల్పకాలం జీవిస్తారని, ఎనిమిదవ వసువు మాత్రం చిరకాలం భూమిపై జీవిస్తాడని మహర్షి చెబుతాడు. అదే సమయంలో బ్రహ్మలోకంలో బ్రహ్మ సృష్టించిన గంగను నిండుసభలో మహాభిషుడనే రాజు చూస్తాడు. పరస్పరం మోహంలో పడి సభామర్యాదను మరచిపోతారు. అందుకు బ్రహ్మ కోపంతో వారిద్దరినీ భూలోకంలో జన్మించమని శాపం ఇస్తాడు. గంగ భూలోకం వస్తుండగా అష్టవసువులు ఎదురై వారికి శాపవిమోచనం కలిగించమని గంగను వేడుకుంటారు. మహాభిషుడు శంతనుడిగా పుట్టి గంగను వివాహం చేసుకుంటాడు. అయితే తను చేసే ఏ పనికైనా అభ్యంతరం చెబితే శంతనుని విడిచి వెళ్ళిపోతానని గంగ శంతనుతో వాగ్దానం చేయిస్తుంది. వారికి పుట్టిన ఏడుగురు మగపిల్లలను గంగ నదిలో ముంచి చంపి వారికి శాపవిముక్తి కలిగిస్తుంది. అయితే ఎనిమిదవ పుత్రుడ్ని కూడ నదిలో పడవేయబోతుండగా శంతనుడు అడ్డు పడతాడు. అపుడు గంగ శంతనుని విడిచి పుత్రునితో వెళ్ళిపోతుంది. అతనిని పెంచి విద్యలు నేర్పి శంతనుని వద్దకు చేరుస్తుంది. అతడే గాంగేయుడు. తన తండ్రి శంతనుడు దాసరాజు కూతురు మత్స్యగంధిని పెళ్ళిచేసుకోవడానికి అనుకూలంగా తాను ఆజన్మ బ్రహ్మచారిగా వుంటానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయాడు.
'లవకుశ ఫేం' శంకర రెడ్డి గారు లలితా ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం మీద టి.ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం చరణదాసి. ఇది విశ్వకవి రవీంద్రనాథ టాగోర్ రచించిన 'ది రెక్' అను ఆంగ్ల నవల ఆదారంగా తీసిన చిత్రం. ముఖ్యంగా ఇది హేమాహేమీలైన ఎ.ఎన్.ఆర్., ఎన్.టి.ఆర్., ఎస్.వి.ఆర్., సావిత్రి, అంజలీదేవి నటించిన మల్టీస్టారర్ చిత్రం. ఈ చిత్రంలో తొలిసారిగా ఎన్.టి.ఆర్. రామునిగా మరియు అంజలీదేవి సీతగా నటించారు. వారి జంటను చూసి మురిసిపోయిన శంకర్ రెడ్డి గారు వారిరువురితో తదుపరి "లవకుశ" చిత్రం నిర్మించారు. శ్రీ సీనియర్ సముద్రాల వారు "సీత అగ్ని ప్రవేశము" మరియు "స్వప్న వాసవదత్త" అనే అంతర్నాటకాలను కలిపి ఈ చిత్రానికి తొమ్మిది పాటలు వ్రాసారు. సముద్రాల వారు రచనలలో ఘంటసాల మాస్టారు ఒక పద్యాన్ని, పి.సుశీల మరియు పి.లీలలతో కలసి చెరొక యుగళ గీతం పాడారు. ఇక్కడ సుశీల తో పాడిన మురిసేను లోకాలు కనుమా అనే యుగళ గీతం పొందుపరుస్తున్నాను.
రిపబ్లిక్ సంస్థ 1967 లో నిర్మించిన "రక్త సిందూరం" చిత్రం నుండి ఘంటసాల, పి.సుశీల పాడిన పాట. గీత రచన మహాకవి శ్రీ శ్రీ. సంగీతం సాలూరు రాజేశ్వర రావు. ఇందులో శోభన్ బాబు, రాజశ్రీ, రామకృష్ణ, గీతాంజలి, విజయలలిత ముఖ్య తారాగణం. దర్శకత్వం సీతారాం.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com