జానపద బ్రహ్మ శ్రీ బి. విఠలాచార్య దర్శకత్వంలో కృష్ణ కుమారి గారు, రామారావు గారు నాయకీ నాయకులుగా నటించిన చిత్రం "బందిపోటు". ఈ చిత్రానికి మాస్టారు సంగీత దర్శకత్వం వహించారు. శ్రీ ఆరుద్ర గారి గీతాన్ని భావాన్నెరిగి రాగం నిర్ణయించడంలో తనకు తానే సాటియైన ఘంటసాల మాస్టారు, ఈ పాటకు గాను ఎన్నుకున్న రాగం "రసిక ప్రియ". రాగం పేరు వింటేనే ఎంత రసికతగా ఉంటుందో ఊహించగలము. అంతేకాక పాట నేపథ్యంలో "చిటికెల" చప్పుడు వంటి వాయిద్యాన్ని వాడటం ఈ పాటకు మరింత అందాన్నిచ్చింది. శ్రీమతి పి.సుశీల గారితో ఘంటసాలగారు పాడిన ఈ పాట ఆల్ టైం సూపర్ హిట్ సాంగ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇదే పాటను మాస్టారి రెండవ కుమారుడైన రత్నకుమార్ గారు, రోజా కలసి మణిశర్మ గారి సంగీతంలో రీ-మిక్సింగ్ చేసి కోతిమూక (2010) అనే చిత్రంలో పాడారు. గాన కోకిల, పద్మ భూషణ్, శ్రీమతి పి.సుశీల గారికి జన్మదిన శుభాకాంక్షలతోఈ పాటను సాహిత్యం, ఆడియో మరియు వీడియో తో ఇక్కడ పొందు పరుస్తున్నాను. ఆడియో లో పాట ముందు వచ్చే హమ్మింగ్ తో కలసి సంపూర్ణంగా వుంది.
చిత్రం: బందిపోటు (1963)
రచన: ఆరుద్ర
సంగీతం: ఘంటసాల
రాగం: రసిక ప్రియ
గానం: ఘంటసాల, పి.సుశీల
Thanks to Deva7997 for up loading the video to You Tube
చిత్రం: బందిపోటు (1963)
రచన: ఆరుద్ర
సంగీతం: ఘంటసాల
రాగం: రసిక ప్రియ
గానం: ఘంటసాల, పి.సుశీల
సుశీల: ఊహూహూ..ఉ.ఉ.ఊ...ఉ.ఉ.ఊ..ఊ.ఊ.ఊ.
ఘంటసాల: ఊహూహూ...ఉ.ఉ.ఉ.ఉ....ఉ.ఉ.ఉ.ఉ...ఊ.ఉ
సుశీల: ఊహలు గుసగుసలాడె నా హృదయము ఊగిసలాడె
ప్రియా!
ఘంటసాల: ఊ..
సుశీల: ఊహలు గుసగుసలాడె నా హృదయము ఊగిసలాడె
సుశీల: వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
ఘంటసాల: తొలి ప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు
ఊహలు గుసగుసలాడె నా హృదయము ఊగిసలాడె
ఘంటసాల: నను కోరి చేరిన బేల, దూరాన నిలిచేవేల
నను కోరి చేరిన బేల, దూరాన నిలిచేవేల
సుశీల: నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడ
ఊహలు గుసగుసలాడె నా హృదయము ఊగిసలాడె
సుశీల: దివి మల్లె పందిరి వేసె
ఘంటసాల: భువి పెళ్ళి పీటను వేసె
సుశీల: దివి మల్లె పందిరి వేసె
ఘంటసాల: భువి పెళ్ళి పీటను వేసె
ఇద్దరు: నెర వెన్నెల కురిపించుచు నెలరాజు పెండ్లిని చేసె
ఊహలు గుసగుసలాడె మన హృదయములూయలలూగె
ఉహుహూహుహు..
ఉహుహూహుహు..
ఉహుహూహుహు..