యన్టీఆర్
'అర్జునుడి'గా ఐదు చిత్రాలలో నటించారు. అవి 'జయసింహ' (స్వప్న దృశ్యంలో), 'నర్తనశాల', 'బభ్రువాహన', 'ప్రమీలార్జునీయం' మరియు 'శ్రీమద్విరాటపర్వము'. ప్రమీలార్జునీయం చిత్రానికి అలనాటి ప్రముఖ చలన చిత్ర నటిసీనియర్శ్రీరంజని
కుమారుడైన మల్లికార్జునరావుదర్శకుడిగాపరిచయమయ్యారు. కురుక్షేత్ర యుద్ధానంతరం బంధుమిత్ర సంహారం వలన సంక్రమించిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసం అశ్వమేథ యాగాన్ని తలపెడతాడు అజాతశత్రువుగా వాసికెక్కినధర్మరాజు. యాగాశ్వాన్ని రక్షిస్తూ వెళ్లి అర్జునుడుస్త్రీమండలమైనప్రమీలారాజ్యంలో చేరుకుంటాడు. అక్కడ ప్రమీలకు అర్జునునకు మధ్యవైరం ఏర్పడి క్రమేపి అది
అనురాగంగామారి, కడకు ఇరువురి కళ్యాణం జరిగి కథసుఖాంతం అవుతుంది. ఈ చిత్రానికి నిర్మాత కందిమళ్ల ఆదిబాబు.
చిత్రం: ప్రమీలార్జునీయం (1965)
రచన: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు నటీ నటులు: ఎన్.టి.ఆర్, బి.సరోజ, కాంతారావు
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com