అయోధ్యకు రాజైన అంబరీషుడు విష్ణు భక్తుడు. శ్రీహరి కృపాకటాక్షంతో లభించిన శ్రీవారి సుదర్శన చక్రాన్ని తన పూజా మందిరంలో నెలకొల్పి నిత్యపూజలు చేస్తుంటాడు. కులగురువు సలహాపై ద్వాదశ వ్రతము నిష్టతో ఆచరిస్తుంటాడు. వ్రత సమయంలో ఏకాదశినాడు ఉపవసించి ద్వాదశ ఘడియలు ప్రారంభమయే తరుణంలో ఆహారం సేవించాలి. అయితే ఆఖరి ఏకాదశి నాడు ముక్కోపిగా ప్రసిద్ధి చెందిన దూర్వాస మహర్షి అంబరీషుని రాజ్యానికి వస్తాడు. రాజు కోరిక మీద ఆతిధ్యం స్వీకరిస్తానని స్నానార్ధం వెళ్లి ఎంతసేపటికీ తిరిగి రాడు. గురువు సలహా పై వ్రత ఫలితం పోకుండా కేవలము మంత్రజలము స్వీకరిస్తాడు అంబరీషుడు. అప్పుడే అక్కడకు వచ్చిన దూర్వాసుడు కోపంతో అంబరీషుని శపించబోగా, పూజా మందిరంలోని సుదర్శన చక్రం అడ్డుకుని దూర్వాసుని వెంబడిస్తుంది. మునిని త్రిమూర్తులు సైతం కాపాడ లేక పోతారు. విష్ణువు సలహాపై దూర్వాసుడు అంబరీషుని శరణు కోరుతాడు. దీనివలన విష్ణువును సేవించిన భక్తులను ఆ మురారి ఎప్పుడూ కాపాడుతాడు అన్నది సారాంశం. ఈ చిత్రంలో "శ్రీహరి కేశవ నామా" పాటలో "మధురిపు" అన్నపదం వాడారు కవి ఆరుద్ర గారు. రిపు అంటే శత్రువు, మధు అన్నవాడు ఒక రాక్షసుడు.  నిజానికి శ్రీహరి నిద్రిస్తుండగా అతని చెవి గులిమి (ear wax) నుండి మధు, కైటభ అను ఇద్దరు రాక్షసులు పుడతారు.  మాస్టారు పాడిన 'ప్రభాతి'లో "మధుకైటభారి (మధు కైటభ + అరి) శ్రీహరి ప్రక్కనుండి ఎల్ల లోకములగన్న మా తల్లీ లక్ష్మీ" అని వినే వుంటారు. అరి అంటే శత్రువు. మాస్టారు పాడిన శ్లోకం, పాట మరియు శ్రీమతి ఉడతా సరోజిని గారు పాడిన శ్లోకం యొక్క దృశ్య, సాహిత్యాలను ఇక్కడ పొందు పరుస్తున్నాను.       .
Thanks to kumarr116 for posting the video to You Tube
| నిర్మాణం: | శ్రీరామా పిక్చర్స్ | |||
|---|---|---|---|---|
| చిత్రం: | భక్త అంబరీష (1966) | |||
| సంగీతం: | ఎల్. మల్లేశ్వర రావు | |||
| రచన: | ఆరుద్ర | |||
| గానం: | ఘంటసాల, ఉడతా సరోజిని , బృందం | |||
| ఘంటసాల: | ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. | |||
| శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం | ||||
| బృందం: | హరి ఓమ్ | |||
| ఘంటసాల: | విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం | |||
| లక్ష్మీకాంతం కమలనయనం | ||||
| బృందం: | హరి ఓమ్ | |||
| యోగి హృద్యాన గమ్యం | ||||
| వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం | ||||
| బృందం: | హరి ఓమ్ | |||
| సరోజిని: | ఆ..ఆ..ఆ..ఆ | |||
| లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం | ||||
| దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం | ||||
| శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం | ||||
| త్వాం త్రైలోక కుటుంబినీం సరసిజాం | ||||
| వందే..వందే..వందే.. ముకుంద ప్రియాం | ||||
| ఘంటసాల: | శ్రీహరి కేశవ నామా (2) | |||
| మధురిపు తారక నామా.. | ||||
| శ్రీహరి కేశవ నామా | ||||
| ఘంటసాల: | మాధవ నిన్నే మదిలో తలచి | | మాధవ | | ||
| కాననలోనా కాపురమున్నా | కానలలోనా | | |||
| కొలిచెడి వారికి కొరతేమి రాదు | | కొలిచెడి | | |||
| ఖేదములేవీ రానే రావు | | ఖేదములేవీ | | |||
| కోరిన వరములనన్నీ.. | ||||
| ఒసగెడి వాడవు కావా | ||||
| శ్రీహరి కేశవ నామా (2) | ||||
| దారుణమైనా..ఆ..ఆ.. | ||||
| దారుణమైనా తాపమునైనా | ||||
| దునిమెడి బాణము నీ తిరునామమే | దునిమెడి | | ||||
| భాగ్యములందు పెనుబాధలందు| భాగ్యము | | ||||
| దాసుల నీవు వీడవు స్వామీ| దాసుల | | ||||
| నీ శుభ పదముల సేవా.. | ||||
| కవచము వంటిది కాదా | ||||
| శ్రీహరి కేశవ నామా | ||||
| మధురిపు తారక నామా... | ||||
| బృందం: | శ్రీహరి కేశవ నామా (4) | |||
| త్వం పితా త్వం చమే మాతా | ||||
| త్వం బంధు త్వం చ దేవతా | ||||
| త్వమేవ గతి స్సర్వం | ||||
| త్వమేవ గురు దేవ దేవ | 


 
 


