ర-సినారె లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ర-సినారె లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, మార్చి 2024, శనివారం

ఇంతటి మొనగాడివని - కాంభోజరాజు కథ నుండి ఘంటసాల, సుశీల

1967 సంవత్సరంలో విడుదలైన అనంతలక్ష్మి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన కాంభోజరాజు కథ చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీల తో పాడిన ఇంతటి మొనగాడివని అనే ఈ యుగళం  రచన సినారె, స్వరపరచినది  టి.వి. రాజు. ఈ చిత్రంలో తారాగణం శోభన్‌బాబు, ఎల్. విజయలక్ష్మి, గుమ్మడి, రమణారెడ్డి,రాజశ్రీ, అంజలీదేవి. ఈ చిత్రానికి నిర్మాతలు  డి.భాస్కరరావు-కె.భానుప్రసాద్ మరియు దర్శకుడు కె.కామేశ్వరరావు.

 చిత్రం:కాంభోజరాజు కథ (1967) 
  నిర్మాణం:అనంతలక్ష్మీ ప్రొడక్షసన్స్ 
  రచన: సి. నారాయణరెడ్డి 
  పాడినవారు: ఘంటసాల, సుశీల 
  సంగీతం: టి.వి. రాజు 
  అభినయం: శోభన్ బాబు, రాజశ్రీ 
     
 ప.సు:ఇంతటి మొనగాడవనీ ఇపుడే తెలిసిందిలే 
   ఇపుడే తెలిసిందిలే 
  ఘ: ఎంతటి మోనగాడవో ఇపుడేం తెలిసిందిలే 
   ఇపుడేం తెలిసిందిలే 
 చ.సు: కన్నులు నిన్నుగని కలువలు ఆయెనూ 
   తలపులు నిన్నుగనీ అలలై పోయెనూ 
  ఘ: కన్నుల బాసలనూ కమ్మని ఆశలనూ 
   నిన్న తెలుసుకున్నాను 
   నేడు కలుసుకున్నాను॥ ఇంతటి||
 చ>సు: నున్నని బుగ్గలలో నిన్నే చూసుకో 
   మెత్తని సిగ్గులనే మెల్లగ దోచుకో 
  ఘ: బుగ్గన చిటికేసీ - సిగ్గుల తెరతీసీ 
   నిన్ను దోచుకుంటానే - నిజం తెలుసుకుంటానే 
  సు: ఇంతటి మొనగాడవనీ 
   ఇపుడే తెలిసిందిలే - ఇపుడే తెలిసిందిలే 
  ఘ: ఇంతటి నెఱజాణవని - ఎపుడో తెలిసిందిలే 
   ఎపుడో తెలిసిందిలే

24, జూన్ 2020, బుధవారం

నా మది పాడిన ఈ వేళలో - పవిత్ర హృదయాలు నుండి ఘంటసాల

పి.ఎస్.ఆర్. పిక్చర్సు పతాకం పై 1971 లో నిర్మించిన చిత్రం పవిత్ర హృదయాలు.  ఇందులో ఎన్‌.టి.ఆర్., జమున నటించారు.  ఈ చిత్రానికి సంగీతపరమైన ఒక పాటను పటదీప్ రాగం లో దర్శకులు టి.చలపతి రావు బాణీ కట్టారు.  

చిత్రం: పవిత్ర హృదయాలు (1971)
గీత రచన: డా.సి.నారాయణ రెడ్డి
స్వర కర్త: టి.చలపతి రావు
గానం: ఘంటసాల వేంకటేశ్వర రావు 





సిగ్గేస్తోందా .. మనుషులు మమతలు నుండి ఘంటసాల-సుశీల







చిత్రం: మనుషులు మమతలు (1965)

సంగీతం: టి. చలపతిరావు

రచన: డా.సి.నారాయణరెడ్డి 

గానం: ఘంటసాల, సుశీల

నిర్మాణం: ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ 



పల్లవి: సుశీల సిగ్గేస్తోందా..  సిగ్గేస్తోందా


మొగ్గలాటి చిన్నది బుగ్గమీద చిటికేస్తే హోయ్ 


సిగ్గేస్తోందా..  సిగ్గేస్తోందా


సిగ్గేస్తోందా.. నీకు సిగ్గేస్తోందా

ఘంటసాల: సిగ్గేస్తోంది.. సిగ్గేస్తోంది


సిగ్గేస్తోంది.. సిగ్గేస్తోంది


చిన్నవాడు అనుకున్నది చిన్నది చేసేస్తుంటే హొయ్ 


సిగ్గేస్తోంది సిగ్గేస్తోంది


సిగ్గేస్తోంది నాకు సిగ్గేస్తోంది
చరణం: సుశీల: నీడలో నిలచినా.. నీటిలో మునిగినా


తోడు నీవు లేనిదే వేడిగా ఉందిలే..


ఓ.. ఓ.. ఓ.. ఓ..


నీడలో నిలచినా.. నీటిలో మునిగినా


తోడు నీవు లేనిదే వేడిగా ఉందిలే

ఘంటసాల: నీడలో లేదులే నీటిలో లేదులే


నీడలో లేదులే నీటిలో లేదులే


అది నీ వయసులోని ఆరిపోని వేడిలే

సుశీల: వై.. వైవైవై ... 


సిగ్గేస్తోందా..  సిగ్గేస్తోందా


మొగ్గలాటి చిన్నది బుగ్గమీద చిటికేస్తే.. హొయ్..


సిగ్గేస్తోందా..  సిగ్గేస్తోందా


సిగ్గేస్తోందా నీకు సిగ్గేస్తోందా
చరణం: సుశీల: మత్తు గాలి వీచెను మనసు పూలు  పూచెను


రంగు రంగు ఊహలే పొంగులై లేచెను..


ఓ.. ఓ.. ఓ.. ఓ..


మత్తు గాలి వీచెను మనసు పూలు  పూచెను


రంగు రంగు ఊహలే పొంగులై లేచెను

ఘంటసాల: ఇలాటి వేళలో ఈ లేత గాలిలో


ఇలాటి వేళలో ఈ లేత గాలిలో


నీలోని పొంగులేవో నేను సైపలేనులే..

సుశీల: వై.. వైవైవై ... 


సిగ్గేస్తోందా..  సిగ్గేస్తోందా


మొగ్గలాటి చిన్నది బుగ్గమీద చిటికేస్తే.. హొయ్..


సిగ్గేస్తోందా..  సిగ్గేస్తోందా


సిగ్గేస్తోందా నీకు సిగ్గేస్తోందా

ఘంటసాల: సిగ్గేస్తోంది.. సిగ్గేస్తోంది


చిన్నవాడు అనుకున్నది చిన్నది చేసేస్తుంటే హొయ్ 


సిగ్గేస్తోంది సిగ్గేస్తోంది


నాకు సిగ్గేస్తోంది సిగ్గేస్తోంది

రెండు చందమామలు - భామావిజయం నుండి ఘంటసాల, శోభారాణి పాడిన యుగళగీతం







చిత్రం: భామావిజయం (1967)

రచన: డా.సి.నారాయణ రెడ్డి

సంగీతం: టి.వి.రాజు 

గానం: ఘంటసాల, శోభారాణి



పల్లవి: ఘంటసాల: రెండు చందమామలు ఈ రేయి వెలిగెనే

శోభారాణి: ఊ..ఏవీ?

ఘంటసాల: ఒకటి నీలి మొయిలులో -2


వేరొకటి మేలిముసుగులో


రెండు చందమామలు ఈ రేయి వెలిగెనే



చరణం: ఘంటసాల: ఓ జవ్వని! లోలోన ఏల నవ్వుకుందువే?


తలిరాకులలో అందమేల దాచుకొందువే?

శోభారాణి: ఊ..హు.. ఊ..హు..

ఘంటసాల: ఓ జవ్వని! లోలోన ఏల నవ్వుకుందువే?


తలిరాకులలో అందమేల దాచుకొందువే?


విరబూసిన పరువాలపు తెరచాటులేలనే?


రెండు చందమామలు ఈ రేయి వెలిగెనే



చరణం: శోభారాణి: నీ చూపులు నను సోకగ మనసోపనైతిని 


నీ చేతులు నను తాకగ వికసించిపోతిని 

ఘంటసాల: ఆహాహా.. ఓహో...ఊహు..

శోభారాణి: నీ చూపులు నను సోకగ మనసోపనైతిని 


నీ చేతులు నను తాకగ వికసించిపోతిని 


ఏ దేవుని దీవెనయో నీదాననైతిని

ఘంటసాల: రెండు చందమామలు ఈ రేయి వెలిగెనే


ఒకటి నీలి మొయిలులో, వేరొకటి మేలిముసుగులో


రెండు చందమామలు ఈ రేయి వెలిగెనే
Video Courtesy: Sri Nukala Prabhakar of Project Ghantasala

14, జూన్ 2020, ఆదివారం

"అందం కోసం పందెం" చిత్రం నుండి ఘంటసాల పద్యాలు

1971 లో విడుదలైన "అందం కోసం పందెం" చిత్రం కోసం డా. సి. నారాయణ రెడ్డి మరియ్ మహాకవి శ్రీశ్రీ వ్రాసిన పద్యాలకు సంగీత దర్శకులు ఎస్.పి. కోదండపాణి స్వరపరచగా ఘంటసాల మాస్టారు ఆలపించారు.





చిత్రం: అందం కోసం పందెం (1971)

రచన: సి.నారాయణ రెడ్డి

సంగీతం: ఎస్.పి. కోదండపాణి

గానం: ఘంటసాల




నందనము తలదన్ను మందారవనమందు


వెన్నెలలు విరజిమ్ము విరిమంటపము ముందు


జీవకళలొలికించు శిల్పసుందరివీవు


ఏ మధురకవి కల్పనామూర్తివో నీవు ఆ..





అంత సన్నని నడుము అలసిపోవునొ ఏమో


ఎంతసేపని అటులనే నిలిచిపోయేవూ


ముద్దులను గురిపించు ముఖచంద్రబింబమ్ము


మేలిముసుగున నీవు ఏలదాచేవూ?


ఓ శిల్పసుందరీ - ఓ.. నా మనోహరీ..





విరబూసెడు పువ్వులనెవ్వరు కాదనగలరూ?


రివ్వుమనెడి యవ్వనమునెవ్వరాపగలరూ?


కలుసుకొన్న నయనమ్ములు కలనైనా విడిపోవు


వలపులొలుకు హృదయాలే కలకాలం నిలచిపోవూ..


కలకాలం నిలచిపోవూ




రచన: శ్రీ శ్రీ


పదములు లేజివుళ్ళ చెలువమ్ముల సొమ్ముల కాలయమ్ములో


ముదిత పిరుందులందముల మూటలుకట్టెడు సైకతమ్ములో


వదనము పారిజాతమో సువాసనలీనెడు పారిజాతమో


మదనుని బంతియో, చెలియ మల్లెలదొంతియో, వైజయంతియో


ఆహా… వదనము వారిజాతమో

11, జనవరి 2018, గురువారం

సిగలోన విరిసిన సౌగంధికా - భీమాంజనేయ యుద్ధం నుండి ఘంటసాల, సుశీల






నిర్మాణం: మహాలక్ష్మీ మూవీస్ వారి

చిత్రం: భీమాంజనేయ యుద్ధం (1961)

రచన: డా. సి. నారాయణ రెడ్డి 

సంగీతం: టి.వి.రాజు

గానం: ఘంటసాల, పి.సుశీల



పల్లవి: ఘంటసాల: సిగలోన విరిసిన సౌగంధికా చెలికింత తొందరయేల..ఆ.. 


సిగలోన విరిసిన సౌగంధికా చెలికింత తొందరయేల 

సుశీల: సిగలోన విరిసిన సౌగంధికా చెలి జాగుచేయుట మేలా?


సిగలోన విరిసిన సౌగంధికా చెలి జాగుచేయుట మేలా?



చరణం: ఘంటసాల: పసిడి కిరణములు మెరిసే వేళ -2 


మిసిమి కోరికలు ఎగిసే వేళా..-2


మదిలో మరులేవొ కదిలే యీ వేళా -2


మాటైన కరువాయెనా..ఆ.. మాటైన కరువాయెనా


సిగలోన విరిసిన సౌగంధికా చెలికింత తొందరయేల..ఆ.. 



చరణం: సుశీల: తనువు కోవెలగ వెలసిన వేళ - 2


ప్రణయవేదములు పలికే వేళా-2


మదిలో నాస్వామి కొలువైన వేళా-2


మాటలు ఇంకేలనో..ఓ..మాటలు ఇంకేలనో

ఇద్దరు: సిగలోన విరిసిన సౌగంధికా చెలిమికి నీవే నవగీతిక


మా చెలిమికి నీవే నవగీతిక -2
Thanks to Telugu Movie Talkies for up loading the video to You Tube. Thanks to Ghantasala Galamrutamu-Patala Paalavelli (Sri Kolluru Bhaskara Rao garu) for the information about the movie.

20, జూన్ 2016, సోమవారం

మబ్బులు తొలగెనులే - అగ్గి బరాటా నుండి ఘంటసాల, సుశీల


1966 సంవత్సరంలో విడుదలైన శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన అగ్గిబరాటా చిత్రం నుండి ఘంటసాల మాస్టారుపి.సుశీల తో పాడిన మబ్బులు తొలిగెనులే అనే ఈ యుగళగీతం  రచన డా.సినారె, స్వరపరచినది  విజయా కృష్ణమూర్తి. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, రాజశ్రీ,రామదాసు, మిక్కిలినేని, ముక్కామల, వాణిశ్రీ.




చిత్రం: అగ్గి బరాటా (1966)


రచన: సి.నారాయణ రెడ్డి 


సంగీతం: విజయా కృష్ణమూర్తి 


గానం: ఘంటసాల, సుశీల


నిర్మాణం: శ్రీ విఠల్ ప్రొడక్షన్‌స్‌ వారి 





పల్లవి: ఘంటసాల: మబ్బులు తొలగెనులే, మనసులు వెలిగెనులే


సుశీల: ఇన్ని దినాలుగ కన్నుల కాచిన పున్నమి పూచెనులే



మబ్బులు తొలగెనులే, మనసులు వెలిగెనులే


ఘంటసాల: ఇన్ని దినాలుగ కన్నుల కాచిన పున్నమి పూచెనులే





చరణం: ఘంటసాల: అటు నీవు, ఇటు నేను ఒకరై మనమున్నాము -2



ఎటులైనా, ఏమైనా ఇక ఎన్నడు విడిపోము


సుశీల: చెంతగా చేరనీ


ఘంటసాల: వింతగా చూడనీ (వచనం)


సుశీల: పూలలో ఊగనీ, గాలినై సాగనీ


ఘంటసాల: మబ్బులు తొలగెనులే, మనసులు వెలిగెనులే


సుశీల: ఇన్ని దినాలుగ కన్నుల కాచిన పున్నమి పూచెనులే





చరణం: సుశీల: కలలన్నీ, కథలన్నీ పులకించెను నాలోనే -2



నీ చేయీ విడనోయీ, పయనించెద నీతోనే


ఘంటసాల: నిండుగా నవ్వనీ


సుశీల: చంద్రునీ నువ్వనీ (వచనం)


ఘంటసాల: అందమే దూయనీ, గంధమే పూయనీ


ఇద్దరు: మబ్బులు తొలగెనులే, మనసులు వెలిగెనులే



ఇన్ని దినాలుగ కన్నుల కాచిన పున్నమి పూచెనులే



మబ్బులు తొలగెనులే



12, ఏప్రిల్ 2015, ఆదివారం

ఆడవే జలకమ్ములాడవే - విచిత్ర కుటుంబం నుండి ఘంటసాల, సుశీల

ఒక విదేశీ వనిత (షీలా) భారతీయుడిని (శొభన్‌బాబు) పెండ్లి చేసుకుని వివాహానంతరం విహారయాత్రకు వెళితే, ఆ భర్త తన భార్యకు తన దేశ సంస్కృతిని, సాంప్రదాయాలకు దర్పణం పట్టే నదీనదాలను, చారిత్రక కట్టడాలను పరిచయం చేస్తూ పాడిన అద్భుతమైన గీతం 1969 లో శ్రీరాజ్ ఆర్ట్ ఫిలింస్ పతాకంపై విడుదలైన విచిత్ర కుటుంబం చిత్రం లోని "ఆడవే జలకమ్ములాడవే". ఇటువంటి ఇతివృత్తం గల గీతాన్ని  ప్రేక్షక శ్రోతలకు సినీ మాధ్యమం ద్వారా అందంగా అందించిన కవి, విశ్వనాథ సత్యనారాయణ వంటి మేటి కవుల తరువాత జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకొన్న 'విశ్వంభర' కావ్యకర్త సింగిరెడ్డి నారాయణరెడ్డి అయిన మన సినారె. ఆయన ఈ పాటలో ఆదికవి నన్నయ్యను, ఆంధ్ర సంస్కృతి తియ్యదనాన్ని, మహాయాన బౌద్ధమతాన్ని వ్యాపింపజేసిన ఆచార్య నాగార్జునుని, నదీనదాలైన గోదావరి తరంగాలను, కృష్ణవేణి తరంగిణిని, తుంగభద్ర తోయమాలికలను చక్కగా అభివర్ణించారు. అంతేకాదు "దేశభాషలందు తెలుగులెస్స"యని నొక్కి వక్కాణించి, ఆంధ్రభోజునిగా విఖ్యాతిగాంచిన శ్రీకృష్ణదేవరాయల ఘనతను, పాలనను చిరకాలం గుర్తుండేలా విరచించారు. మాస్టారి మధుర కంఠంతో కోకిల కూజితం వంటి సుశీల ఆలాపన ఈ పాటకు ఎంతో మాధుర్యాన్ని తెచ్చి మన మనసులలో చిరస్థాయిగా నిలిపాయి. ఈ పాటకు స్వరరచన చేసినది టి.వి.రాజు (తోటకూర వెంకట రాజు). విశేషమేమంటే ఎన్‌.టి.ఆర్., సావిత్రి లతో అగ్ర నటులు కృష్ణ, శోభన్‌బాబు కూడ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషించారు.


Thanks to TeluguOne for providing the You Tube video clip

ఆడియో: ఆడవే జలకమ్ములాడవే (విచిత్ర కుటుంబం)



చిత్రం: విచిత్ర కుటుంబం (1969)

రచన: సి.నారాయణ రెడ్డి 

సంగీతం: టి.వి.రాజు 

గానం: ఘంటసాల, సుశీల, బృందం



సాకీ: ఘంటసాల: రష్యాలో పుట్టి, భారతావనిలో మెట్టి  


తెలుగువారి కోడలివై వలపులొలుకు జాజిమల్లీ..ఈ..


వలపులొలుకు జాజిమల్లి 
పల్లవి: ఘంటసాల: ఆడవే…ఆడవే


ఆడవే జలకమ్ములాడవే..ఏ.ఏ. ఆడవే జలకమ్ములాడవే


కలహంసలాగ, జలకన్యలాగ 


కలహంసలాగ, జలకన్యలాగ ఆడవే…ఏ..ఏ..ఆడవే



చరణం: ఘంటసాల: ఆదికవి నన్నయ్య అవతరించిన నేల 

సుశీల: ఆ…ఆ…ఆ…ఆ…ఆ..

ఘంటసాల: తెలుగుభారతి అందియలు పల్కె యీ నేల 


ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై 


జీవకళలొల్కు గోదావరి తరంగాల ఆడవే..ఏ…ఏ…ఆడవే



చరణం: ఘంటసాల: నాగార్జునుని బోధనలు ఫలించిన చోట 

సుశీల: ఆ…ఆ…ఆ…ఆ…ఆ..

ఘంటసాల: బౌద్ధమత వృక్షమ్ము పల్లవించిన చోట 

బృందం: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి  

ఘంటసాల: కృష్ణవేణీ తరంగిణి జాలి గుండెయే


సాగరమ్మై రూపు సవరించుకొను నీట ఆడవే..ఏ..ఏ..ఆడవే



చరణం: ఘంటసాల: కత్తులును ఘంటములు కదను దొక్కినవిచట -2 


అంగళ్ళ రతనాలు అమ్మినారట యిచట 


నాటి రాయలపేరు నేటికిని తలపోయు 


తుంగభద్రానదీ తోయమాలికలందు ఆడవే..ఏ..ఏ..ఆడవే


ఆడవే జలకమ్ము లాడవే..ఏ..ఏ..ఆడవే జలకమ్ములాడవే

3, జులై 2014, గురువారం

"ఏకవీర" చిత్రం నుండి మహదేవన్‌ మధురబాణి "తోటలో నారాజు"

ఈ చిత్రం కోసం సినారె వ్రాసిన తోటలో నారాజు మామ మహదేవన్‌ కూర్చిన చక్కని బాణీ కల్యాణి రాగం లో ఘంటసాల, పి.సుశీల ఆలపించిన మధుర యుగళ గీతం. యవ్వనవతియైన యువతిని 'ఎలనాగ' (యౌవనవతి) అన్న చక్కని పదంతో అభివర్ణించారు. అలాగే 'పాటలాధర రాగభావనలు' అన్నారు. పాటల వర్ణం అంటే గులాబి రంగు. గులాబిరంగులోని అధరాల (పెదవుల) రాగాలు పలికే భావనలను చూశాను. ఎంత చక్కని కవి వర్ణన.  సినారె ఈ పాటలో. మరొక విషయం ఏమిటంటే పాటను ఎక్కువ భాగం అంత్యానుప్రాసలో వాసారు. అంటే ఇంచుమించు ప్రతి రెండు పంక్తులకు ఆఖరి అక్షరం ఒకటే అవుతుంది. ఉదా. నాు-నేు; పారిజాతాు-రమ్యగీతాు; ఇలా చాల చోట్ల కనిపిస్తుంది. ఇక ఆస్వాదించండి ఈ గీతాన్ని. 

Thanks to TeluguOne for posting the video to You Tube



చిత్రం: ఏకవీర (1969)

రచన: సి.నారాయణ రెడ్డి

సంగీతం: కె.వి.మహదేవన్‌

గానం: ఘంటసాల, పి.సుశీల

 

ప: సు: తోటలో నారాజు తొంగి చూచెను నాడు


నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు | తోటలో  |




చ: సు: నవ్వులా అవి? …... కావు!


నవ్వులా అవి?  కావు! నవ పారిజాతాలు


నవ్వులా అవి?  కావు! నవ పారిజాతాలు


రవ్వంత సడి లేని రస రమ్య గీతాలు | రవ్వంత |


ఆ రాజు ఈ రోజు అరుదెంచునా? | ఆ రాజు |


అపరంజి కలలన్ని చివురించునా? | తోటలో |




చ: ఘం: చాటుగా పొదరింటి మాటుగా వున్నాను | చాటుగా |


పాటలాధర రాగభావనలు కన్నాను


ఎలనాగ నయనాల కమలాలో దాగి | ఎలనాగ |


ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను | ఎదలోన |


ఆ పాట నాలో తీయగ మ్రోగనీ | ఆ పాట |


అనురాగ మధు ధారయై సాగనీ


ఊహూహు…ఊ..హూ..

సు: తోటలో నారాజు తొంగి చూచెను నాడు


నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడూ..ఊ..ఊ..

కృతజ్ఞతలు: సమాచారాన్ని పొందుపరచిన వికి పీడియాకు, వీడియో లభ్యం చేసిన తెలుగు వన్‌ కు మరియు యూ ట్యూబ్ వారికి ధన్యవాదములు.

20, జూన్ 2014, శుక్రవారం

మల్లియలారా మాలికలారా - నిర్దోషి నుండి మాస్టారి ఉపోద్ఘాతం తో

ఘంటసాల మాస్టారు పాడిన పాటలలో ఎక్కువ శాతం వ్రాసిన ఒకే ఒక కవి సి.నారాయణ రెడ్డి గారు. ఆయన తెలుగు చలన చిత్ర రంగప్రవేశం చేసిన చిత్రం గులేబకావళి కథ. ఆ చిత్రానికి ఆయన రాసిన మొదటి పాట "నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని" మాస్టారు, సుశీల పాడారు. మాస్టారు పాడిన విషాద గీతాలలో సినారె వ్రాసిన మల్లియలారా మాలికలారా మరపురాని గీతం. ఇది గౌతమి పిక్చర్సు పతాకం పై 1967 లో నిర్మించబడిన నిర్దోషి చిత్రం లోనిది. దీనికి సంగీత దర్శకత్వం మాస్టారే వహించారు. అయితే ఇదే పేరుతో మరొక సినిమా 1951 లో వచ్చింది దానికి మాస్టారు మరియు హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి గార్లు ఉభయులు సంగీత దర్సకత్వం వహించారు.ఒకసారి ఆకాశవాణి జనరంజని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఘంటసాల మాస్టారు 'మల్లియలారా' పాట గుఱించి, దానిని వ్రాసిన నారాయణ రెడ్డి గుఱించి ఇలా అన్నారు.
జనరంజని కార్యక్రమం లో ఘంటసాల ఉపోద్ఘాతం తో మల్లియలారా పాట ఇక్కడ వినండి.
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత



ఆడియో మూలం: వీడియో నుండి




చిత్రం: నిర్దోషి (1967)

రచన: సి.నారాయణ రెడ్డి

సంగీతం: ఘంటసాల

గానం: ఘంటసాల





హు.హు.హుహ్హుహుహు 

పల్లవి: మల్లియలారా, మాలికలారా మౌనముగా వున్నారా..


మా కధయే విన్నారా!


మల్లియలారా, మాలికలారా మౌనముగా వున్నారా..


మా కధయే విన్నారా!





హు.హు.హుహ్హుహుహు 

చరణం: జాబిలిలోనే జ్వాలలు రేగె, వెన్నెలలోనే చీకటి మూగె 


పలుకగ లేక, పదములు రాక 


పలుకగా లేక, పదములే రాక 


బ్రతుకే తానే బరువై సాగె


మల్లియలారా, మాలికలారా మౌనముగా వున్నారా..


మా కధయే విన్నారా!





హు.హు.హుహ్హుహుహు 

చరణం: చెదరిన వీణా రవళించేనా, జీవనరాగం చివురించేనా


చెదరిన వీణా రవళించేనా, జీవనరాగం చివురించేనా


కలతలు పోయి, వలపులు పొంగి 


కలతలే పోయి, వలపులే పొంగి 


మనసే లో లో పులకించేనా


మల్లియలారా, మాలికలారా మౌనముగా వున్నారా..


మా కధయే విన్నారా!


మల్లియలారా, మాలికలారా మౌనముగా వున్నారా..


మా కధయే విన్నారా!

కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారి శ్రవణ ఖండికను భద్రపరచి అందరు అభిమానులుకు అందుబాటులో వుండేట్టు నిక్షిప్తం చేసిన ఘంటసాల గాన చరిత నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

15, జూన్ 2014, ఆదివారం

ఓ! నాన్నా, నీ మనసే వెన్నా

జన్మనిచ్చిన వారు తల్లిదండ్రులు. వారిలో మొదటి స్థానం తల్లిది. తరువాత వచ్చేది తండ్రిది. పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దే విషయంలో తండ్రి కూడ కీలకమైన పాత్ర వహిస్తాడు. అందులో తల్లిలేని పిల్లల్ను పెంచడంలో తండ్రి బాద్యత మరింత పెరుగుతుంది. ఈ ఇతివృత్తంతో పిల్లలకు తానే తల్లీ తండ్రీ అయి పెంచి విద్యాబుద్ధులు చెప్పించి వారినుండి అభిమానాన్ని తప్ప మరేమీ ఆశించని పాత్రలోను, ఒక కొడుకు పాత్రలోను, ద్విపాత్రాభినయం చేసిన అక్కినేని నటనా కౌశలానికి మరొక నిదర్శనం రవీంద్ర ఆర్టు ఫిలింస్ పతాకం పై 1970లో నిర్మించబడిన ధర్మదాత చిత్రం. గతస్మృతులను నెమరువేసుకుంటూ ఈ పాట ఫాదర్స్ డే సందర్భంగా మీకు అందిస్తున్నాను.ఈ పాట వ్రాసినది సి.నారాయణ రెడ్డి, సంగీతం టి.చలపతి రావు, పాడినది ఘంటసాల, పి.సుశీల మరియు జయదేవ్.



చిత్రం: ధర్మదాత (1970)

రచన: సి.నారాయన రెడ్డి

సంగీతం: టి.చలపతి రావు

గానం: ఘంటసాల, ఫి.సుశీల, జయదేవ్




సాకీ: ఘంటసాల: ఓ! నాన్నా!  ఓ...నాన్నా! 
పల్లవి:
ఓ! నాన్నా, నీ మనసే వెన్నా


అమృతము కన్నా, అది యింతో మిన్నా


ఓ! నాన్నా, ఓ! నాన్నా




చరణం: ఘంటసాల: ముళ్ళబాటలో నీవు నడిచావు


పూల తోటలో మమ్ము నడిపావు

అందరు: ముళ్ళబాటలో నీవు నడిచావు


పూల తోటలో మమ్ము నడిపావు


ఏ పూట తిన్నావో, ఎన్ని పస్తులున్నావో

ఘంటసాల: పరమాన్నం మాకు దాచి వుంచావు 

అందరు: ఓ! నాన్నా, నీ మనసే వెన్నా


అమృతము కన్నా, అది యింతో మిన్నా


ఓ! నాన్నా, ఓ! నాన్నా








చరణం: సుశీల: పుట్టింది అమ్మ కడుపులోనైనా | పుట్టింది |


పాలు పట్టింది నీ చేతిలోన


ఊగింది ఉయ్యాలలోనైనా | ఊగింది |


నేను దాగింది నీ చల్లని ఒడిలోన


చల్లని ఒడిలోన

అందరు: ఓ! నాన్నా, నీ మనసే వెన్నా


అమృతము కన్నా, అది యింతో మిన్నా


ఓ! నాన్నా, ఓ! నాన్నా








చరణం: జయదేవ్: ఉన్ననాడు ఏమి దాచుకున్నావు


లెనినాడి చేయి చాచనన్నావు

అందరు: ఉన్ననాడు ఏమి దాచుకున్నావు


లెనినాడి చేయి చాచనన్నావు


నీ రాచ గుణమే మా మూలధనము


నీవే మా పాలి దైవము 


ఓ! నాన్నా, నీ మనసే వెన్నా


అమృతము కన్నా, అది యింతో మిన్నా


ఓ! నాన్నా, ఓ! నాన్నా





Thanks to DivyaMedia for providing the Video Clip and to You Tube for hosting the clip.

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన "క" నుంచి "జ" చిత్రాలు

చి-కథానాయిక మొల్ల-1970 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్నతల్లి-1953 (2) చి-కన్నతల్లి-1972 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొండవీటి దొంగ(డ)-1958 (1) చి-కొడుకు కోడలు-1972 (1) చి-కోటీశ్వరుడు (డ)-1970 (1) చి-గంగా గౌరీ సంవాదము(డ)-1958 (1) చి-గాంధారి గర్వభంగం(డ)-1959 (2) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (4) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1)

మాస్టారు పాడిన "ట" నుంచి "న" చిత్రాలు

చి-టింగ్ రంగా-1952 (5) చి-టైగర్ రాముడు-1962 (1) చి-టౌన్‌ బస్ (డ)-1957 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తలవంచని వీరుడు(డ)-1957 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (2) చి-దశావతారములు(డ)-1962 (1) చి-దసరా బుల్లోడు-1971 (1) చి-దసరాబుల్లోడు-1971 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (6) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొంగ రాముడు-1955 (2) చి-దొంగనోట్లు (డ)-1964 (2) చి-దొరబాబు-1974 (3) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (2) చి-నిర్దోషి-1967 (1)

మాస్టారు పాడిన "ప" చిత్రాలు

చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (3) చి-పరోపకారం-1953 (3) చి-పల్నాటి యుద్ధం-1947 (4) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (3) చి-పల్లెటూరు-1952 (11) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (6) చి-పిచ్చి పుల్లయ్య-1953 (2) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెంపుడు కొడుకు-1953 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (11) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రాయశ్చిత్తం(డ)-1962 (3) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (3) చి-ప్రేమలు పెళ్ళిళ్ళు-1974 (1)

"బ, భ, మ" - చిత్రాలు

చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడిపంతులు-1972 (3) చి-బభ్రువాహన-1964 (3) చి-బలిపీఠం-1975 (1) చి-బలే బావ-1957 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (3) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (3) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (4) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భలేపాప-1971 (1) చి-భాగ్యదేవత-1959 (3) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భాగ్యవంతులు (డ)-1962 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మదన మంజరి(డ)-1961 (1) చి-మనదేశం-1949 (17) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (4) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (7) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1)

మాస్టారు పాడిన "య, ర, ల, వ" చిత్రాలు

చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (2) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (3) చి-రణభేరి-1968 (2) చి-రత్నగిరి రహస్యం (డ)-1957 (2) చి-రత్నమాల-1948 (1) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (5) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-లైలా మజ్ను-1949 (5) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాలి సుగ్రీవ-1950 (2) చి-వాల్మీకి-1963 (2) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విప్లవ స్త్రీ (డ)-1961 (1) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరఖడ్గము(డ)-1958 (1) చి-వీరాంజనేయ-1968 (2) చి-వీరాభిమన్యు-1965 (9) చి-వెలుగు నీడలు-1961 (4)

మాస్టారు పాడిన "శ,ష" చిత్రాలు

చి-శకుంతల-1966 (10) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శభాష్ సత్యం-1969 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (2) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వల్లీ కల్యాణం (డ)-1962 (1) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (3) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణతులాభారం-1966 (5) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జునయుద్ధం-1963 (1) చి-శ్రీదేవి-1970 (1) చి-శ్రీమతి-1966 (3) చి-శ్రీరామభక్త హనుమాన్ (డ)-1958 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-శ్రీశైల మహత్యం(డ)-1962 (1) చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964 (6) చి-శ్రీసింహాచలక్షేత్రమహిమ-1965 (2) చి-షావుకారు-1950 (2)

సహగాయనీ గాయకులు

గా-L.R.ఈశ్వరి తో (1) గా-M.S.రామారావు-పి.సుశీల తో (1) గా-ఎ.పి.కోమల తో (4) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (7) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (142) గా-ఘంటసాల-బృందం (4) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (10) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (15) గా-పి.లీల తో (25) గా-పి.లీల-బృందం తో (1) గా-పి.సుశీల తో (77) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పి.సుశీల-వసంత తో (1) గా-పిఠాపురం తో (2) గా-బహుగళం తో (2) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (45) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (4) గా-సి.కృష్ణవేణి-బృందం తో (1) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

సం -టి.వి.రాజు (1) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1) సం-S.L.మర్చెంట్-M.Sశ్రీరామ్ (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (7) సం-ఆదినారాయణరావు (7) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (3) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎ.ఎం.రాజా (2) సం-ఎం.ఎస్.విశ్వనాథన్ (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (14) సం-ఎస్.రాజేశ్వరరావు (1) సం-ఓగిరాల (4) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (3) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (3) సం-గాలి పెంచల (7) సం-ఘంటసాల (144) సం-చక్రవర్తి (1) సం-జి.కె.వెంకటేష్ (1) సం-జె.వి.రాఘవులు (4) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (4) సం-టి.వి.రాజు (34) సం-టి.వి.రాజు-దినకరరావు (5) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-నిత్యానంద్ (3) సం-పామర్తి (6) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.ఆదినారాయణరావు (3) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (48) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (15) సం-ముగ్గురు దర్శకులు (1) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయభాస్కర్ (1) సం-విజయా కృష్ణమూర్తి (4) సం-విజయాకృష్ణమూర్తి (1) సం-విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్ (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (4) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్-పామర్తి (1) సం-సాలూరు (49) సం-సాలూరు-గోపాలం (2) సం-సి.ఆర్.సుబ్బురామన్ (17) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (20) సం-హనుమంతరావు (2)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (16) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (28) ర-ఆరుద్ర (48) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొనకళ్ళ (1) ర-కొసరాజు (20) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (4) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-డా. సినారె (1) ర-డా.సినారె (7) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (15) ర-తిక్కన (3) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (12) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (5) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (45) ర-బమ్మెఱ పోతన (3) ర-బలిజేపల్లి (2) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (6) ర-బైరాగి (1) ర-భక్త నరసింహ మెహతా (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (9) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (3) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (5) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (34) ర-సదాశివ బ్రహ్మం (9) ర-సదాశివబ్రహ్మం (4) ర-సముద్రాల జూ. (25) ర-సముద్రాల సీ. (79) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (8) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (1) రచన-బలిజేపల్లి (1)