1955 లో విడుదల అయిన చిత్రం పసుపు-కుంకుమ. ఇందులో జి.వరలక్ష్మి, కొంగర జగ్గయ్య గార్లు నాయికా నాయకులు. చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు ప్రముఖ కన్నడ సంగీత దర్శకులు, సంగీత కలాన్మణి శ్రీ ఎం. రంగా రావు గారు. వీరు భక్తి సంగీతానికి కొన్ని ప్రైవేట్ ఆల్బములు తయారు చేసారు. ఈయన స్వరపరచిన పాటలలో ప్రైవేట్ ఆల్బం "భక్తి పాటలు" వివిధ దేవుళ్ళ పై శ్రీ పి.బి.శ్రీనివాస్ గారు రచించిన భక్తి గీతాలను శ్రీమతి ఎస్.జానకి గారు పాడారు. అంతే కాక రంగారావు గారు తిరుపతి వేకంటేశ్వరుని పై "శ్రీ వెంకటేశ్వర మహోత్సవ సేవలు" అనే భక్తిమాలను కూడా స్వరపరిచారు. ఇంకొక విషయం ఏమిటంటే, రంగారావు గారు శ్రీ ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం గారికి తను సంగీత దర్శకత్వం వహించిన "నక్కరే అదే స్వర్గ" అనే కన్నడ చిత్రంలో పాడే అవకాశం కల్పించి బాలును కన్నడ చిత్ర సీమకు పరిచయం చేసారట.పసుపు కుంకుమ చిత్రానికి మాస్టారు ఒకే ఒక పాట పాడారు. ఈ పాటను అభ్యుదయ కవి గా ప్రఖ్యాతి గాంచిన శ్రీ అనిసెట్టి సుబ్బారావు గారు వ్రాసారు. ఆయన అగ్నివీణ, ఖండకావ్యం వంటి పేరెన్నికగన్న రచనలు చేసారు. నిరుపేదలు, పిచ్చిపుల్లయ్య చిత్రాలకు మాటలను, పాటలను సమకూర్చారు. అంతేకాక కొన్ని డబ్బింగ్ చిత్రాలకు కూడ తన రచనలను అందించారు. 1969
లో విడుదలయిన "కన్నుల పండుగ" అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.మరుగున పడియున్న ఈ ఆణిముత్యాన్ని పాటను వెదకి, సానపట్టి మనకందించిన ఘంటసాల అభిమానులకు కృతజ్ఞతలు. ఈ పాట యొక్క ఆడియో, సాహిత్యాలను ఇక్కడ పొందు పరుస్తున్నాను.
చిత్రం: పసుపు కుంకుమ (1955)
రచన: అనిసెట్టి సుబ్బారావు
సంగీతం: ఎం. రంగారావు
గానం: ఘంటసాల
ఆ..ఆ..ఆ..ఆ...ఆ
ప. నీవేనా! నిజమేనా! | నీవేనా |
జీవన రాణివి నీవేనా
నా జీవన రాణివి నీవేనా
చ. పూల తీగవో, పొంగే నదివో
తళుకు మెరుపువో, తలికి వెన్నెలవో | పూల |
మమత గొలుపు అందాల సునిథివో | మమత |
అరుగ యవ్వనానందపు సుధవో
నీవేనా! నిజమేనా!
చ. నీలి నీడలో, నీ ముంగురులో,
కమలములో, నీ నయనములో | నీలి నీడలో |
మరుని విల్లు ఇరువైపుల సాగిన | మరుని |
విరుల తూపులో, వాలు చూపులో
నీవేనా! నిజమేనా!
చ. చిందు రవళిలో కలల శయ్యపై
నను వరించు నవ మోహినివేమో... | చిందు |
అఖిలావనిలో శోభవింపగా | అఖిలా |
అవతరించిన దేవతవేమో
నీవేనా! నిజమేనా! జీవన రాణివి నీవేనా
నా జీవన రాణివి నీవేనా ..నిజమేనా..