22, నవంబర్ 2014, శనివారం

అరుదైన ఘంటసాల పాట "సాగుమా సాహిణీ"- స్వప్న సుందరి నుండి


ఘంటసాల బలరామయ్య గారి ప్రసిద్ధి చెందిన చిత్ర సంస్థ ప్రతిభ ఫిలింస్ 1950 లో నిర్మించిన జానపద చిత్రం "స్వప్న సుందరి". ఒకానొక రాజ కుమారుడు ఒక స్వప్న సుందరిని ఊహించుకోవడం, ఆమె కోసం వెతకడం, అనుకోకుండా ఆమె కనిపించడం, ఆమె లోకానికి తను వెళ్ళడం, ఒక మాంత్రికుని దుష్ట చర్యలకు లోనవడం ఆఖరికి మాంత్రికుని చంపడం వగైరా గల సగటు జానపద చిత్రం స్వప్న సుందరి. ఈ చిత్రానికి సంగీతం అలనాటి మేటి దర్శకులు సి. ఆర్. సుబ్బురామన్ మరియు గీత కర్త సముద్రాల రాఘవాచార్యులు.  ఈ చిత్రానికి దర్శక-నిర్మాత ఘంటసాల బలరామయ్య.  నాయికా నాయకులు అంజలీదేవి, ఎ.ఎన్.ఆర్. ఈ చిత్రంలో మాస్టారు కొన్ని యుగళగీతాలతో పాటు సాగుమా సాహిణీ (గుఱ్ఱపు రౌతు) అనే చక్కని భావ గీతాన్ని పాడారు. ఆలకించి ఆనందించండి. 




చిత్రం: స్వప్న సుందరి (1950)

గానం: ఘంటసాల

సంగీతం: సి.ఆర్.సుబ్బురామన్‌

రచన: సముద్రాల రాఘవాచార్య 




పల్లవి: సాగుమా..ఆ..ఆ.. సాగుమ సాహిణీ


సాగుమా..ఆ..ఆ.. సాగుమ సాహిణీ


ఆగని వేగమె జీవితము, ఆగని వేగమె జీవితము 


ఎవరికోసమో ఏ దరికో ఎరుగక, అడుగక, వేసరక


ఎవరికోసమో ఏ దరికో ఎరుగక, అడుగక, వేసరక


జీవకోటి తరలే..ఏ..ఏ..  జీవకోటి తరలే ఏ..


మధుర మహాప్రస్థానములో


సాగుమా సాహిణీ, ఆగని వేగమె జీవితము




చరణం: ఆ..హా..ఆ..హా


కనుపడువరకే కాదీ లోకం, కలదింకెంతో సౌందర్యం


కనుపడువరకే కాదీ లోకం కలదింకెంతో సౌందర్యం


దారిపొడుగునా పందిళ్ళే, ఆటలు పాటలు పెళ్ళిళ్ళే


దారిపొడుగునా పందిళ్ళే, ఆటలు పాటలు పెళ్ళిళ్ళే


సాగుమా సాహిణీ, ఆగని వేగమె జీవితము




చరణం: వెలుగునీడ జలతారు తెరలలో ఓ..ఓ, ఆశనిరాశల అల్లికలో ఓ..ఓ


వెలుగునీడ జలతారు తెరలలో, ఆశనిరాశల అల్లికలో


వేసే పిలుపుల మూసే తలుపుల కలకలములుగల కలలో 


కలకలములుగల కలలో ఓ..


సాగుమా సాహిణీ, ఆగని వేగమె జీవితము


ఆగని వేగమె జీవితము, సాగుమా..

16, నవంబర్ 2014, ఆదివారం

జన ప్రియమైన 'షణ్ముఖప్రియ' రాగంలో ఘంటసాల భావరసమాల

రాగావిష్కరణకు మరియు రసావిష్కరణకు ఘంటసాల పెట్టింది పేరు. మాస్టారు ఇటు కర్నాటక సంగీతంలోను అటు హిందుస్తానీ సంగీతంలోను కూడ బాణీలు కట్టారు మరియు తన అద్భుత గాన ప్రతిభతో పలు సినీ కవుల, ప్రబంధ కవుల సాహిత్యానికి ప్రాణం పోసారు. ఇదివరలో కొన్ని ప్రసిద్ధ రాగాలైన మలయమారుతం, ఆరభి, సామ, శుద్ధ సావేరి, చారుకేశి, దేశ్, నాటకప్రియ, పటదీప్, పంతువరాళి, హిందోళం మొదటి భాగం మరియు హిందోళం రెండవ భాగం, ఫరజు, విజయానంద చంద్రిక, సింహేంద్ర మధ్యమం మొదలయిన రాగాల గుఱించి మిత్రులు చంద్రమౌళి గారు చక్కని వ్యాసాలు అందించారు. ఈ సారి మరొక జనరంజకమైన రాగం షణ్ముఖప్రియ గురించి, ఆ రాగంలో మాస్టారు ఆలపించిన పాటలు పద్యాల గురించి తెలుసుకుందాం. మరి రాగశాలలోకి అడుగు పెడదామా?  
మానవుడు జీవిత సంఘర్షణలో నలిగేవేళ, ఏంచెయ్యాలొ తెలియని సంధిగ్ధతలో ఉన్నప్పుడు కర్తవ్యమేమిటి? జీవితం సమరం గాక, సార్థ సోపానముగా మలచుకొనట ఎలా? అందుకు మన శాస్త్ర్రాలు మూడుమార్గాలను చూపుతాయి. జ్ఞానపరమైన నిత్యానిత్య వివేకము, కర్తవ్య నిర్వహణ మరియు దైవభక్తి. అయితే దైవభక్తికి గుడి, ఫల, పుష్ప, గంధ, కర్పూర, దీప, ధూప, నైవేద్యాలు కావాలి. ఆ ప్రకియలో దేహము, మనస్సు, బుద్ధి మూడూ చేరినప్పుడే భక్తిపారవశ్యం కలుగుతుంది. ఇవన్నీ లేకుండా రెప్పపాటులోనే భక్తి కలగాలంటే, మనస్సునొక చోట నిలుపగలగాలి. అదే కదా భక్తి. "హే కృష్ణా ! ముకుందా...." అని తారాస్థాయిలో ఘంటసాల గళం వినగానే మనస్సు అక్కడే హత్తుకుపోయి నిలబడునుగదా!  గాయకునికి అంతటి తీవ్రభావము లేకపోతే ఆ పరిణామం సమకూరేనా! పద్యశ్లోకాలాపనము, వచనప్రవచనము, శాస్త్రీయగానము, ఏకగళ భావగీతమధురిమలు, రసగుళికలు కూర్చిన యుగళగీతములు, భక్తిపాటలు మొదలగు ఈ ఆరువిధముల గాన ప్రక్రియలను పలికించగల షణ్ముఖమైన గళమంగళుడు ఘంటసాల. 'కోరికలతీర్చేటి కొంగుబంగారమైన' తిరువేంకటాధీశుని, 'కరుణనేలగరావె కమలేశా’ అంటూ షణ్ముఖప్రియరాగంలో ఆలపించి, పిలిచినంతనె ఆ గాయక శిఖామణిని తన ఆస్థానవిద్వాంసుడుగానే రమ్మన్నాడు ఆ శేషాద్రివాసుడు.  'స్థాన బలిమి నీది, నీ ఆస్థానబలిమినాది, దేవస్థానమాయె హృది’ అన్న మంగళంపల్లి బాలమురళికృష్ణ వాగ్గేయం, అచ్చంగా ఘంటసాలకు అన్వయిస్తుంది.

"ఆయన చాలబాగా క్లాసికల్ పాడేవారు. ఆకాశవాణిలో ఒకరోజు తోడిరాగాన్ని ఆలాపనజేసి 'అంబా నాపై' కీర్తన పాడారు. 'ఎవరో ఆంధ్రా అబ్బాయట! ఎంత బాగ క్లాసికల్ పాడుతున్నాడు' అంటూ ఆకాశవాణి ఆఫీసులో మేమందరూ మేచ్చుకున్నాం, 'నేను విన్నాను' అంటారు ఏ. పి. కోమల".  "అప్పట్లో నేరు ప్రసారమే తప్ప, టేపులూ అవీ లేవు, స్టుడియోకి వచ్చి, పాడి, తిరిగి కారులోవెళ్ళిపొవటమే". "ఎందుకో ఆయన అంతబాగ పాడుతున్న క్లాసికల్ వదిలేసారు" అంటు కోమలగారు చెబుతుంటే, మనకు లభ్యంలేని ఆ వినికిడి, గాలిలో కలిసిపోయిన ఆనాటి ఘంటసాల శాస్త్రీయగానం నిరాశగానే మిగులుతుంది. శాస్త్రీయ సంగీతంపై అంతటి అవగాహన, ప్రావీణ్యత ఆయన గానపద్ధతిలో, బాణీకట్టడంలో, ఏ గొంతులో ఏసంగతులు పలుకుతాయో తెలిసి పాడించటంలో 'లవకుశ’ లాంటి సినిమా మనకు కనబడే ఒక చక్కని ఉదాహరణ.

ఘంటసాలకు ప్రియమైన రాగాలలో షణ్ముఖప్రియ ఒక ప్రముఖరాగం. తన భగవద్గీతాగానంలో ఆలపించిన రెండు శ్లోకాలు "త్రివిధం నరకస్యేదం" (16-21) "యః శాస్త్రవిధిముత్సృజ్య" (16-23) షణ్ముఖప్రియరాగనిబద్ధము.  స్వీయ సంగీత దర్శకత్వంలో "సతి అనసూయ (1957)" చిత్రానికై పాడిన " ఉదయించునోయి నీ జీవితాన" చిన్నపాటైనా షణ్ముఖరాగరసపాకం.

ఎన్నో చిత్రగీతాలకు మూలమైనది నఠభైరవిరాగం. ఆ రాగంగురించి రాస్తే ఒక చిన్న పుస్తకమే ఔతుంది. రాగశాలలో ఏదో ఒక రోజు అది కనిపించవచ్చు. ఆ నఠభైరవిరాగం యొక్క ప్రతిమధ్యమ రూపమే షణ్ముఖప్రియ. షణ్ముఖప్రియ రసవంతమైన 56వ మేళకర్త రాగం.  ప్రతిమధ్యమ రాగాలలో ప్రసిద్ధమైనవి కళ్యాణి, కామవర్ధిని, పూర్వికళ్యాణి, సింహేంద్రమధ్యమం మరియు షణ్ముఖప్రియ. కళ్యాణి, కామవర్ధినుల తరువాతి స్థానం షణ్ముఖప్రియరాగానిదే అనవచ్చు. భావరస ప్రకటన ప్రస్ఫుటంగా విలసిల్లే వ్యక్తిత్వమున్నరాగమిది. స్వరస్థానాలు, 'స-ప'లు గాక, చతుశ్రుతిరిషభము, సాధారణగాంధారము, ప్రతిమధ్యమము, శుద్ధ ధైవతము, కైశికి నిషాదము ఉంటాయీ రాగంలో. కరుణ, భక్తి, శాంత రసాలను రంజింపజేయు రాగమిది. రాగం-తానం-పల్లవి, రాగమాలికలు, శ్లోకాలాపనలకు తగినరాగం షణ్ముఖప్రియ. ఉత్తరాంగ ప్రధానమైన ఈ రాగంలోని  గాంధార స్వరంలో గ్రహభేదం చేస్తే శూలిని,  పంచమంలో ధేనుక, దైవతంలో చిత్రాంబరి రాగాలు వస్తాయి. వేంకటముఖి సంప్రదాయంలో ఈ రాగం పేరు "చామరం". దీక్షితుల "మహాసురం", పట్ణం సుబ్రహ్మణ్య అయ్యర్ కృత "మరివేరె దిక్కెవరయ్య రామ", ముత్తయ్య భాగవతార్ వారి "వల్లీ నాయకనే" ప్రసిద్ధమైన కృతులు. త్యాగరాజస్వామి ఈ రాగంలో కృతులను రచించకపోవడం గమనార్హం.  మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఈ రాగంలో రచించిన "ఓంకార ప్రణవ"  వర్ణం, "సదా తవపాద సన్నిధిం కురు" అను కీర్తన మనోహరమధురంగా చాలా ప్రసిద్ధిగాంచినవి.

షణ్ముఖప్రియ మనోబుద్ధులను సంక్రమించి వెలిగి గాయకుని కల్పనలకు పదునుపెట్టే రాగం. భక్తి, శృంగార, కరుణ, అద్భుత, హాస్య భావాలను వెదజల్లే ప్రముఖ రాగం. మనోధర్మ సంగీతానికి మధురమైనదిది. ఆలాపనలకు ఆణిముత్యం. రాగం తానం పల్లవికి రారాజు. ఇందులోని అన్నిస్వరాలూ జీవస్వరాలే. పదనీస ప్రయోగంలో- నిషాద దీర్ఘంతో వీనులవిందు కలిగిస్తుంది.  రి, ప, ని న్యాసస్వరాలై 'సగరిగమప, మపదనిదస, దపదస, సమపనిస, మపగగరిస’ వంటి విశేష ప్రయోగాలతో త్రిస్థాయిలోనూ రంజిల్లే రాగమైనా 'ఘన'రాగ కీర్తికి ఎందూకో నోచుకోలేదు. షణ్ముఖుడు, అనగా సుభ్రహ్మణ్యస్వామికి ప్రియమైన రాగం. అతడే ప్రియపుత్రుడైన అమ్మవారికీ ఈ రాగమంటె మక్కువ.
          ఘంటసాల స్వరకల్పనజేసి పాడిన ఉదయించునోయి (సతి అనసూయ- 1957) కరుణరసాన్ని కురిపించే పాట. ఉత్తరాంగ ప్రధామైన స్వరాలలో తారకంలోనె ప్రారంభమై, దుఃఖితులకు, ముందున్న మంచిదినాల ఆశ్వాసను కలిగించే 'ఉదయించునో...యి' ఆ ..నో...యి" పలుకుల  గమకప్రయోగం గమనీయము.
ఈ భావంలోనే, స్వీయదర్శకత్వంలో ఆలపించన పాట పుణ్యవతీ ఓ త్యాగవతి (సతీసుకన్య 1959)
ఘంటసాల గళంలో ఇంతకుముందే సుసర్ల దర్శకత్వంలో వెలుబడిన దేవి శ్రీదేవి (సంతానం - 1955), షణ్ముఖప్రియరాగంలో ఆయన ఆలపించిన మొదటిపాట అనవచ్చునేమో.

'తిరువేంకటాధీశ జగదీశ' (ప్రైవేట్ ఆల్బం): బహుప్రజాదరణపొందిన భక్తిరసభావఖండిక

'సుఖపడుటే సుఖమై' (అనగనగా ఒకరాజు 1959) ఒక డబ్బింగ్ చిత్రం (అనగా అనగా ఒక రాజు) కోసమై పాడిన పాట. గాంభిర్యప్రధామై నీతిబోధనే ప్రముఖాంశమైన పాట.

షణ్ముఖప్రియ రాగాధారిత పద్యశ్లోకగానంలో ఘంటసాల,  అన్నిభావాలనూ రసాలనూ వెలువరించారు. ఇవిగో కొన్ని ఉదాహరణలు:  
తన వెంటన్‌ సిరి (షావుకారు)

ఆయిక అమల హృదయ (గౌరీ మహాత్మ్యం)

ఏ వెలకైన (హరిశ్చంద్ర)


జననీ నీ శుభదర్శనంబు (రహస్యం)


స్వామీ చంచలమైన చిత్తమిదే (కాళహస్తి మహాత్మ్యం)

భళిరా పుణ్యమటన్న (భక్త జయదేవ)


తరుణ శశాంక (తెనాలి రామకృష్ణ)


వరుణాలయ (నల దమయంతి)
తీవ్ర దుఃఖ సన్నివేశం: అంతటి రాజచంద్రునకాత్మజ (హరిశ్చంద్ర)
ఈ సారి మరొక రాగం గురించి తెలుసుకుందాం. అంతవరకు శలవు.

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (1) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (2) చి-పరోపకారం-1953 (2) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (3) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (3) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (1) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (2) చి-వెలుగునీదలు-1961 (1) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీ సత్యనారాయణ మహత్యం-1964 (2) చి-శ్రీ సింహాచలక్షేత్ర మహిమ-1965 (1) చి-శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (2) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (3) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (5) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (79) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (49) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (35) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (12) సం-ఓగిరాల (1) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (2) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (79) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (31) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (5) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (38) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (2) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (5) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (13) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (18) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (39) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (3) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (26) ర-బమ్మెఱ పోతన (2) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (2) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (4) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (28) ర-సదాశివ బ్రహ్మం (9) ర-సముద్రాల జూ. (20) ర-సముద్రాల సీ. (42) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1) రచన-సముద్రాల సీ. (1)