బ్రహ్మచారి మనసులో ఎలాంటి రసమయ భావాలున్నాయో తెలుసుకోవాలంటే అవి తన కలలకు ప్రతిరూపమైన కన్నెపిల్ల ఎదటపడినపుడు తమంత తామే ఆ భావాలు గుండెలోతుల్లోంచి పెల్లుబికి బయటపడతాయి. ఇరువురి చూపులు కలసిన వేళ కలిగిన పరస్పర రసస్పందనలు ఆ అబ్బాయి మనసును కవితామయం చేసి ఆ అమ్మాయి కులుకుల నడకలను, వలపుల తలపులను, నగవుల సొగసులను వర్ణిస్తూ అనురాగాన్ని ప్రస్ఫుటింపజేస్తాయి. 1952 లో విడుదలైన ఎన్.టి.ఆర్., సావిత్రి జంటగా నటించిన పల్లెటూరు చిత్రానికి సుంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కరరావు వ్రాసిన ఆ మనసులోన అన్న పాటను మాస్టారు అభుతమైన బాణీ కట్టి అంతకంటె మనోహరంగా పాడారు. ఈ సన్నివేశంలో ఎన్.టి.ఆర్, సావిత్రిల నటన అపూర్వం.
| చిత్రం: | పల్లెటూరు (1952) | ||
| రచన: | సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు | ||
| సంగీతం: | ఘంటసాల వెంకటేశ్వర రావు | ||
| గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు | ||
| సాకీ: | ఆ మనసులోన, ఆ చూపులోన | ||
| హు.హు.హు.. | |||
| పల్లవి: | ఆ మనసులోన ఆ చూపులోన | ||
| పరుగులెత్తే మృదుల భావనా మాలికల | |||
| అర్థమేమిటొ తెల్పుమా, ఆశయేమిటొ చెప్పుమా | |||
| చరణం: | ఆ నడకలోన, ఆ నడకలోన | ||
| దొరలు ఆ నునుసిగ్గు దొంతరలపై మొగ్గు | |||
| అంతరార్థము తెల్పుమా, ఆశయము వివరింపుమా | |||
| చరణం: | ఆ కులుకులోన, ఆ పలుకులోన | ||
| పెనవేసికొనియున్న, వెలికిరాలేకున్న-2 | |||
| తలపులేమో తెల్పుమా | |||
| వలపులేవో చెప్పుమా -2 | |||
| చరణం: | ఆ సొగసులోన, ఆ నగవులోన | ||
| తొగరువా తెరగప్పి చిగురించు కోరికల..ఆ..ఆ.. | |||
| తొగరువా తెరగప్పి చిగురించు కోరికల | |||
| మరుగదేమిటొ తెల్పుమా | |||
| తెరగదేమిటొ చెప్పుమా | |||
| చరణం: | ఆ... హృదిలో, ఈ... మదిలో | ||
| పొటమరించిన ప్రేమ దిటవుగా పాదుకొని -2 | |||
| పరిమళించునె తెల్పుమా | |||
| ఫలితమిత్తునె చెప్పుమా -2 | |||
| ఆ…మనసులోనా |

